Saturday, September 23, 2023

Odisha-365

ఆర్థికం

upload

మార్కెట్ న్యూస్

upload

IPHONE 15 SALES: భారత్‌లో ఐఫోన్-15 అమ్మకాలు ఆరంభం

యాపిల్ కొత్త ఐఫోన్ 15 సీరీస్ అమ్మకాలు దేశంలో ప్రారంభమయ్యాయి. కొత్త ఐఫోన్ల కొనుగోలుకు వినియోగదారులు ముంబై, దిల్లీలోని బ్రాంచ్‌ల దగ్గర క్యూ కట్టారు. యాపిల్ కంపెనీ ఐఫోన్‌ 15 సీరీస్‌ను సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది.

నాలుగు వేరియంట్లలో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఐఫోన్-15, ఐఫోన్-15 ప్లస్, ఐఫోన్-15 ప్రో, ఐ ఫోన్-15 ప్రో మ్యాక్స్, భారత్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రారంభ ధరను రూ. 79,900గా నిర్ణయించగా, ప్లస్ వెర్షన్ ధర రూ. 89,900, 15 ప్రో వెర్షన్ ధర రూ.1,34,900, 15 ప్రో ధర రూ. 1,59,900గా నిర్ణయించింది.  

లాంచ్ ఆఫర్ కింద హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుతో ఐఫోన్ 15 సీరీస్ కొనుగోలు చేసేవారు తక్షణమే రాయితీ పొందవచ్చు. అలాగే పాత ఐఫోన్‌ను మార్చుకోవడం ద్వారా ట్రేడ్ ఇన్ బెనిఫిట్ కింద డిస్కౌంట్ పొందే అవకాశం కల్పించారు. అలాగే ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి.

ఐఫోన్15 ప్రో మ్యాక్స్ లో బ్లూ టైటానియం, బ్లాక్ టైటానియం కలర్ వేరియంట్లు అక్టోబర్ మూడోవారంలో కొనుగోలుదారుల చేతికి రానున్నట్లు సమాచారం. నేచురల్ టైటానియం, వైట్ టైటానియం వేరియంట్లు నవంబర్ రెండోవారంలో మార్కెట్ లోకి రానున్నాయి.

T Ramesh | 14:19 PM, Fri Sep 22, 2023

STOCK MARKET: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. రూ. 5.4లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 570 పాయింట్లు నష్టపోయి 66,230కి దిగజారింది. నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 19,742కి దిగజారింది. అంతర్జాతీయ ప్రతికూలతలతో మదుపర్లు తీవ్రంగా నిరాశపడ్డారు. 

సోమవారం 242 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ , బుధవారం నాడు 796 పాయింట్లు, గురువారం 570 పాయింట్లు క్షీణించింది. వారంలో 1,608 పాయింట్లు నష్టపోయింది. గణేశ్ చతుర్థి సందర్భంగా స్టాక్ మార్కెట్‌కు మంగళవారం సెలవు ప్రకటించారు. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 318 కోట్లకు తగ్గగా, పెట్టుబడుల దారుల 5.4 లక్షల కోట్ల సంపద కరిగిపోయింది. యూఎస్ ఫెడరల్ గతరాత్రి  ఎలాంటి వడ్డీరేట్లు పెంచలేదు. ఈ ఏడాది 25 బేసిస్ పాయింట్ల రేటు పెంపుతో పాటు, వచ్చే సంవత్సరం లో 50 పాయింట్లు తగ్గించాలనే అంచనా వేసింది.

T Ramesh | 17:54 PM, Thu Sep 21, 2023

Stock Market : భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ సూచీలు

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. వరుసగా రెండో రోజూ నష్టాలు నమోదయ్యాయి. రెండు వారాలుగా పరుగులు తీసిన స్టాక్ మార్కెట్ల దూకుడుకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడంలాంటి అంశాలతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి.

ఉదయం నుంచే నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి భారీ నష్టాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 796 పాయింట్ల నష్టంతో 66800 వద్ద ముగిసింది. నిఫ్టీ 231 పాయింట్ల నష్టంతో 19878 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30లో ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, ఎన్‌టిపిసీ, టీసీఎస్, పవర్ గ్రిడ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్, విప్రో, మారుతి, టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిల్‌టెల్, టైటన్, ఎల్ అండ్ టీ భారీ నష్టాలను చవిచూశాయి.

ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగడంతో అన్ని రంగాల కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 96 డాలర్లకు చేరింది. భారత్ కెనడాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కూడా స్టాక్ సూచీలపై ప్రభావం చూపాయి.

K Venkateswara Rao | 17:12 PM, Wed Sep 20, 2023

Sensex : జీవితకాల గరిష్ఠాలను తాకిన దేశీయ స్టాక్ సూచీలు

స్టాక్ సూచీలు దూకుడుమీదున్నాయి. రెండో వారాంతంలోనూ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ సూచీలు సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి జీవిత కాల గరిష్ఠాలను రికార్డు చేశాయి. దేశీయ, అంతర్జాతీయంగా సానుకూల వాతావరణం నెలకొనడంతో స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. వరుసగా 11వ రోజూ స్టాక్ మార్కెట్లు లాభాల జోరుకొనసాగించాయి.

ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, ట్రేడింగ్ ముగిసే సమయానికి 319 పాయింట్లు లాభపడి 67838 వద్ద ముగిసింది. నిఫ్టీ 89 పాయింట్లు పెరిగి 20192 వద్ద ముగిసింది. రూపాయి మరింత బలహీన పడింది. డాలరుతో రూపాయి మారక విలువ 83.13గా ఉంది.

సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటన్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌యూ‌ఎల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ నష్టాలను చవిచూశాయి.

K Venkateswara Rao | 16:42 PM, Fri Sep 15, 2023

Stock Markets : జీవితకాల గరిష్ఠాలకు దేశీయ స్టాక్ సూచీలు

స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు వచ్చినా...దేశీయ సూచీలు సానుకూలంగా స్పందించాయి. నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ జీవిత కాల గరిష్ఠాలను రికార్డు చేశారు. సెన్సెక్స్ 234 పాయింట్ల లాభంతో 67701, నిఫ్టీ 73 పాయింట్ల లాభంతో 20143 వద్ద ప్రారంభం అయ్యాయి. రెండు సూచీలూ ఆరంభంలోనే జీవితకాల గరిష్ఠాలను నమోదు చేశాయి.

