Sunday, April 14, 2024

Logo
Loading...
upload upload upload

2023 24

ధర్మశాల టెస్టు: తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్, భారత తుది జట్టులో దేవదత్‌కి చోటు

భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా నేడు ఆఖరి టెస్ట్ ధర్మశాల వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్, బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 3-1 తో సిరీస్ గెలుచుకున్న భారత్ కు ఈ టెస్ట్ నామమాత్రమే. ఇంగ్లండ్ బ్యాటింగ్ ను జాక్ క్రాలే, బెన్ డకెట్ ప్రారంభించగా తొలి ఓవర్ ను బుమ్రా వేశాడు.

12 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లిష్ జట్టు వికెట్లు ఏమీ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. కుల్ దీప్ యాదవ్ వేసిన 17.6 బంతికి బెన్ డకెట్ ఔట్ అయ్యాడు. 58 బంతులు ఆడి 27 పరుగులు చేసి శుభమన్ గిల్ కు క్యాచి ఇచ్చి పెవిలియన్ చేరాడు. 21 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి ఇంగ్లండ్ జట్టు 70 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్ తో భారత్ తుది జట్టులో కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్ కు స్థానం దక్కింది. రజత్ పాటిదార్ స్థానంలో  జట్టులో చేరాడు. ఇక ఆకాష్ దీప్ స్థానంలో బుమ్రా జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ కేవలం ఒకే ఒక్క మార్పుతో ఆడుతోంది. పేసర్ రాబిన్ సన్ కు బదులు మార్క్‌వుడ్ ను తుది జట్టులోకి తీసుకుంది. భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ధర్మశాల మ్యాచ్ తో రికార్డు సృష్టించాడు.

కెరియర్ లో వందో టెస్టు ఆడుతున్న అశ్విన్, ఈ ఘనత సాధించిన 14వ ఆటగాడిగా రికార్డు నెలకొల్పారు. 99 టెస్టులు ఆడి 507 వికెట్లు తీసిన అశ్విన్ 116 వన్డేల్లో 156 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 65 టీ20ల్లో 72 వికెట్లు తీయగా 35 సార్లు ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించగా, 8సార్లు 10 వికెట్లు చొప్పున తన ఖాతాలో వేసుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

T Ramesh | 11:24 AM, Thu Mar 07, 2024

ఆటగాళ్ళ కాంట్రాక్టు జాబితా, కేటగిరి ప్రకటించిన బీసీసీఐ

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) (సీనియర్ మెన్) జట్టు సభ్యుల వార్షిక కాంట్రాక్టు వివరాలు వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ 1 నుంచి ఈ కాంట్రాక్టును  వర్తింపజేయగా, ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుంది.   గ్రేడ్ A+ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉండగా, గ్రేడ్ ‘ఏ’ విభాగంలో ఆరుగురు ఆటగాళ్ళకు బీసీసీఐ స్థానం కల్పించింది.

ఆర్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా A కేటగిరీలో ఉన్నారు. ఇక ‘బి’ కేటగిరిలో ఆరుగురు ప్లేయర్స్ ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్ దీప్ యాదవ్, అక్షర పటేల్, యశస్వీ జైస్వాల్

గ్రేడ్ ‘సి’ : ఈ కేటగిరిలో 15 మందికి స్థానం దొరికింది. రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దుల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజూ శామ్సన్, అర్షదీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిధ్ క్రిష్ణ, ఆవేశ్ ఖాన్, రజత్ పటిదార్ లు గ్రేడ్ సి  కాంట్రాక్టులో ఉన్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

మూడు టెస్ట్ మ్యాచులు లేదా 8 వన్డేలు, లేదా 10 టీ20లు నిర్ణీత కాలంలో ఆడిన ఆటగాళ్లు గ్రేడ్ సీలోకి వస్తారు. ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్, ఇప్పటికే రెండు టెస్టులు ఆడగా ధర్మశాలలో జరిగే మ్యాచ్ లో ఆడితే సీ గ్రేడ్ కాంట్రాక్టు పరిధిలోకి వస్తారు. ఉమ్రాన్ బాలిక్, ఆకాశ్ దీప్, విద్వంత్ కావేరప్ప, విజయ్ కుమార్, యశ్ దయాల్ లు ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్టు లో ఉన్నారు.

T Ramesh | 12:23 PM, Thu Feb 29, 2024

రాంచీ టెస్ట్ Stumps Day-3: భారత్ ముందు స్వల్ప లక్ష్యం

రాంచీ టెస్టు మూడోరోజు ఆటలో భారత్ బౌలర్ల అదరగొట్టారు. భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ దెబ్బకు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 145 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ ఐదు వికెట్లు తీయగా, కుల్దీప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. జడేజాకు ఒక వికెట్ దక్కింది.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో జాక్ క్రాలే (60) రాణించగా బెయిర్ స్టో (30) ఫరవాలేదు అనిపించాడు. మిగతా వారంతా  పెవిలియన్ కు క్యూకట్టారు. ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాసేపటికే భారత్ కు వికెట్ దక్కింది. అశ్విన్ వేసిన 4.5 బంతికి బెన్ డకెట్(15) క్యాచ్ ఔట్ గా వెనుదిరగడంతో 19 పరుగులు వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత  ఒంతికే ఓలీ పోప్ కూడా పెవిలియన్ చేరాడు.

