Saturday, September 23, 2023

Odisha-365

క్రీడా వార్తలు

 • Neeraj Chopra: జావెలిన్‌తో నీరజ్ చోప్రా డబుల్ ధమాకా

  హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా డబుల్ ధమాకా సాధించాడు. ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లోకి దూసుకువెళ్ళడమే కాక, పారిస్ ఒలింపిక్స్‌కు కూడా క్వాలిఫై అయ్యాడు.

  అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో ఇవాళ క్వాలిఫయింగ్ రౌండ్ పోటీలు జరిగాయి. అందులో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా పాల్గొన్నాడు. ఈ 25 ఏళ్ళ యువకుడు మొదటి ప్రయత్నంలోనే తన జావెలిన్‌ను 88.77 మీటర్ల దూరం విసరగలిగాడు. ఈ సీజన్‌లో ఇదే నీరజ్ అత్యుత్తమ ప్రదర్శన. అలాగే తన కెరీర్‌లో నాలుగో అత్యుత్తమ ప్రదర్శన.

  నీరజ్ చోప్రా ప్రస్తుతం జరుగుతున్న అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు చేరుకోగలిగాడు. అదే సమయంలో మరో రికార్డునూ సొంతం చేసుకున్నాడు. 2024లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో జరిగే ఒలింపిక్స్ పోటీలకు అర్హత సంపాదించుకున్నాడు.

  ప్యారిస్ ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్ విండో జులై 1న ప్రారంభమైంది. దానికోసం, జావెలిన్ త్రో ఈవెంట్‌కు నిర్దేశించిన అర్హతా ప్రమాణం 85.5 మీటర్లు. దాన్ని నీరజ్ చోప్రా సునాయాసంగా అధిగమించాడు.

  గతంలో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా విజయం సాధించాడు. గతేడాది, అంటే 2022 జూన్‌ 30న స్టాక్‌హోమ్‌ డైమండ్‌ లీగ్‌లో 89.94 మీటర్ల దూరం జావెలిన్ విసిరి విజయం సాధించాడు.

   

  ప్రస్తుతం వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో గ్రూప్ ఎ క్వాలిఫికేషన్ రౌండ్‌లో పాల్గొన్న నీరజ్ చోప్రా, అందులో సునాయాసంగా చోటు సాధించాడు. ఫైనల్‌ పోటీ లేదా మెడల్ రౌండ్‌కి అర్హత సాధించాడు. అంతేకాదు, ప్యారిస్ ఒలింపిక్స్‌కి కూడా అర్హత సాధించాడు. నీరజ్ విజయానికి దేశవిదేశాల్లోని క్రీడాకారులు అభినందించారు.

  P Phaneendra | 15:58 PM, Fri Aug 25, 2023

 • Ind Vs Ire T20 series: నేటినుంచీ ఐర్లాండ్‌లో భారత్ టీ20 సీరీస్

  టీమిండియా మరో టీ20 సీరీస్‌కు సిద్ధమైంది. నేటి నుంచీ ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల పోరాటం మొదలు కానుంది. ఈ మ్యాచ్‌లు మూడూ డబ్లిన్‌లోని మాలాహైడ్‌ స్టేడియంలో జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.  

  ఐర్లాండ్‌తో ఇండియా ఇప్పటివరకూ ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడి అన్నీ గెలిచింది. అయితే తాజాగా వెస్టిండీస్‌తో సీరీస్‌ను కోల్పోయిన నేపథ్యంలో భారత్ జాగ్రత్తగా ఆడవలసిన అవసరముంది. ఈ సీరీస్‌లో, విండీస్‌తో ఆడిన టీమ్ దాదాపు పూర్తిగా మారిపోతుంది.  

  గాయం కారణంగా సుమారు ఏడాది నుంచీ ఆటకు దూరంగా ఉన్న జస్‌ప్రీత్ బుమ్రా ఈ సీరీస్‌తో మళ్ళీ ఫీల్డ్‌లోకి దిగనున్నాడు. అలాగే, కొద్దికాలంగా సరిగ్గా రాణించలేకపోతున్న సంజూ శాంసన్‌ తన ఫాం నిరూపించుకోవలసిన తరుణమిది. ఆసియా కప్, వరల్డ్ కప్ ఆశావహులకు తమ ప్రతిభను చాటుకునే అవకాశం ఈ సీరీసే.