సెన్సెక్స్ 30లో టాటా స్టీల్, టెక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్, పవర్ గ్రిడ్, ఎస్‌బిఐ, ఇన్ఫోసిస్, ఇండస్ బ్యాంక్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలార్జించాయి. అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐటీసీ షేర్లు నష్టాలను చవిచూశాయి. విదేశీ పెట్టుబడిదారులు బుధవారం నాడు ఒక్క రోజే రూ.1631 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. ఇక దేశీయ ఇన్వెస్టర్లు రూ.849 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

K Venkateswara Rao | 10:07 AM, Thu Sep 14, 2023

Sensex : జీ20 సక్సెస్ ఎఫెక్ట్ : లాభాల్లో ముగిసిన స్టాక్ సూచీలు

ఢిల్లీ వేదికగా నిర్వహించిన జీ20 సమావేశాలు విజయవంతం కావడంతో స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. గడచిన కొంత కాలంగా చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లు లాభాల్లో దూసుకెళుతున్నా, స్టాక్ సూచీలు మాత్రం పరిమితికి లోబడి కదలాడాయి. అయితే జీ20 సమావేశాల్లో పలు కీలక వాణిజ్య ఒప్పందాలు చోటు చేసుకోవడం, ఇండియా, సౌదీ అరేబియా , యూరప్ రైల్వే కారిడార్ ఏర్పాటుకు చొరవ తీసుకోవడంలాంటి అంశాలు రైల్వే స్టాక్స్ దూసుకుపోయేలా చేశాయి. దీంతో సెన్సెక్స్ సూచీ 528 పాయింట్ల లాభంతో 67127 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇవాళ ట్రేడింగ్‌లో మొదటి సారి 20 వేల మార్కును దాటింది. మార్కెట్లు ముగిసే సమయానికి కొద్దిగా తగ్గి 176 పాయింట్ల లాభంతో 19996 వద్ద స్థిరపడింది.

ఇర్కాన్, రైట్స్, ఐఆర్‌ఎఫ్‌సీ, ఆర్‌వీఎన్‌ఎల్ షేర్లు 20 శాతం పైగా దూసుకెళ్లాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అపోలో హాస్పటల్స్, యాక్సిస్ బ్యాంకు షేర్లు లాభాలను ఆర్జించాయి. వేదాంతా, కోల్ ఇండియా, స్వరాజ్ ఇంజనీరింగ్, పెట్రోనెట్ కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 90 డాలర్లను దాటిపోవడం స్టాక్ మార్కెట్లను కొంత అనిశ్చితికి గురిచేస్తోంది.

K Venkateswara Rao | 16:07 PM, Mon Sep 11, 2023

G20 : వాణిజ్య అవకాశాల గని జీ20 సమ్మిట్

ఢిల్లీలో జీ20 సమావేశాలు పారంభమైన వేళ ముగిసిన వారాంతానికి భారత స్టాక్ మార్కెట్ల విలువ 300 లక్షల కోట్లను దాటింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ముందు వరుసలో నిలిచింది. కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు గణనీయంగా పెరగడం, చిన్న పెట్టుబడిదారులు ఉత్సాహంగా పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడంలాంటి అంశాలన్నీ భారత స్టాక్ మార్కెట్లు జీవిత కాల గరిష్ఠ విలువలను నమోదు చేసుకోవడానికి దోహదం చేశాయి.

ఆసియాలో అతి సురక్షిత పెట్టుబడికి సానుకూల అవకాశాలున్న దేశంగా భారత్‌ను గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్ ఇంక్ ఓ నివేదికలో వెల్లడించింది. చైనాలో అనేక రంగాలు కుదేలు కావడం, అక్కడి స్టాక్ మార్కెట్లు అనిశ్చితలో ఉండటం కూడా భారత్‌కు కలసి వచ్చింది. దీంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్‌ను పెట్టుబడికి సురక్షితమైన దేశంగా భావిస్తున్నట్టు గ్రూప్ ఇంక్ తన నివేదికలో వెల్లడించింది.

దేశంలో వృద్ధి అవకాశాలు, విధాన సంస్కరణలు, బలమైన క్రెడిట్ వృద్ధి భారతీయ ఈక్విటీ మార్కెట్ల పనితీరును మెరుగుపరిచాయని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ ఆడ్రి గోహ్ అభిప్రాయపడ్డారు. దేశంలో వ్యాపార, వాణిజ్యాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి భారత్ అడుగులు వేస్తోందని ఆయన కితాబిచ్చారు.

తాజాగా భారత స్టాక్ మార్కెట్ పెట్టుబడులు విలువ రూ.3 కోట్ల కోట్లు చేరి జీవిత కాల గరిష్ఠాలను నమోదు చేసింది. జీ20 సమావేశాలు జరుగుతున్న వేళ ఈ అంశం మరింత ప్రభావం చూపనుంది. అనేక కంపెనీలు చైనాను విడిచి భారత్‌లో తమ ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నాయి. యాపిల్, శ్యామ్‌సంగ్‌లాంటి కంపెనీలను భారత్ తీసుకువచ్చేందుకు ప్రధాని మోదీ స్వయంగా ప్రోత్సాహకాలు ప్రకటించారు.

విదేశీ పెట్టుబడిదారులు 2023లో ఇప్పటికే 1.13 లక్షల కోట్లతో స్టాక్స్ కొనుగోలు చేశారు. గడచిన మూడేళ్లలో ఇవి అతి పెద్ద మొత్తం కావడం గమనార్హం. చైనాలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడం కూడా భారత్‌కు కలసి వచ్చింది. పెట్టుబడులకు భారత్ అనుకూలంగా ఉందని, రాబోయే పదేళ్లకు అక్కడే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్టు లండన్‌కు చెందిన జెఫరీస్ ఎల్‌ఎల్‌సిలో ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్ హెడ్ క్రిస్ వుడ్ అభిప్రాయపడ్డారు. 2020లో కోవిడ్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ కొంత మందగించినా నేడు, ప్రపంచంలోనే అతిపెద్ద ఐదో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుగా ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదికలో వెల్లడించింది.

అవాంతరాలు కూడా పొంచి ఉన్నాయి

భారత్ పెట్టుబడిదారులకు సానుకూలంగా ఉండటమే కాదు అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. పెరిగిపోయిన ముడి చమురు ధరలు, నిత్యావసర ధరలు ద్రవ్యోల్భణాన్ని పెంచేశాయి. మరోవైపు డాలరుతో రూపాయి విలువ ఎన్నడూ లేని విధంగా పతనమైంది. త్వరలో సాధారణ ఎన్నికలు కూడా ఉండటంతో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగే అవకాశం కనిపిస్తోంది. దేశంలో మౌలిక సదుపాయాలను వేగంగా పెంచడం, విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం, యువ జనాభాకు తగినన్ని ఉద్యోగాలు కల్పించడం దేశం ముందున్న సవాళ్లుగా చెప్పవచ్చు.