16.6 బంతికి అశ్విన్ కు మూడో వికెట్ దక్కింది. జోరూట్(11)ను అశ్విన్ వెనక్కిపంపాడు. దీంతో 17 ఓవర్లకు ఇంగ్లండ్ మూడు వికెట్లు నష్టపోయి 65 పరుగులు చేసింది. జాక్ క్రాలే మాత్రం  హాప్ సెంచరీ పూర్తి చేశాడు.  కుల్‌దీప్ యాదవ్ వేసిన 28.1 బంతికి జాక్ క్రాలే(60) కూడా ఔట్ కావడంతో 112 పరుగుల వద్ద ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. తర్వాతి వికెట్ ను కూడా కుల్‌దీప్ తన ఖాతాలో వేసుకున్నాడు. 32.3 బంతికి స్టోక్స్( 4) బౌల్డ్ అయ్యాడు. 120 పరుగుల వద్ద ఐదు, ఆరు వికెట్లను ఇంగ్లండ్ కొల్పోయింది. జడేజా బౌలింగ్ లో బెయిర్ స్టో ( 30) ఆరో వికెట్ గా పెవిలియన్ చేరాడు.

కుల్‌దీప్ వేసిన 40.3 బంతిని ఆడిన హార్ట్ లే( 7), సర్ఫరాజ్ కు క్యాచ్ అందించి ఔట్ అయ్యాడు. 133 పరుగుల వద్ద ఏడు, ఎనిమిది వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్, జట్టు స్కోర్ 145 వద్ద ఉన్నప్పుడు తొమ్మిదో వికెట్ నష్టపోయింది. అశ్విన్ బౌలింగ్ లో బెన్ ఫోక్స్ ( 17) ఔట్ అయ్యాడు. అండర్సన్ (0) అశ్విన్ బౌలింగ్ లో వెనుదిరగడంతో ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్  ముగిసింది.

తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని  భారత్ ముందు 192 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో భాగంగా భారత్  మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (16) తో క్రీజులో ఉన్నారు.

T Ramesh | 17:43 PM, Sun Feb 25, 2024

రాంచీ టెస్ట్ : ధ్రువ్ సెంచరీ మిస్, భారత్ తొలి ఇన్నింగ్స్ 307/10

రాంచీ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 307 పరుగులకు ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్‌కు 46 పరుగుల ఆధిక్యం లభించింది.

నేడు, మూడో రోజు ఆటలో భాగంగా 219/7 వద్ద ఆటను ప్రారంభించిన భారత్, స్కోర్ బోర్డుకు 88 పరుగులు జోడించి ఆలౌటైంది. భారత్ ఇన్నింగ్స్ లో ధ్రువ్ జురైల్(90), యశస్వీ జైస్వాల్(73), గిల్ (38), కుల్‌దీప్(28) పరుగులు చేశారు. ధ్రువ్ జురైల్ 149 బంతులు ఎదుర్కొని 90 పరుగులు చేశాడు.  నాలుగు సిక్సులు, ఆరు ఫోర్లు బాదాడు. కెరీర్ లో తొలి సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు.

మూడో రోజు ఆటలో కుల్దీప్ యాదవ్(28) ను జేమ్స్ అండర్సన్ పెవిలియన్ కు పంపాడు. దీంతో 89 ఓవర్లకు భారత్ 8 వికెట్లు నష్టపోయి 253 పరుగులు చేసింది. కుల్దీప్ ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన ఆకాశ్ దీప్, 9 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. బషీర్ బౌలింగ్ లో పెవిలియన్ చేరారు. 303 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ నష్టపోయిన భారత్,  307 పరుగులు వద్ద ధ్రువ్ ఔట్ కావడంతో పదో వికెట్ నష్టపోయింది.

ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ ఐదు వికెట్లు తీయగా, హార్ట్ లీ మూడు, అండర్సన్ రెండు వికెట్ల్ తీశారు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 5 ఓవర్లకు రెండు వికెట్లు నష్టపోయింది. అశ్విన్ బౌలింగ్ లో 19 పరుగుల వద్ద  బెన్ డకెట్, ఓలీ పోప్  వికెట్లను ఇంగ్లండ్ కోల్పోయింది. 9 ఓవర్లకు రెండు వికెట్లు నష్టపోయి 38 పరుగులు చేసింది.