  P Phaneendra | 10:58 AM, Fri Aug 18, 2023

 • WEIGHT LIFTING : 62 కేజీల బరువెత్తి గిన్నిస్ రికార్డు నెలకొల్పిన 8 ఏళ్ల బాలిక


  ఎనిమిదేళ్ల చిన్న వయసులో పిల్లలు చాక్లెట్లు, ఐస్‌క్రీంల కోసం మారాం చేస్తూ ఉంటారు. అయితే హరియాణాకు చెందిన ఎనిమిదేళ్ల అశ్రియా గోస్వామి మాత్రం 62 కేజీల బరువెత్తి గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు సాధించింది. అతి చిన్న వయసులోనే ప్రపంచంలో ఎవరూ సాధించలేని ఘనత సాధించింది అశ్రియా గోస్వామి. కేవలం 30 సెకండ్లలో 17 సార్లు క్లీన్ అండ్ జర్క్ వెయిట్‌లిఫ్టింగ్ చేసి చిన్నారి అశ్రియా గోస్వామి ఈ ఘనత సాధించారు.

  అశ్రియా గోస్వామి తండ్రి అవినాష్‌కుమార్ ఓ జిమ్ నడుపుతున్నారు. గతంలో అశ్రియా తండ్రి వద్దనే వెయిట్‌లిఫ్టింగ్‌లో మెలకువళలు నేర్చుకుంది. ఆ తరవాత ఆమె ఆసక్తిని గమనించిన తండ్రి అశ్రియాను ప్రోత్సహించారు. అశ్రియా ప్రస్తుతం అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్ గుర్మెల్‌సింగ్ వద్ద శిక్షణ తీసుకుంటోంది. జులైలో నిర్వహించిన ప్రముఖ టీవీ లైవ్ షో ఇండియాస్ గాట్ టాలెంట్‌లో అశ్రియా గోస్వామి ఏకంగా 62 కేజీల బరువెత్తి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. అశ్రియా టాలెంట్ చూసిన హరియాణా అసెంబ్లీ స్పీకర్ గుప్తా ఆమెను ఘనంగా సన్మానించారు.

  K Venkateswara Rao | 10:33 AM, Sun Aug 13, 2023

 • World Archery Championship: భారత్‌కు తొలి స్వర్ణం సాధించిన జ్యోతి సురేఖ బృందం

  జర్మనీలో జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భారతదేశం మొదటి స్వర్ణ పతకం సాధించింది. కాంపౌండ్ వుమెన్స్ టీమ్ ఈవెంట్‌ ఫైనల్‌లో వెన్నం జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, అదితి గోపీచంద్ స్వామి త్రయం విజయం సాధించారు. టాప్‌సీడ్‌ మెక్సికో టీమ్‌ మీద సెకెండ్ సీడ్ ఇండియా టీమ్ 235-229 తేడాతో గెలిచింది.

  ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఎప్పటినుంచో పాల్గొంటున్నా స్వర్ణ పతకం మాత్రం ఇఫ్పటివరకూ సాధించలేదు. ఈ యేడాది పోటీల్లో అన్ని రకాల ఈవెంట్లలోనూ కలిపి భారత్ గెలుచుకున్న మొదటి స్వర్ణ పతకమిది. విజయవాడకు చెందిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, అదితి గోపీచంద్ స్వామి త్రయం మెక్సికోకు చెందిన ఆండ్రియా బెసెరా, ఆనా సోఫియా హెర్నాండెజ్‌ జియోన్, డాఫ్నే క్వింటెరో బృందాన్ని ఓడించి పసిడి పతకాన్ని గెలిచారు. ఇక మూడో స్థానంలో కొలంబియా నిలిచింది.

  ఈ పోటీల్లో భారత్ ఇఫ్పటివరకూ 9 రజత పతకాలు, 2 కాంస్య పతకాలు గెలిచింది. స్వర్ణ పతకం గెలవడం మాత్రం ఇదే మొదటిసారి. దీంతో భారత్ మొదటిసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.