చైనాలో కొంత ఆర్థిక అనిశ్చితి ఉన్నా పెట్టుబడిదారులు భారత్‌కు పెద్దగా వెళ్లడం లేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే భారత స్టాక్స్ అధిక ధరలో కొనసాగుతున్నాయని, గడచిన మూడు మాసాల్లో ఎన్‌ఎస్‌ఈ 50 స్టాక్స్ 6 శాతం పెరిగినట్టు వారు గుర్తు చేశారు. చైనా నుంచి అమెరికా కంపెనీలు పెట్టుబడులు ఉపసంహరించుకోవడం వల్ల ఇండోనేషియా, మెక్సికో, పోలండ్ దేశాలు ప్రయోజనం పొందే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా భారత ఆర్థిక వ్యవస్థను విస్మరించడానికి లేదని, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగవచ్చని లండన్‌కు చెందిన ఆర్థిక విశ్లేషకుడు గోర్డాన్ బోవర్స్ అభిప్రాయపడ్డారు.

K Venkateswara Rao | 12:10 PM, Sat Sep 09, 2023

Crypto Assets : క్రిప్టో కరెన్సీ నియంత్రణకు చర్యలు

ప్రపంచ దేశాలకు మింగుడుపడకుండా తయారైన క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు అన్ని దేశాలతో చర్చలు జరుపుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.అన్ని దేశాల సహకారం లేకుండా వీటిని నియంత్రించడం సాధ్యం కాదని ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె స్పష్టం చేశారు.

క్రిప్టో ఆస్తులను నిర్వహించడానికి ఒక వ్యవస్థ ఉండాలని, ఇదే విషయాన్ని త్వరలో జరగనున్న జీ20 సమావేశాల్లో కూడా చర్చించనున్నట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు.
క్రిప్టో కరెన్సీ వ్యాపారానికి కూడా మనీలాండరింగ్ చట్టాలు వర్తిస్తాయని గత మార్చిలో ప్రభుత్వం స్పష్టం చేసింది. వర్చువల్ డిజిటల్ ఆస్తులు, ఫియట్ కరెన్సీల మధ్య మార్పిడి, ఒకటి, అంతకంటే ఎక్కువ వర్చువల్ డిజిటల్ ఆస్తుల మధ్య మార్పిడి, బదిలీ అంశాలు మనీలాండరింగ్ చట్టాల పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

క్రిప్టో కరెన్సీ వినియోగాన్ని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. క్రిప్టో కరెన్సీ నియంత్రణకు దేశంలో ఎలాంటి చట్టాలు చేయలేదు. ఇవి బురిడీ కొట్టించే పథకాలతో సమానంగా ఉన్నాయని, వెంటనే నిషేధించాలని ఆర్బీఐ హెచ్చరించింది.

క్రిప్టో కరెన్సీలను నియంత్రించేందుకు జీ20 దేశాల సదస్సుకు అతిధ్యం ఇస్తోన్న భారత్, ఐఎంఎఫ్, అమెరికా అనుమతి కూడా ఇప్పటికే తీసుకుంది. క్రిప్టో కరెన్సీల నియంత్రణపై జీ20 దేశాలు ఉమ్మడి వ్యవస్థను రూపొందించేందుకు ఇప్పటికే ఒక సమావేశం నిర్వహించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుర్తుచేశారు. గత ఫిబ్రవరిలో అమెరికా ట్రజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్‌తో క్రిప్టో ఆస్తుల నియంత్రణపై చర్చించినట్టు ఆమె తెలిపారు. బిట్‌కాయిన్‌లాంటి క్రిప్టో కరెన్సీల ద్వారా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా కృషి చేయాలని నిర్మలా పిలుపునిచ్చారు.

K Venkateswara Rao | 12:13 PM, Wed Sep 06, 2023

Stock Markets : లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

స్టాక్ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులతో ఆసియా మార్కెట్లు, దేశీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 227 పాయింట్ల లాభంతో 65614 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 80 పాయింట్లు లాభపడి నిఫ్టీ 19515 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30లో ఎల్ అండ్ టీ, టెక్ మహీంద్రా, మారుతీ, హెచ్‌సిఎల్ టెక్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, జెఎస్‌డబ్ల్యూ, కోటక్ మహీంద్రా, విప్రో షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిల్‌టెల్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలను చవిచూశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 82.75 వద్ద కొనసాగుతోంది.

ఆసియా మార్కెట్లు సానుకూలంగా ప్రారంభం కావడం, చైనాలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందనే అంచనాల నేపథ్యంలో దేశీయ స్టాక్ సూచీలు లాభాల బాట పట్టాయి. చైనాలో ఎవర్ గ్రాండ్, కంట్రీ గార్డెన్‌లాంటి రియల్ ఎస్టేట్ సంస్థల షేర్లు ఒకేసారి 8 శాతం పెరిగాయి. మరోవైపు ఈ వారం నాలుగు ఐపీవోలు ప్రారంభం కానున్నాయి.

K Venkateswara Rao | 10:10 AM, Mon Sep 04, 2023

Crude Oil Imports : రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులు తగ్గించిన భారత్

ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలయ్యాక రష్యా నుంచి పెద్ద ఎత్తున భారత్ క్రూడాయిల్ దిగుమతులు ప్రారంభించింది. అయితే అనూహ్యంగా గడచిన మూడు నెలలుగా రష్యా క్రూడ్ దిగుమతులు గణనీయంగా తగ్గాయి. క్రూడ్ దిగుమతులు ఆగష్టులో ఏడు నెలల కనిష్ఠానికి తగ్గాయి. గత నెలలో రోజుకు 1.91 మిలియన్ బ్యారెళ్లు దిగుమతి చేసుకోగా, ప్రస్తుతం రోజుకు 1.46 మిలియన్ బ్యారెళ్లు మాత్రమే దిగుమతి చేసుకుంటోంది.