T Ramesh | 12:59 PM, Sun Feb 25, 2024

ఇంగ్లండ్‌తో మూడు టెస్టులకు భారత జట్టు ప్రకటన, సిరీస్ మొత్తానికి కోహ్లీ దూరం

ఇంగ్లండ్ తో జరగనున్న మూడు టెస్టుల కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. వ్యక్తిగత కారణాల కారణంగా విరాట్ కోహ్లీ, ఈ సిరీస్ కు దూరమయ్యాడు. కోహ్లీ నిర్ణయాన్ని బోర్డు పూర్తిగా గౌరవించి మద్దతుస్తుందని బీసీసీఐ గౌరవ కార్యదర్శి జైషా తెలిపారు.

గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ప్రధానజట్టులోకి తిరిగి వచ్చారు. అయితే వీరికి బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ రావాల్సి ఉంది.

ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్, అవేష్ ఖాన్‌ను టీమ్ నుంచి రిలీజ్ చేసిన బోర్డు, బెంగాల్ ఆటగాడు ఆకాశ్ దీప్‌కు అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 15న రాజ్‌కోట్ వేదికగా

మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుండగా, ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్ట్, రాంచీలో జరగనుంది. ఆఖరి ఐదో టెస్ట్ మ్యాచ్ మార్చి 7న ధర్మశాల వేదికగా జరగనుంది.

ఇంగ్లండ్ తో మూడు టెస్టులకు భారత జట్టు... రోహిత్ శర్మ(కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్*, రాజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ద్రువ్ జురేల్(వీకెట్ కీపర్), కేఎస్ భరత్(వీకెట్ కీపర్,) ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా*, అక్షర పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్.

T Ramesh | 12:22 PM, Sat Feb 10, 2024

వైజాగ్ టెస్టు DAY-3:  శుభమన్ గిల్  సెంచరీ, ఇంగ్లండ్ పై భారీ ఆధిక్యం

వైజాగ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో శుభమన్ గిల్ సెంచరీ చేశాడు. 132 బంతుల్లో 101 పరుగులు చేసి  సెంచరీ మార్క్ ను దాటాడు. గిల్ ఇన్నింగ్స్ లో 11  ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.

టెస్టుల్లో మూడో సెంచరినీ తన ఖాతాలో వేసుకుని  ఆ తర్వాత షోయబ్ బషీర్ వేసిన 55.6 బంతికి పెవిలియన్ చేరాడు. గత ఏడాది ఆస్ట్రేలియాపై గిల్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత  12 ఇన్నింగ్సుల్లో అంతగా రాణించలేకపోయిన గిల్, ఈ సారి మాత్రం క్రీజులో పాతుకుపోయాడు.

35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో జాగ్రత్తగా ఆడాడు. రెండుసాలు ఎల్బీ ముప్పును తప్పించుకుని మూడో వికెట్ కు అయ్యర్ తో 81 పరుగులు జోడించారు. 111 పరుగుల వద్ద అయ్యర్ , క్యాచ్ ఔట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదార్(9) కూడా కీపర్ చేతికి చిక్కి వెనుదిరిగాడు. గిల్ మాత్రం ఓర్పుతో ఆడి శతకం కొట్టాడు.

సెంచరీ తర్వాత గిల్ కూడా ఔట్ కావడంతో భారత్, 211 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. దీంతో క్రీజులోకి శ్రీకర్ భరత్ వచ్చాడు.  హార్ట్ లీ వేసిన 59.6 బంతికి అక్షర పటేల్(45) ఔట్ అయ్యాడు. 60 ఓవర్లకు భారత్, ఆరు వికెట్లు నష్టపోయి 220 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 243 పరుగులు చేయగా, భారత్ 396 పరుగులు చేసింది.

T Ramesh | 14:11 PM, Sun Feb 04, 2024

వైజాగ్ టెస్టులో జైస్వాల్ సెంచరీ, మూడు వికెట్లు కోల్పోయిన భారత్

భారత్ –ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ అద్భుత శతకంతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వికెట్లు పడుతున్నా వెరవకుండా ఇంగ్లండ్ బౌలర్లను చితకకొట్టి టెస్టుల్లో రెండో సెంచరీ నమోదు చేశాడు. జైస్వాల్ 151 బంతుల్లో  శతకం చేశాడు. సిక్స్ తో సెంచరీ పూర్తి చేయడం తొలి సెషన్ లో హైలెట్ గా నిలిచింది.  

టీ బ్రేక్ సమయానికి భారత్ జట్టు మూడు వికెట్లు నస్టపోయి 225 పరుగులు చేసింది. 185 బంతులు ఆడిన యశస్వీ జైస్వాల్ 125 పరుగులతో అజేయంగా నిలవగా, రజిత్ పాటిదార్ 47 బంతుల్లో 25 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.   జైస్వాల్ స్కోరులో 13 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.

కెప్టెన్ రోహిత్ శర్మ 14 పరుగుల వద్ద వెనుతిరగగా, శుభ్ మాన్ గిల్ 34, శ్రేయాస్ అయ్యర్ 27 పరుగుల వద్ద పెవిలియన్ చేరారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్,  టామ్ హార్ట్ లే , షోయబ్ బషీర్ తలా ఒక వికెట్ తీశారు.

T Ramesh | 14:51 PM, Fri Feb 02, 2024
upload
upload