  ఈరోజు, అంటే శనివారం, జరిగే పోటీల్లో మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్ క్వార్టర్ ఫైనల్ప్‌లో జ్యోతి సురేఖ తన సహచర క్రీడాకారిణి పర్ణీత్ కౌర్‌తో తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్స్‌లో అదితి గోపీచంద్ స్వామి నెదర్లాండ్స్‌కు చెందిన డి లాత్‌తో పోటీ పడుతుంది.

  Editor | 11:16 AM, Sat Aug 05, 2023

 • Ashes series: యాషెస్ సీరీస్ ఆఖరి టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం, సీరీస్ సమం

  ఐదు టెస్ట్ మ్యాచ్‌ల యాషెస్ సీరీస్ సమరంలో ఆఖరి మ్యాచ్ ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. మ్యాచ్ గెలిచి, సీరీస్ సమం చేసింది.

  ఐదవ టెస్ట్ ఆఖరి రోజు ఆస్ట్రేలియా 384 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 135/0తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ 94.4 ఓవర్లలో కేవలం 344 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు వార్నర్ (60) ఖ్వాజా (72) పరుగులతో టీమ్‌కు శుభారంభాన్నిచ్చారు. తరవాత స్మిత్ (54) ట్రావిస్ హెడ్ (43) పరుగులు చేసారు. నాలుగో వికెట్‌కు వారిద్దరూ ‌93 పరుగులు జోడించారు.

  అయితే తర్వాత నుంచీ ఆస్ట్రేలియా పతనం వేగంగా కొనసాగింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాట్స్‌ మెన్ హెడ్, స్మిత్, మార్ష్, స్టార్క్, కమిన్స్ 300 పరుగుల లోపే ఔట్ అయిపోయారు. కెరీర్ చివరి మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లండ్ క్రీడాకారుడు స్టువార్ట్ బ్రాడ్, ఆఖరి టెస్ట్‌లో ఆఖరి వికెట్‌గా క్యారీని (28) ఔట్ చేసాడు. దాంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 334 పరుగులతో ముగిసింది.

  ఐదో టెస్టులో ఇంగ్లండ్ 49 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. సీరీస్‌ను 2-2తో సమం చేసింది. నాలుగు వికెట్లు తీసిన వోక్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. వోక్స్, స్టార్క్‌లకు ‘ప్లేయర్ ఆఫ్ ది సీరీస్’ అవార్డులు లభించాయి.

  ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ, సీరీస్ డ్రా అయినందున, యాషెస్ కప్ వారి వద్దనే ఉండిపోతుంది. తర్వాత యాషెస్ సీరీస్ 2025-26లో జరుగుతుంది.

  Editor | 11:55 AM, Tue Aug 01, 2023

 • ‌మొదటి వన్డేలో విండీస్‌ను మట్టికరిపించిన భారత్

  బ్రిడ్జిటౌన్: వెస్టిండీస్‌పై టెస్ట్ సీరీస్‌ గెలిచిన భారత్‌ అదే విజయ పరంపరను కొనసాగిస్తోంది. మొదటి వన్డేలో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది.

   

  మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీమ్ 23 ఓవర్లలోనే 114 పరుగులకే కుప్పకూలింది. కులదీప్ యాదవ్ 4 వికెట్లు, రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసి... విండీస్ జట్టు వెన్ను విరిచారు. కెప్టెన్ షై హోప్ 45 బంతుల్లో 43 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్ కైల్ మేయర్స్ మూడో ఓవర్లో 2 పరుగులకే హార్దిక్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరో ఓపెనర్ బ్రెండన్ కింగ్, అథనేజ్‌ ద్వయం కాసేపు నిలదొక్కుకున్నారు. 22 పరుగులు చేసిన అథనేజ్‌ను ఔట్ చేయడం ద్వారా ముఖేష్‌ తన మొదటి వన్డే వికెట్ సాధించాడు. మరుసటి ఓవర్‌లో శార్దూల్‌ బౌలింగ్‌లో బ్రెండన్ కింగ్ 17 పరుగుల దగ్గర ఔటయ్యాడు. తర్వాత భారత స్పిన్నర్ల మాయాజాలానికి విండీస్ బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ ఒంటరిపోరాటం చేసి, దాదాపు చివరివరకూ ఉండి, ఆఖరికి 9వ వికెట్‌గా నిష్క్రమించాడు. మొత్తానికి 23 ఓవర్లలో 114 పరుగులకు వెస్టిండీస్ ఆలౌట్ అయింది.