భారత చమురు కంపెనీలు సౌదీ నుంచి క్రూడ్ దిగుమతులు పెంచుకున్నాయి. జులైలో సౌదీ నుంచి రోజుకు 4.84 లక్షల బ్యారెళ్లు రాగా, ప్రస్తుతం రోజుకు 8.20 లక్షల బ్యారెళ్లకు పెరిగాయి. అయితే ఇరాక్ నుంచి దిగుమతులు గణనీయంగా తగ్గాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపధ్యంలో రష్యా తక్కువ ధరకే చములు అమ్మడం మొదలు పెట్టింది. దేశ ఆర్థిక ప్రయోజనాల రీత్యా భారత్ రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకుంది. వేసవి చివరి వరకు రోజు 20 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకున్నారు. వర్షాకాలం డిమాండ్ తగ్గడం, చమురు శుద్ధి కంపెనీలు వార్షిక మరమ్మతులు చేపట్టడంతో దిగుమతులు తగ్గాయని అంచనా వేస్తున్నారు.

K Venkateswara Rao | 17:26 PM, Sun Sep 03, 2023

upload
upload

టెక్ న్యూస్

upload

SBI : అందుబాటులోకి ఎస్‌బి‌ఐ డిజిటల్ రూపీ

ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ రూపీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక నుంచి యూపీఐ ఇంటర్ ఆపరేబిలిటీ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డిజిటల్ రూపీ చెల్లింపులు చేయవచ్చు. ఎస్‌బిఐ ఇ- యాప్ వాడుతున్న వారు యూపీఐ స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చని బ్యాంకు అధికారులు ప్రకటించారు.

ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ, కెనరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంకులు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాయి. తాజాగా ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు ఎస్‌బిఐ కూడా ఇ- రూపీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే క్యూ ఆర్ కోడ్ ఉపయోగిస్తున్న వారు డిజిటల్ రూపీని వినియోగించుకోవచ్చు.

డిజిటల్ కరెన్సీ ఇ-రూపీని ఆర్‌బిఐ గతేడాది ఫైలట్ ప్రాజెక్టుగా తీసుకువచ్చింది. ముందుగా వ్యాపారులకు, తరవాత సామాన్య వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఫైలట్ ప్రాజెక్టు చేపట్టారు. ఇప్పటికే అరడజనుకుపైగా బ్యాంకులు ఇ-రూపీని అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఎంపిక చేసిన కస్టమర్ల ద్వారా ఈ ఫైలెట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.

K Venkateswara Rao | 15:34 PM, Mon Sep 04, 2023

G-20MEET : భారత ఆర్థిక వ్యవస్థకు డిజిటల్ బూస్ట్

డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఎకానమీ, డిజిటల్ స్కేలింగ్ భారత్ ప్రాధాన్య అంశాలని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న జీ-20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూపు మంత్రుల సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, .. భారత ప్రాధాన్యాంశాలు ప్రధాని మోదీవిశాల థృక్పదానికి నిదర్శమన్నారు.

అందరికీ విశ్వాసం, రక్షణ, సమానత్వం పెంపొందించేలా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడమే భారత్ అజెండా అని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతీకరణను ప్రధాని నమ్ముతారన్న కేంద్రమంత్రి వైష్ణవ్.. ఎన్నో ఆవిష్కరణలకు బెంగళూరు పుట్టినిల్లు అని కొనియాడారు. ప్రపంచప్రఖ్యాత టెక్ కంపెనీల కార్యకలాపాలకు నిలయంగా మారిన విషయాన్ని గుర్తు చేశారు.   

డిజిటల్ ఎకానమీ వృద్ధికి అనేక దేశాలు సహకరించుకోవడానికి జి-20  సమావేశం దోహదం చేస్తుందన్నారు. చర్చల ద్వారా సమస్యలకు వినూత్న పరిష్కారాలు, సహకార వ్యూహాల గురించి తెలుసుకోవచ్చు అని అభిప్రాయపడ్డారు.

అంతకు ముందు డిజిటల్ ఎకానమీ పై ప్రసంగించిన ప్రధాని మోదీ, భారత్ లో 85 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నరని, ప్రపంచదేశాల కంటే  అత్యంత చౌక ధరకే అందజేస్తున్నట్లు తెలిపారు. జన్ ధన్ అకౌంట్లు, ఆధార్, మొబైల్ వాడకంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నట్లు వివరించిన ప్రధాని మోదీ.. ప్రతినెలా  యూపీఐల ద్వారా పదిబిలియన్లలావాదేవీలు జరుగుతున్నాయని వెల్లడించారు.  వీటిలో 45 శాతం గ్లోబల్ రియల్ టైమ్ పేమెంట్లు ఉన్నాయని చెప్పారు. టెక్నాలజీని భారత్ అందిపుచ్చుకుందని చెప్పడానికి ఆదే నిదర్శనమన్నారు. పన్నుల వ్యవస్థ ప్రక్రియను డిజిటలైజేషన్ చేయడంతో పారదర్శకత పెరిగిందన్నారు.  

T Ramesh | 18:00 PM, Sat Aug 19, 2023

చైనాను కాదని బారత్ లో ఐఫోన్-15 తయారీ..!

భారత్‌లో ఐఫోన్ -15ను భారీఎత్తున తయారు చేసేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఐఫోన్‌ల తయారీలో ప్రధాన దేశమైన చైనాకు యాపిల్ ఉత్పత్తుల తయారీ, సరఫరా, అమ్మకాలు, సర్వీసింగ్ వంటి విభాగాల్లో కీలమైన భారత్‌కు మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు పెరంబదూర్ కేంద్రంగా ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ప్లాంట్లో గతంలో కంటే ఎక్కవగానే ఈ లేటెస్ట్ వెర్షన్ ఐఫోన్‌లను తయారు చేయనుంది. చైనాలో తయారైన యాపిల్ ప్రొడక్ట్ లు ఇతర దేశాలకు దిగుమతి చేసిన వారం రోజుల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.   చైనాలో సప్లై చైన్ సమస్యలు, అమెరికా-చైనాల మధ్య తగ్గిపోతున్న వ్యాపార సంబంధాలు, అదే సమయంలో తయారీ కేంద్రంగా ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా అమెరికాతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్నారు. భారత్ ను తయారీ కేంద్రంగా మలుచుకోవాలని టెక్ దిగ్గజాలను కోరారు.

