Sunday, April 14, 2024

Logo
Loading...
upload upload upload

nara chandrababunaidu

టీడీపీలో చేరిన మరో వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. గత కొంత కాలంగా వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తీరుపట్ల అసంతృప్తిగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ ఎట్టకేలకు టీడీపీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగి మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరావును ఓడించి సంచలనం సృష్టించారు.వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరలా అక్కడ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. జనసేన, టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరి సహకారంతో మైలవరంలో పోటీ చేయనున్నట్లు రెండు రోజుల కిందటే ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.

K Venkateswara Rao | 10:20 AM, Sat Mar 02, 2024

కాసేపట్లో టీడీపీ జనసేన అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన

టీడీపీ జనసేన అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన

K Venkateswara Rao | 11:08 AM, Sat Feb 24, 2024

చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ వాయిదా

స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు మంజూరు చేసిన బెయిల్‌ను, రద్దు చేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణను సుప్రీంకోర్టు (supreme court ) వాయిదా వేసింది. జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిల సుప్రీం ధర్మాసనం ఈ విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కేసును మూడు వారాలు వాయిదా వేయాలని కోరారు.ఏపీ సీఐడి తరపున న్యాయవాది రంజిత్ కుమార్ స్పందిస్తూ, కౌంటర్ దాఖలు చేయడానికి ఇప్పటికే చాలా సమయం తీసుకున్నారని, మరలా సమయం కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటర్ దాఖలు చేశారని, విచారణ చేపట్టాలని కోరారు. తొలుత రెండు వారాల తరవాత విచారణ చేపట్టాలని భావించిన ధర్మాసనం, రంజిత్ కుమార్ వాదనల తరవాత కేసు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.

K Venkateswara Rao | 13:35 PM, Mon Feb 12, 2024

పొత్తులు ఎత్తులు : చంద్రబాబు ఢిల్లీ పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిని రేకెత్తించింది. బుధవారంనాడు ప్రత్యేక విమానంలో హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబునాయుడు, రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. అయితే చర్చల సారాంశం మాత్రం మీడియాకు వెల్లడించలేదు.425 సీట్లు లక్ష్యంగా బీజేపీ పావులు

కేంద్ర బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించేందుకు పాత మిత్రులను దగ్గరకు తీస్తోంది. ఇప్పటికే బిహార్‌లో కొరకరాని కొయ్యలా మారిన సీఎం నితీష్ కుమార్‌ను (bihar chief minister nitish kumar) ఎన్డీయే కూటమిలో చేర్చుకున్నారు. ఇక కర్ణాటకలో జేడీయస్‌ను దగ్గరకు చేరదీశారు. నేడో రేపో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఎన్డీయేలో చేరతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాదిలో కూడా బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఏపీలో పాత మిత్రుడు చంద్రబాబును ఎన్డీయేలో (NDA) చేర్చుకునేందుకు బీజేపీ సిద్దమవుతోంది. ఏపీలో బీజేపీ ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉంది. ఇక టీడీపీని కూడా కలుపుకుంటే ముగ్గురు మిత్రుల కూటమి ద్వారా కనీసం ఏపీలో 23 సీట్లు సాధించవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. తమకు పెద్దగా బలం లేని రాష్ట్రాల్లో ప్రాంతీయ శక్తులను కలుపుకుని పోవాలని బీజేపీ భావిస్తోంది. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ బలపడకుండా ఇండీ కూటమికి చావుదెబ్బకొట్టే వ్యూహం అమలు చేస్తోంది.
చంద్రబాబు ఢిల్లీ పర్యటన

ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు ఖరారైంది. అయితే బీజేపీ కూడా వీరితో చేతులు కలిపితే,ఇక అభ్యర్థుల ప్రకటనే తరువాయి. గతంలో చంద్రబాబునాయుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఒకసారి కలసినా అడుగు ముందుకు పడలేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఇక ఆలస్యం చేయకుండా పొత్తులు, సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని మరో వారం రోజుల్లో తేల్చాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆలస్యం అయ్యే కొద్దీ నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ఏపీలో టీడీపీ, జనసేన పొత్తులో బీజేపీ కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు చంద్రబాబు (telugudesam party president nara chandrababu delhi tour) కూడా ఆత్రుతగా ఉండటంతో బీజేపీ నేతలు ఎంపీ సీట్లు ఎక్కువగా సాధించుకునేందుకు పట్టుబట్టే అవకాశముంది.నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్

కేంద్ర బీజేపీ పెద్దలు పొత్తుల వ్యవహారాన్ని తేల్చి వేసేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే బిహార్ నుంచి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అంతకు ముందే కర్ణాటకలో జేడీయస్‌ను ఎన్డీయేలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు సంకేతాలు పంపారు. ఇక కాంగ్రెస్‌తో అంటకాగిన పార్టీలు కూడా ఇండీ కూటమి నుంచి బయటకు వస్తే ఎన్డీయేలో చేర్చుకునే ప్రణాళిక అమల్లోకి తీసుకువచ్చారు. ఇందులో భాగంగానే బిహార్‌లో నితీష్ కుమార్‌ను ఎన్టీయేలో చేర్చుకున్నారని తెలుస్తోంది. ఏపీ విషయానికి వస్తే... ఇక్కడ బీజేపీకి పెద్దగా పట్టులేదు. పట్టుమని పది సీట్లు కూడా గెలిచే సామర్థ్యం లేదు. జనసేన, టీడీపీతో చేతులు కలిపి వారికి సహకరిస్తే ఏపీలో కనీసం ఐదు ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను నిలపవచ్చని ఆ పార్టీ యోచిస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.
చంద్రబాబు పర్యటన సారాంశం తేలేది వారం తరవాతే

చంద్రబాబునాయుడు ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలసి, చర్చలు జరిపినా సారాంశం మాత్రం బయటకు రావడం లేదు. ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పెద్దలతో మాట్లాడిన తరవాత కొంత క్లారిటీ వచ్చే అవకాశముంది. అయితే పొత్తుల ప్రకటనకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.పొత్తులు తేలకముందే, సీట్ల సర్దుబాటు వ్యవహారంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీలో వైసీపీని ఎదుర్కోవాలంటే బీజేపీ పెద్దల సహకారం తప్పనిసరి అని టీడీపీ, జనసేన అధినేతలు భావిస్తున్నారు. పొత్తు ఖాయం. అయితే ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తారనేది మాత్రం ఇప్పుడే తేలేలా కనిపించడం లేదు. మొత్తం మీద చంద్రబాబు ఢిల్లీ పర్యటన వ్యవహారంలో ఎవరి విశ్లేషణలు వారు చేసుకోవడం తప్ప అధికారిక ప్రకటనలు మాత్రం రాలేదు.

K Venkateswara Rao | 11:19 AM, Thu Feb 08, 2024
upload
upload