   

  చిన్న లక్ష్యమే కావడంతో భారత్‌ శుభ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్‌లను ఓపెనర్లుగా దింపింది. శుభ్‌మన్‌ 7 పరుగులకే ఔటయిపోయాడు. ఇషాన్ 46 బంతుల్లో 52 పరుగులు సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ 19 పరుగులు, రవీంద్ర జడేజా 16 పరుగులు చేసారు. ఇండియన్ బ్యాట్స్‌మెన్ 5 వికెట్లు కోల్పోయి 22.5 ఓవర్లలో 115 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలిచారు. అయితే భారత బ్యాటింగ్‌లో సైతం పెద్ద మెరుపులేమీ లేవు. సులువైన ప్రత్యర్ధి, చిన్నదైన లక్ష్యం కావడంతో సీనియర్ ఆటగాళ్ళు బరిలోకి దిగకుండానే మ్యాచ్ పూర్తయింది.

   

  3 ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసిన కులదీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 3 వన్డేల సీరీస్‌లో భారత్ 1-0 ఆధిపత్యం సాధించింది.

  Editor | 11:17 AM, Fri Jul 28, 2023

 • UGC proposes to make four-year UG courses must for degree with honoursunique363unique363

  Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry.

  Technical | 10:15 AM, Wed May 31, 2023

 • UGC proposes to make four-year UG courses must for degree with honoursunique358unique358

  Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry.

  Technical | 13:27 PM, Tue May 30, 2023

 • UGC proposes to make four-year UG courses must for degree with honoursunique357unique357

  Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry.

  Technical | 13:23 PM, Tue May 30, 2023

క్రికెట్

 • Asia cup cricket  2023: భారత్,  పాకిస్తాన్ మ్యాచ్ రద్దు.. సూపర్ 4కు దాయాది జట్టు

  ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంక క్యాండీలోని పల్లెకేలే క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇప్పటికే నేపాల్ జట్టు మీద గెలిచిన పాకిస్తాన్ మూడు పాయింట్లతో నేరుగా సూపర్ 4కు చేరింది.

    నేపాల్, భారత్ మధ్య ఈ నెల4న మ్యాచ్ జరగనుంది. ఈ పోటీలో విజయం సాధిస్తే భారత్ కూడా మొత్తం మూడు పాయింట్లతో సూపర్ 4కు చేరింది. టాచ్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌కు రెండుసార్లు ఆటంకం కల్పించిన వర్షం, ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం కూడా పడింది. 267 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగాలనుకున్న పాక్ కు వరుణుడు అడ్డొచ్చాడు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం కాకుండేనే మ్చాచ్ ను రద్దు చేశారు.

  భారత ఇన్నింగ్స్ లో హార్థిక్ పాండ్య (87, 90 బంతులో 7x4,1x6)  ఇషాన్ కిషన్ (82, 81 బంతుల్లో 9x4,2x6) గొప్పగా  ఆడారు. పాక్ బౌలర్ షహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్ దాటికి మొదట్లో తడబడ్డ టీమిండియా తర్వాత నిలదొక్కుకుంది. ఇప్పటికే నేపాల్ పై నెగ్గిన పాక్.. ఈ మ్యాచ్ రద్దు కావడంతో సూపర్-4కు అర్హత సాధించింది.

  T Ramesh | 12:57 PM, Sun Sep 03, 2023

 • Asia cup 2023:  కాసేపట్లో ఆసియాకప్ సమరం

  ఆసియాకు చెందిన ఆరు దేశాలుతలపడే ఆసియా కప్క్రికెట్ టోర్నమెంట్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి శ్రీలంక, పాకిస్తాన్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తుండగా, తొలి మ్యాచ్ లో పాకిస్తాన్, నేపాల్ జట్లు మధ్యాహ్నం 3 గంటలకు తలపడనున్నాయి. గ్రూప్ దశలో సెప్టెంబర్ 2న పాకిస్తాన్ తోనూ, 4న నేపాల్ తోనూ భారత్ ఆడనుంది.

  పాకిస్తాన్, శ్రీలంక వేదికగా దాదాపు నాలుగు స్టేడియాల్లో ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాక్ లోని ముల్తాన్, లాహోర్ తో పాటు శ్రీలంకలో పల్లెకెల్లె, కొలొంబో స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.  టీమిండియా తన మ్యాచ్‌లు అన్నింటిని శ్రీలంకలోనే ఆడనుంది.