చైనాలో సప్లై చైన్ సమస్యలతో యాపిల్ తన తయారీని భారత్‌కు తరలించాలని నిర్ణయించింది. కాబట్టే గత ఏడాదిలో భారత్‌లో తయారైన యాపిల్ ఐఫోన్ షిప్మెంట్ విలువ 65 శాతం పెరిగింది. ఐఫోన్ల ఎగుమతుల విలువ 162 శాతం పెరిగిందంటూ సౌత్ ‌చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. ఈ నివేదికను కోడ్ చేస్తూ ప్రముఖ మార్కెట్ సంస్థ కౌంటర్ పాయింట్ మరో రిపోర్టును వెలుగులోకి తెచ్చింది. 2022లో భారత్ లో మొత్తం స్మార్ట్ ఫోన్ షిప్ మెంట్ విలువలో యాపిల్ కు 25 శాతం వాటాను కలిగి ఉందని తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా 85 శాతం ఐఫోన్‌లను చైనానే తయారు చేస్తుందని సౌత్ చైనా మార్నింగ్ పోస్టు నివేదికలో టెక్నాలజీ రిపోర్టర్ జిన్నీ షెన్ తెలిపారు. అయినప్పటికీ యాపిల్ తన తయారీని చైనా నుంచి భారత్ కు తరలించాలని భావిస్తున్నందున బీజింగ్ తన ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

T Ramesh | 18:28 PM, Wed Aug 16, 2023

Laptops Import Ban : ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబులు, పీసీల దిగుమతులపై ఆంక్షలు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబులు, పీసీల దిగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. అయితే ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబులు, పీసీల దిగుమతులకు కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. సరైన అనుమతులు ఉంటే వీటిని దేశంలోకి తీసుకురావచ్చని తెలిపింది.

హెచ్‌ఎస్‌ఎల్ 8741 కింద దిగుమతి చేసుకునే ల్యాప్‌ట్యాప్‌లు ట్యాబులు పీసీలు, అల్ట్రా స్మాల్ ఫామ్ ఫ్యాక్టర్ కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతులపై ఆంక్షలు అమలు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

బ్యాగేజీ రూల్స్ కింద తీసుకువచ్చే ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబులు, పీసీలపై మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ సరైన పత్రాలు చూపాల్సి ఉంటుంది. విదేశాల్లో కొనుగోలు చేసిన ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబులు, పీసీలకు సంబంధించి కస్టమ్స్ శాఖ వారికి సరైన పత్రాలు చూపిస్తే అనుమతిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. 

ఇక ఆన్‌లైన్లో కొనుగోలు చేసుకునే ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబులు, పీసీలపై ఎలాంటి ఆంక్షలు లేవని కేంద్రం తెలిపింది. పరిశోధన, అభివృద్ధి, బెంచ్‌మార్కింగ్, రిపేర్లు, రీ ఎక్స్‌పోర్ట్, ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ కోసం దిగుమతి చేసుకునే వాటికి కూడా ఈ ఆంక్షలు వర్తించవు. అయితే రీసెర్చ్ డెవలప్‌మెంట్ పని పూర్తయిన తరవాత తిరిగి వాటిని విదేశాలకు పంపడం లేదా ధ్వంసం చేయడం చేయాలని కేంద్రం షరతులు విధించింది. 

Editor | 14:54 PM, Thu Aug 03, 2023

UGC proposes to make four-year UG courses must for degree with honoursunique157unique157

When Parkash Singh Badal reigned supreme in Punjab, his outreach was unrivalled. When he fail

| 15:23 PM, Fri May 26, 2023

UGC proposes to make four-year UG courses must for degree with honoursunique156unique156

When Parkash Singh Badal reigned supreme in Punjab, his outreach was unrivalled. When he fail

| 15:22 PM, Fri May 26, 2023

UGC proposes to make four-year UG courses must for degree with honoursunique153unique153

Asia's biggest auto expo to be held in Bengaluru on April 13-14

| 15:19 PM, Fri May 26, 2023

UGC proposes to make four-year UG courses must for degree with honoursunique152unique152

When Parkash Singh Badal reigned supreme in Punjab, his outreach was unrivalled. When he fail

| 15:18 PM, Fri May 26, 2023

UGC proposes to make four-year UG courses must for degree with honoursunique149unique149

Tech-led solutions key to restore confidence in international travel

| 13:21 PM, Fri May 26, 2023

UGC proposes to make four-year UG courses must for degree with honoursunique148unique148

Tech-led solutions key to restore confidence in international travel

| 13:20 PM, Fri May 26, 2023

upload
upload

ఆటో న్యూస్

upload

Elon Musk:  ఎక్స్(ట్విట్టర్) లో పోస్టు చేయాలంటే నెలవారీ ఛార్జీ చెల్లించాల్సిందేనా..?

సంచలనాత్మక నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ప్రపంచ కుబేరుడు ఎలన్‌మస్క్, ఎక్స్(ట్విట్టర్) లో ఉచిత సేవలు నిలిపివేయాలని భావిస్తున్నారట. ఏదైనా సమాచారాన్ని పోస్టు చేయాలన్నా, ఇతరులతో పంచుకోవాలన్నా పెయిడ్ సబ్ క్రిప్షన్ తీసుకోవాల్సిందేనట. అంటే ఎక్స్ ను ఉపయోగించాలంటే నెలవారీ ఛార్జీలు చెల్లించాల్సిందే. నకిలీ అకౌంట్లకు చెక్ పెట్టడమే లక్ష్యంగా  ఎలన్ మస్క్  ఈ నిర్ణయం తీసుకోబోతున్నారనే ప్రచారం సాగుతోంది.

ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు తో ఆన్‌లైన్ లో సంభాషించిన ఎలన్ మస్క్,  ఎక్స్ గురించి మాట్లాడారు. ప్రతినెలా 550 మిలియన్ల మంది ఎక్స్ ను ఉపయోగిస్తున్నారని రోజుకు 100 నుంచి 200 మిలియన్ పోస్టులు చేస్తున్నారని ప్రకటించారు. అయితే ఇందులో నిజమైన ఖాతాదారుల ఎంతో మందో నకిలీ ఖాతాలో ఎన్నో సరైన లెక్కలు లేవు.  ఆర్టి ఫిషియల్ ఇంటిలిజెన్స్ లాంటి కొత్త టెక్నాలజీ కీలకంగా మారిన సమయంలో ఎక్స్(ట్విట్టర్)లో సంస్కరణలు చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

విద్వేష ప్రసంగాల పోస్టులకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.  ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ఎలన్ మస్క్ అందులో చెప్పుకోదగిన స్థాయిలో మార్పులు తీసుకొచ్చారు. నిషేధిత ఖాతాలను యాక్టివ్  చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరించారు. అలాగే ప్రముఖు ఖాతాలకు ఉపయోగించే బ్లూమార్క్ ను కూడా తొలగించారు.

