Sunday, October 01, 2023

Odisha-365
upload upload upload

Imd Alert

MOONSOON ENDS BELOW NORMAL RAINFALL: ముగిసిన రుతుపవనాల కాలం, ఎక్కువ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతమే..!

దేశవ్యాప్తంగా నాలుగు నెలల రుతుపవనాల కాలం 820 మిల్లీమీటర్ల వర్షపాతంతో ముగిసింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీర్ఘకాల సరాసరి వర్షపాతం 868.6 మిల్లీమీటర్లతో పోలిస్తే ఇది తక్కువేనని తెలిపింది. దేశంలో ఈ సారి సరాసరిన 91 శాతం వర్షపాతం నమోదైంది.

ఎల్‌నినో ఉన్నా సాధారణానికి దగ్గరగా వర్షం పడటతో కొంత ఉపశమనం లభించింది. 94 శాతం నుంచి 106 శాతం మధ్య కురిస్తే సాధారణంగా పరిగణిస్తారు.  దేశంలోని  73 శాతం ప్రాంతాల్లో 18 శాతం లోటు వర్షపాతం  నమోదైందని ఐఎండీ డైరక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు.

తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో 1,115 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఇక్కడ సాధారణంగా 1,367 మిల్లీమీటర్లుగా ఉందని తెలిపారు. ఈ ఏడాది జూన్ లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడగా, జులైలో భారీ వానలు కురిశాయి. 1901 సంవత్సరం తర్వాత ఈ ఏడాది ఆగస్టు అత్యంత వేడి నెలగా రికార్డుకెక్కింది.

సెప్టెంబర్ లో అల్పపీడనాలు ఏర్పడటంతో మంచి వర్షాలే కురిశాయి. 2023 కంటే ముందు వరుసగా నాలుగేళ్ళపాటు సాధారణం, అంతకంటే అధిక వానలు పడ్డాయి. అక్టోబర్‌లో సాధారణం కంటే అధిక ఉష్ణోగత్రలు నమోదు అవుతాయని ఐఎండీ తెలిపింది. ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, దక్షిణ కర్ణాటకలో రెండు నెలల కాలానికి సాధారణ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి.

T Ramesh | 11:00 AM, Sun Oct 01, 2023

RAIN ALERT: మరో 48 గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు...

రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.   రానున్న 48 గంటల పాటు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి.

అక్టోబర్ 3 నుంచి ఉత్తరకోస్తాలో వర్షాలు ఎక్కువగా పడతాయి.     అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, ప్రకాశం, అన్నమయ్య, నంద్యాల, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తూర్పుగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.  

రాష్ట్రంలో శుక్రవారం పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. విజయవాడలో గంటపాటు వాన కురిసింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షంతో పాటు ఈదురు గాలులు వీయడంతో విద్యుత్ సరఫరా కొన్ని ప్రాంతాల్లో నిలిచిపోయింది. అనకాపల్లిలో 45 నిమిషాల పాటు భారీ వర్షం కురిసింది.

T Ramesh | 10:45 AM, Sat Sep 30, 2023

Weather Report: తెలుగు రాష్ట్రాలకు మూడు రోజులపాటు వర్ష సూచన... హైదరాబాద్‌లో రోడ్లు జలమయం

రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి మూడు రోజుల పాటు ఒకటి రెండు చోట్ల చిన్నపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని,   ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు పడే సూచనలు కనిపిస్తున్నాయని వివరించింది.

సెప్టెంబర్ 30న మాత్రం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా వానలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులు కూడా సంభవిస్తాయని తెలిపింది. అక్టోబర్ 1 నుంచి 3 వరకు కూడా రాష్ట్రంలో వానలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు.

కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా ఉండగా గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీలు నమోదు అవుతుందని వెల్లడించారు. తెలంగాణలో కూడా ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

హైదరాబాద్‌లో నిన్న భారీ వర్షం కురిసింది. ఉదయం అంతా నగరాన్ని మేఘాలు కమ్మివేశాయి. సాయంత్రానికి భారీ వాన కురిసింది. దీంతో రోడ్లు అన్నీ జలమయంగా మారడంతో రాకపోకలకు అంతరాయం కల్గింది.

T Ramesh | 10:30 AM, Thu Sep 28, 2023

Weather Report : కొనసాగుతున్న అల్పపీడనం, రాష్ట్రవ్యాప్తంగా వానలు..!

  వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, ఒడిశాల తీరాలకు అనుకుని ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

అల్పపీడనం రానున్న 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్ వైపు పయనిస్తుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు రుతుపవన ద్రోణి రాజస్థాన్ లోని జైసల్మేర్ నుంచి అల్పపీడనం ప్రాంతం వరకు కొనసాగుతోంది.