  గ్రూప్-ఏ లో భారత్, పాకిస్తాన్, నేపాల్... గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ ఉన్నాయి. రెండు గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి.

  ప్రస్తుతం 16వ ఆసియాకప్ జరుగుతుంది. గత 15 ఆసియాకప్పు టోర్నీల్లో 13 వన్డే ఫార్మాట్లోనే జరిగాయి. రెండు సార్లు మాత్రమే టీ-20 ఫార్మాట్లో నిర్వహించారు. గత టోర్నీలో టీ-20క్రికెట్ ఆడారు. ప్రపంచ కప్ నేపథ్యంలో ఈ సారి వన్డే ఫార్మాట్లో ఆసియా కప్ ఆడుతున్నారు. టోర్నీలో భారత్ అత్యధికంగా 7 సార్లు విజేతగా నిలిచింది. 49 వన్డే మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 31 సార్లు నెగ్గింది.


  భారత్, పాకిస్తాన్ మధ్య శనివారం జరిగే మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిరేపుతోంది. గత టోర్నీల్లో రెండు జట్లు చెప్పకోదగిన స్థాయిలో రాణించాయి. ఆసియాకప్ లో ఇరుదేశాల జట్లు 13 సార్లు పోటీపడ్డాయి. ఏడుసార్లు భారత్, ఐదుసార్లు పాక్ గెలిచాయి.

  2018లో తలపడ్డ రెండుసార్లూ టీంమిండియానే పైచేయి సాధించింది. పాక్ గత ఐదు ఆసియాకప్ మ్యాచ్ ల్లో భారత్ నాలుగు సార్లు విజయం సాధించింది.  

  T Ramesh | 12:38 PM, Wed Aug 30, 2023

 • IND VS IRE : మూడో మ్యాచ్ వర్షార్పణం.. సిరీస్ భారత్ కైవసం

  భారత్-ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మూడో టి-20 వర్షం కారణంగా రద్దు కావడంతో సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మూడో వన్డే ప్రారంభానికి ముందు నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం శాంతించకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కనీసం టాస్ వేయకుండానే మ్యాచ్ రద్దైనట్లు అంపైర్లు ప్రకటించారు.

  మూడు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా తొలి రెండింటిలో భారత్ విజయం సాధించింది. తొలి టీ20లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 2 పరుగులు తేడాతో నెగ్గిన భారత్, రెండో టీ20లో 30 పరుగులతో విజయం సాధించింది.

  సిరీస్ లో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్  టాప్‌స్కోర్ చేశారు. రెండు మ్యాచుల్లో 77 పరుగులతో టాప్‌ప్లేస్ లో నిలిచారు. ఐర్లాండ్ బ్యాటర్లు ఆండ్రూ బల్బిర్నీ, బ్యారీమెక్ కర్తీలు చెరో అర్థశతకం బాదారు. టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ మాత్రమే హాఫ్ సెంచరీ మార్క్ ను దాటారు.

  అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా టీమిండియా బౌలర్లు బుమ్రా, బిష్ణోయ్, ప్రసిద్ధ్ నిలిచారు. తలో నాలుగు వికెట్లు పడగొట్టారు. ఐర్లాండ్ బౌలర్ క్రెయిగ్‌యంగ్ మూడు వికెట్లు తీశారు.

  T Ramesh | 12:41 PM, Thu Aug 24, 2023

 • ASIA CUP  2023 : ఆసియా కప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ

  ఆసియా కప్-2023కు భారతజట్టు ఆటగాళ్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ మెగా టోర్నీ కోసం 17 మందితో కూడిన జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. గాయం కారణంగా ఆటకు దూరంగా ఉంటున్న స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, అయ్యర్ ఆసియా కప్ లో ఆడబోతున్నారు.  అలాగే టి.20ల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న  హైదరాబాద్ కు చెందిన తిలక్ వర్మకు చోటు కల్పించారు.

  దిల్లీలో జరిగిన సమావేశంలో మేధోమధననం అనంతరం సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. సమావేశంలో కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గొన్నారు.