కొన్ని రోజులుగా ట్విటర్ ఆదాయం తగ్గిపోయిందనే ప్రచారం జరుగుతోంది. యాడ్ సేల్స్ కూడా తగ్గిపోయాయని, దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టిన మస్క్, పోస్టుకు డబ్బులు వసూలు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.

T Ramesh | 15:29 PM, Tue Sep 19, 2023

ఆ కారు ధర 76 లక్షలు

బీఎండబ్ల్యూ భారత్‌లో మరో కొత్త స్పోర్ట్స్ కారును విడుదల చేసింది. 630ఐ ఎం స్పోర్ట్‌ సిగ్నేచర్‌ పేరిట వస్తున్న కారును భారత్‌లోనే తయారు చేసారు. చెన్నై ప్లాంట్‌లో దీన్ని ఉత్పత్తి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ‌కేవలం పెట్రోల్‌ వేరియంట్‌లో విడుదల చేసిన ఈ కారు ధర రూ.75.90 లక్షలు మాత్రమే.

బీఎండబ్ల్యూ 630ఐ ఎం స్పోర్ట్‌ సిగ్నేచర్‌లో 2-లీటర్‌-4-సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 6.5 సెకన్లలోనే అందుకుంటుంది. కీలెస్‌ ఎంట్రీ, ఇన్ఫోటైన్‌మెంట్‌ టచ్‌స్క్రీన్‌, రిమోట్‌ పార్కింగ్‌ అసిస్ట్‌ ఫీచర్లు ఉన్నాయి. వెనుక సీట్లకు వేరేగా ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్లు ఉన్నాయి. రివర్స్‌ కెమెరా, అత్యాధునిక సౌండ్‌ సిస్టమ్‌ ఉన్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని సీట్లకు త్రీపాయింట్‌ సీట్‌ బెల్ట్‌లు వంటి సేఫ్టీ ఫీచర్స్ ఈ కారు సొంతం.

P Phaneendra | 17:42 PM, Mon Sep 11, 2023

UGC proposes to make four-year UG courses must for degree with honoursunique159unique159

When Parkash Singh Badal reigned supreme in Punjab, his outreach was unrivalled. When he fail

| 15:26 PM, Fri May 26, 2023

UGC proposes to make four-year UG courses must for degree with honoursunique158unique158

When Parkash Singh Badal reigned supreme in Punjab, his outreach was unrivalled. When he fail

| 15:25 PM, Fri May 26, 2023

UGC proposes to make four-year UG courses must for degree with honoursunique157unique157

When Parkash Singh Badal reigned supreme in Punjab, his outreach was unrivalled. When he fail

| 15:23 PM, Fri May 26, 2023

UGC proposes to make four-year UG courses must for degree with honoursunique156unique156

When Parkash Singh Badal reigned supreme in Punjab, his outreach was unrivalled. When he fail

| 15:22 PM, Fri May 26, 2023

UGC proposes to make four-year UG courses must for degree with honoursunique155unique155

When Parkash Singh Badal reigned supreme in Punjab, his outreach was unrivalled. When he fail

| 15:22 PM, Fri May 26, 2023

UGC proposes to make four-year UG courses must for degree with honoursunique154unique154

When Parkash Singh Badal reigned supreme in Punjab, his outreach was unrivalled. When he fail

| 15:21 PM, Fri May 26, 2023

upload
upload

ప్రాపర్టీస్ న్యూస్

upload

UGC proposes to make four-year UG courses must for degree with honoursunique177unique177

When Parkash Singh Badal reigned supreme in Punjab, his outreach was unrivalled. When he fail

| 15:50 PM, Fri May 26, 2023

UGC proposes to make four-year UG courses must for degree with honoursunique176unique176

When Parkash Singh Badal reigned supreme in Punjab, his outreach was unrivalled. When he fail

| 15:48 PM, Fri May 26, 2023

UGC proposes to make four-year UG courses must for degree with honoursunique169unique169

When Parkash Singh Badal reigned supreme in Punjab, his outreach was unrivalled. When he fail

| 15:39 PM, Fri May 26, 2023

UGC proposes to make four-year UG courses must for degree with honoursunique168unique168

When Parkash Singh Badal reigned supreme in Punjab, his outreach was unrivalled. When he fail

| 15:37 PM, Fri May 26, 2023

UGC proposes to make four-year UG courses must for degree with honoursunique167unique167

When Parkash Singh Badal reigned supreme in Punjab, his outreach was unrivalled. When he fail

| 15:36 PM, Fri May 26, 2023

UGC proposes to make four-year UG courses must for degree with honoursunique165unique165

When Parkash Singh Badal reigned supreme in Punjab, his outreach was unrivalled. When he fail

| 15:32 PM, Fri May 26, 2023

UGC proposes to make four-year UG courses must for degree with honoursunique164unique164

When Parkash Singh Badal reigned supreme in Punjab, his outreach was unrivalled. When he fail

| 15:31 PM, Fri May 26, 2023

UGC proposes to make four-year UG courses must for degree with honoursunique163unique163

When Parkash Singh Badal reigned supreme in Punjab, his outreach was unrivalled. When he fail

| 15:30 PM, Fri May 26, 2023

upload
upload

అంతర్జాతీయం

upload

STOCK MARKET: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. రూ. 5.4లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 570 పాయింట్లు నష్టపోయి 66,230కి దిగజారింది. నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 19,742కి దిగజారింది. అంతర్జాతీయ ప్రతికూలతలతో మదుపర్లు తీవ్రంగా నిరాశపడ్డారు. 

సోమవారం 242 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ , బుధవారం నాడు 796 పాయింట్లు, గురువారం 570 పాయింట్లు క్షీణించింది. వారంలో 1,608 పాయింట్లు నష్టపోయింది. గణేశ్ చతుర్థి సందర్భంగా స్టాక్ మార్కెట్‌కు మంగళవారం సెలవు ప్రకటించారు. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 318 కోట్లకు తగ్గగా, పెట్టుబడుల దారుల 5.4 లక్షల కోట్ల సంపద కరిగిపోయింది. యూఎస్ ఫెడరల్ గతరాత్రి  ఎలాంటి వడ్డీరేట్లు పెంచలేదు. ఈ ఏడాది 25 బేసిస్ పాయింట్ల రేటు పెంపుతో పాటు, వచ్చే సంవత్సరం లో 50 పాయింట్లు తగ్గించాలనే అంచనా వేసింది.