రాష్ట్రం మీదుగా పశ్చిమ, వాయవ్య గాలులు వీస్తున్నాయి. దీంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో అనేక చోట్ల, రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.

బెజవాడలో రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కుంభవృష్టిని తలపించింది. సెప్టెంబర్ ఆరంభం నుంచి కురుస్తున్న వానలతో ఖరీఫ్ సాగు ఊపందుకుంది. జూన్ లో రుతుపవనాలు మొహం చాటేయడంతో ఆగస్టులో సరిపడా వర్షాలు కురవలేదు.


T Ramesh | 12:02 PM, Thu Sep 21, 2023

Morocco Earthquake :  2000  దాటిని భూకంప మృతుల సంఖ్య

మొరాకో దేశంలో పెను విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి సంభవించిన పెను భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పెను భూకంపం దాటికి 2000  మంది చనిపోయారని, 1200 గాయపడ్డారని మొరాకో ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారిలో 720 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో దేశంలో అర్ధరాత్రి భూకంపం సంభవించడంతో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వేల సంఖ్యలో భవనాలు నేలమట్టం అయ్యాయి. వేలాది గ్రామాలు ధ్వంసమయినట్టు సమాచారం అందుతోంది. రిక్టర్ స్టేలుపై భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. భూకంప బాధితులకు అన్ని విధాలా భారత్ సాయం అందిస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు.

K Venkateswara Rao | 10:46 AM, Sun Sep 10, 2023

IMD ALERT: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!

ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 5.8కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మంగళవారం వాయవ్య  బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడనుంది. మరోవైపు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్ర, రాయలసీమలపై బలంగా ఉన్నాయి. వీటన్నింటి ఫలితంగా నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడా భారీ వర్షాల కురవనున్నాయి.

ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లో నేడు వానలు పడే అవకాశం ఉందని భారతవాతావరణ శాఖ వెల్లడించింది. ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, విజయనగరం, అనకాపల్లి, తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ మోస్తరు వానలు మంగళవారం కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో బుధవారం కూడా ఒకట్రెండు చోట్లు భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వివరించిన అధికారులు, అదే సమయంలో కొన్న ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు కూడా సంభవిస్తాయని తెలిపారు.

ఈశాన్య బంగాళాఖాతంలోని ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. భారీవర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో మూడురోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఒడిశాలో శనివారం అసాధారణ రీతిలో పిడుగులు పడ్డాయి. కేవలం రెండు గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 61వేల పిడుగులుపడ్డాయి. ఈ ఘటనల్లో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 14 మంది గాయపడ్డారు. పిడుగుపాటు కారణంగా మరణించిన వారి కుటుంబానికి రూ. 4 లక్షల ఆర్థికసాయాన్ని ఆ రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది.

T Ramesh | 10:49 AM, Mon Sep 04, 2023

IMD ALERT: ఈ వారాంతంలో వానలే వానలు.. సెప్టెంబర్ లో సాధారణం కంటే  ఎక్కువే..!

నైరుతి ఋతుపవనాలు మళ్ళీ పుంజుకుని వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. వందేళ్ళలో ఎన్నడూ లేనంతగా తక్కువ వానలు ఆగస్టులో కురిసినా సెప్టెంబరులో ఋతుపవనాలు మళ్ళీ పుంజుకుని వానలు కురవనున్నాయని పేర్కొంది.

ఈ వారాంతంలో కూడా దక్షిణాది, మధ్య భారతదేశ వ్యాప్తంగా వానలు పడతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. సెప్టెంబర్‌కు దీర్ఘకాల సగటువర్షపాతం, 167.9 మిల్లీమీటర్లు కాగా దానిలో 9 శాతం అటుఇటూగా నమోదవుతుందని చెప్పారు.

ఒకవేళ ఎక్కువగా కురిసినా జూన్-సెప్టెంబర్ కాలపు సగటు వర్షపాతం మాత్రం సాధారణం కంటే తక్కువగానే ఉండవచ్చని అంచనా వేస్తోంద. జులైలో అధిక వర్షాల పడినా తర్వాత ఆగస్టులో చాలా వరకు రుతుపవనాల్లో కదలిక లేదు. ఎలినినో కారణంగా చాలా ప్రదేశాల్లో 20రోజులుగా వానలు పడలేదు.

ఆరేబియా మహాసముద్రం, బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం వల్ల ఇప్పుడు ఎలినినో సానుకూలంగా మారడం మొదలైంది. దీంతో పాటు తూర్పు దిశగా మేఘాల పయనం, ఉష్ణమండల ప్రాంతాల్లో వర్షపాతం వంటివీ రుతపవనాల పునరుద్ధరణకు అనుకూలంగా మారుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.

T Ramesh | 11:28 AM, Fri Sep 01, 2023
upload

Crime News

Pm Modi

upload