  టీ-20లో రాణిస్తున్న ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణలకు చోటు దక్కింది. ఇక ఆల్ రౌండర్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, శార్దూల్ జట్టులో ఉండటంతో భారత జట్టు అత్యంత పటిష్ఠంగా ఉంది.  

  ఆసియాకప్ జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), హార్థిక్ పాండ్యా(వైస్ కెప్టెన్) శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.

   

  శ్రీలంక, పాకిస్తాన్ వేదికగా హైబ్రిడ్ మోడ్ లో ఆసియాకప్ టోర్నీ జరగనుంది. ఆగస్టు 30న ముల్తాన్ లో పాకిస్తాన్, నేపాల్ మధ్య మ్యాచ్ తో టోర్నీ ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ 2న పల్లెకెలె లో దాయాదుల సంగ్రామం జరగనుంది.  

  T Ramesh | 14:17 PM, Mon Aug 21, 2023

 • WORLD CUP : షెడ్యూల్ మార్పుపై ఐసీసీకి అభ్యర్థన..?

  వన్డే ప్రపంచకప్-2023 కు కౌంట్‌డౌన్ దగ్గర పడుతున్న కొద్దీ ఐసీసీ, బీసీసీఐలకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. షెడ్యూల్ మార్పు కోరుతూ అభ్యర్థనలు అందుతున్నట్లు తెలుస్తోంది. భారత్ వేదికగా జరిగే ఈ మెగా టోర్నమెంట్ కు ఇంకా 46 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వారం రోజుల్లో టికెట్ల విక్రయానికి కూడా బీసీసీఐ సిద్ధం అవుతోంది. ఇంతలోనే షెడ్యూల్ మార్పుపై ఆలోచించాలంటూ బీసీసీఐని హెచ్‌సీఏ కోరింది.

  వరల్డ్‌కప్ కొత్త షెడ్యూల్ ప్రకారం, హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 9న న్యూజిల్యాండ్, నెదర్లాండ్స్ తలపడనున్నాయి. మరుసటి రోజు అంటే అక్టోబర్ 10న పాకిస్తాన్, శ్రీలంక మధ్య మ్యాచ్ ఉంటుంది. ఇలా వరుస మ్యాచ్‌లకు భద్రత కల్పించడం కష్టమని పోలీసులు తెలపడంతో అదే విషయాన్ని హెచ్‌సీఏ, బీసీసీఐకి నివేదించిందట.

  పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్ అక్టోబర్ 12న జరగాల్సి ఉన్నప్పటికీ ఐసీసీ షెడ్యూల్ మార్చడంతో రెండు రోజులు  ముందుకు జరిగాల్సి వచ్చింది.  ఇప్పటికే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ లో ఐసీసీ స్వల్ప మార్పులు చేసింది. ప్రస్తుతం హెచ్‌సీఏ నుంచి అందిన లేఖపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి

  T Ramesh | 12:10 PM, Sun Aug 20, 2023

 • INDVS IRE: తొలి T-20లో భారత్ విజయం

  మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన తొలిపోరులో టిమిండియా గెలిచింది. . డబ్లిన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ గెలవడంతో 1-0 ఆధిక్యం సాధించింది. . 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.

  ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), రుతురాజ్ గైక్వాడ్(19) తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించారు. యశస్విని ఐర్లాండ్ బౌలర్ యంగ్‌  ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన తిలక్ వర్మ గోల్డెన్ డక్ గా పెవిలియన్ దారి పట్టాల్సి వచ్చింది. దీంతో 6.5 ఓవర్ల లో 47/2 స్కోరు చేసింది. తర్వాత వర్షం పడి మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ విజయం సాధించింది.

  ఐర్లాండ్ ఇన్నింగ్స్ లో మొత్తం 12 ఫోర్లు నమోదు కాగా మోకార్తీనే నాలుగు బౌండరీలు కొట్టారు. క్యాంఫర్ మూడు, మార్క్ ఐదెర్ రెండు ఫోర్లు కొట్టారు. కెప్టెన్ బుమ్రా, రవి బిష్ణోయ్, ప్రసిధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఐర్లాండ్ బ్యాట్స్ మెన్ అర్ధసెంచరీతో రాణించారు.

  T Ramesh | 11:06 AM, Sat Aug 19, 2023

ఫుట్‌బాల్

హాకీ

కబడ్డీ

google-add
google-add
google-add
google-add