T Ramesh | 17:54 PM, Thu Sep 21, 2023

Elon Musk:  ఎక్స్(ట్విట్టర్) లో పోస్టు చేయాలంటే నెలవారీ ఛార్జీ చెల్లించాల్సిందేనా..?

సంచలనాత్మక నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ప్రపంచ కుబేరుడు ఎలన్‌మస్క్, ఎక్స్(ట్విట్టర్) లో ఉచిత సేవలు నిలిపివేయాలని భావిస్తున్నారట. ఏదైనా సమాచారాన్ని పోస్టు చేయాలన్నా, ఇతరులతో పంచుకోవాలన్నా పెయిడ్ సబ్ క్రిప్షన్ తీసుకోవాల్సిందేనట. అంటే ఎక్స్ ను ఉపయోగించాలంటే నెలవారీ ఛార్జీలు చెల్లించాల్సిందే. నకిలీ అకౌంట్లకు చెక్ పెట్టడమే లక్ష్యంగా  ఎలన్ మస్క్  ఈ నిర్ణయం తీసుకోబోతున్నారనే ప్రచారం సాగుతోంది.

ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు తో ఆన్‌లైన్ లో సంభాషించిన ఎలన్ మస్క్,  ఎక్స్ గురించి మాట్లాడారు. ప్రతినెలా 550 మిలియన్ల మంది ఎక్స్ ను ఉపయోగిస్తున్నారని రోజుకు 100 నుంచి 200 మిలియన్ పోస్టులు చేస్తున్నారని ప్రకటించారు. అయితే ఇందులో నిజమైన ఖాతాదారుల ఎంతో మందో నకిలీ ఖాతాలో ఎన్నో సరైన లెక్కలు లేవు.  ఆర్టి ఫిషియల్ ఇంటిలిజెన్స్ లాంటి కొత్త టెక్నాలజీ కీలకంగా మారిన సమయంలో ఎక్స్(ట్విట్టర్)లో సంస్కరణలు చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

విద్వేష ప్రసంగాల పోస్టులకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.  ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ఎలన్ మస్క్ అందులో చెప్పుకోదగిన స్థాయిలో మార్పులు తీసుకొచ్చారు. నిషేధిత ఖాతాలను యాక్టివ్  చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరించారు. అలాగే ప్రముఖు ఖాతాలకు ఉపయోగించే బ్లూమార్క్ ను కూడా తొలగించారు.

కొన్ని రోజులుగా ట్విటర్ ఆదాయం తగ్గిపోయిందనే ప్రచారం జరుగుతోంది. యాడ్ సేల్స్ కూడా తగ్గిపోయాయని, దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టిన మస్క్, పోస్టుకు డబ్బులు వసూలు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.

T Ramesh | 15:29 PM, Tue Sep 19, 2023

ED RAIDS: మహాదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల అరెస్టు.. రూ.417 కోట్లు సీజ్

మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మనీ ల్యాండరింగ్‌తో పాటు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కోల్‌కతా, బోపాల్, ముంబై లో సోదాలు నిర్వహించి సాక్ష్యాలను సంపాదించారు. అలాగే లెక్కలు చూపని రూ.417 కోట్ల నగదు సీజ్ చేశారు.

ఆన్‌లైన్ బెట్టింగ్‌ను ప్రోత్సహించడంతో పాటు అక్రమంగా పోగు చేసిన నగదును హవాలా మార్గంలో మళ్ళించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. బినామీ బ్యాంకు ఖాతాలు తెరవడం నుంచి బెట్టింగ్ చేసేందుకు వెబ్‌సైట్ లో యూజర్ ఐడీ, పాస్ వర్డ్స్ తయారు చేయడం వరకు మహదేవ్ యాప్ నిర్వాహకులు చేస్తున్నట్లు విచారణలో తేలింది.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని భిలాయ్‌కు చెందిన సౌరభ్ చంద్రశేఖర్, రావి ఉప్పల్ యాప్ ప్రధాన నిర్వాహకులుగా ఉన్నారని, దుబాయి కేంద్రంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఈడీ పేర్కొంది. కొత్త వారిని బెట్టింగ్ వైపు ఆకర్షించేందుకు వెబ్‌సైట్లలో ప్రకటనలు ఇవ్వడంతో పాటు పెద్దమొత్తంలో నగదును విదేశీ బ్యాంకులకు మళ్లించి సొమ్ము చేసుకున్నారని పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో తనిఖీలు నిర్వహించిన ఈడీ అధికారులు, బెట్టింగ్ సిండికేట్ లో కీలకంగా వ్యవహరిస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. దేశ వ్యాప్తంగా 39 చోట్ల సోదాలు నిర్వహించి రూ. 417 కోట్ల నగదు సీజ్ చేశారు. తదుపరి విచారణను విదేశాల్లో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు పీఎంఎల్ఏ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది

T Ramesh | 16:54 PM, Fri Sep 15, 2023

G20: Modi Bilateral Meetings: జి-20 సమావేశాల్లో పలు దేశాల అధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు

జి-20 సమావేశాల సందడి శుక్రవారం నుంచే మొదలైంది. ఇవాళ, రేపు జరగనున్న సమావేశాలతో ఈ సదస్సు ముగుస్తుంది. ఈ సమావేశాల కోసం భారత్ వచ్చిన పలువురు విదేశీ నేతలతో భారత ప్రధానమంత్రి ప్రత్యక్షంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

నరేంద్ర మోదీ మొట్టమొదటగా మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జగ్‌నాథ్‌తో శుక్రవారం సాయంత్రం భేటీ అయారు. మారిషస్ ఆర్థిక వ్యవస్థకు భారత్ అందిస్తున్న సహకారానికి ప్రవింద్ ధన్యవాదాలు తెలియజేసారు. మారిషస్‌తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న మొట్టమొదటి దేశం భారతదేశమే. భారత్ తమ దేశానికి ఎంత ప్రాధాన్యతనిస్తోందో ఆ ఒప్పందం ద్వారా తెలిసిందంటూ ప్రవింద్ హర్షం వ్యక్తం చేసారు.

ఆ తర్వాత భారత ప్రధానమంత్రి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాతో సమావేశమయ్యారు. వారిద్దరి ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఇరుదేశాలూ మూడు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేసాయి. డిజిటల్ పేమెంట్ మెకానిజంలో సహకారం కోసం  నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బంగ్లాదేశ్ బ్యాంక్‌లు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. రెండవది, ఇరు దేశాల మధ్యా కల్చరల్ ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్‌ను మరో రెండేళ్ళు పొడిగించే ఒప్పందం మీద ఇరు దేశాల ప్రతినిథులూ సంతకాలు చేసారు. ఇక మూడవ ఒప్పందం వ్యవసాయ రంగానికి సంబంధించినది. వ్యవసాయ పరిశోధనల్లో పరస్పర సహాయం కోసం -- భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఇకార్, బంగ్లాదేశ్ వ్యవసాయ పరిశోధనా సంస్థ బార్క్ – ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇద్దరు ప్రధానమంత్రులూ రాజకీయ, భద్రతా సహకారం, సరిహద్దుల నిర్వహణ, వాణిజ్యం, కనెక్టివిటీ, జల వనరులు, విద్యుత్తు, ఇంధనం, తదితర అంశాల పైన కూడా చర్చలు సాగించారు.

ఆ తర్వాత మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇచ్చేందుకు అమెరికా సహకరిస్తుందని బైడెన్ మోదీకి వెల్లడించారు. అలాగే, 2028-29 సంవత్సరంలో భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు సైతం మద్దతిస్తామని ప్రకటించారు. ఆ విషయాన్ని వైట్‌హౌస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇద్దరు దేశాధినేతలూ ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్ళే విధంగా చర్చలు జరిపారు. భారత్-అమెరికా మధ్య స్నేహబంధం ప్రపంచానికి మేలు చేసే దిశగా కొనసాగుతుందని మోదీ వ్యాఖ్యానించారు.

ఇక ఈ ఉదయం నరేంద్ర మోదీ, ఇంగ్లండ్ ప్రధానమంత్రి రిషి శునక్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్యా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలపై ఇద్దరు నేతలూ చర్చించారు. ప్రపంచం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో జి-20 కూటమి ఆ సమస్యలకు పరిష్కారాలు చూపించగలదని రిషి శునక్ ఆశాభావం వ్యక్తం చేసారు.

P Phaneendra | 17:43 PM, Sat Sep 09, 2023

G20 : వాణిజ్య అవకాశాల గని జీ20 సమ్మిట్

ఢిల్లీలో జీ20 సమావేశాలు పారంభమైన వేళ ముగిసిన వారాంతానికి భారత స్టాక్ మార్కెట్ల విలువ 300 లక్షల కోట్లను దాటింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ముందు వరుసలో నిలిచింది. కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు గణనీయంగా పెరగడం, చిన్న పెట్టుబడిదారులు ఉత్సాహంగా పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడంలాంటి అంశాలన్నీ భారత స్టాక్ మార్కెట్లు జీవిత కాల గరిష్ఠ విలువలను నమోదు చేసుకోవడానికి దోహదం చేశాయి.

ఆసియాలో అతి సురక్షిత పెట్టుబడికి సానుకూల అవకాశాలున్న దేశంగా భారత్‌ను గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్ ఇంక్ ఓ నివేదికలో వెల్లడించింది. చైనాలో అనేక రంగాలు కుదేలు కావడం, అక్కడి స్టాక్ మార్కెట్లు అనిశ్చితలో ఉండటం కూడా భారత్‌కు కలసి వచ్చింది. దీంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్‌ను పెట్టుబడికి సురక్షితమైన దేశంగా భావిస్తున్నట్టు గ్రూప్ ఇంక్ తన నివేదికలో వెల్లడించింది.

దేశంలో వృద్ధి అవకాశాలు, విధాన సంస్కరణలు, బలమైన క్రెడిట్ వృద్ధి భారతీయ ఈక్విటీ మార్కెట్ల పనితీరును మెరుగుపరిచాయని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ ఆడ్రి గోహ్ అభిప్రాయపడ్డారు. దేశంలో వ్యాపార, వాణిజ్యాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి భారత్ అడుగులు వేస్తోందని ఆయన కితాబిచ్చారు.

తాజాగా భారత స్టాక్ మార్కెట్ పెట్టుబడులు విలువ రూ.3 కోట్ల కోట్లు చేరి జీవిత కాల గరిష్ఠాలను నమోదు చేసింది. జీ20 సమావేశాలు జరుగుతున్న వేళ ఈ అంశం మరింత ప్రభావం చూపనుంది. అనేక కంపెనీలు చైనాను విడిచి భారత్‌లో తమ ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నాయి. యాపిల్, శ్యామ్‌సంగ్‌లాంటి కంపెనీలను భారత్ తీసుకువచ్చేందుకు ప్రధాని మోదీ స్వయంగా ప్రోత్సాహకాలు ప్రకటించారు.

విదేశీ పెట్టుబడిదారులు 2023లో ఇప్పటికే 1.13 లక్షల కోట్లతో స్టాక్స్ కొనుగోలు చేశారు. గడచిన మూడేళ్లలో ఇవి అతి పెద్ద మొత్తం కావడం గమనార్హం. చైనాలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడం కూడా భారత్‌కు కలసి వచ్చింది. పెట్టుబడులకు భారత్ అనుకూలంగా ఉందని, రాబోయే పదేళ్లకు అక్కడే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్టు లండన్‌కు చెందిన జెఫరీస్ ఎల్‌ఎల్‌సిలో ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్ హెడ్ క్రిస్ వుడ్ అభిప్రాయపడ్డారు. 2020లో కోవిడ్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ కొంత మందగించినా నేడు, ప్రపంచంలోనే అతిపెద్ద ఐదో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుగా ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదికలో వెల్లడించింది.

అవాంతరాలు కూడా పొంచి ఉన్నాయి

భారత్ పెట్టుబడిదారులకు సానుకూలంగా ఉండటమే కాదు అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. పెరిగిపోయిన ముడి చమురు ధరలు, నిత్యావసర ధరలు ద్రవ్యోల్భణాన్ని పెంచేశాయి. మరోవైపు డాలరుతో రూపాయి విలువ ఎన్నడూ లేని విధంగా పతనమైంది. త్వరలో సాధారణ ఎన్నికలు కూడా ఉండటంతో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగే అవకాశం కనిపిస్తోంది. దేశంలో మౌలిక సదుపాయాలను వేగంగా పెంచడం, విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం, యువ జనాభాకు తగినన్ని ఉద్యోగాలు కల్పించడం దేశం ముందున్న సవాళ్లుగా చెప్పవచ్చు.

చైనాలో కొంత ఆర్థిక అనిశ్చితి ఉన్నా పెట్టుబడిదారులు భారత్‌కు పెద్దగా వెళ్లడం లేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే భారత స్టాక్స్ అధిక ధరలో కొనసాగుతున్నాయని, గడచిన మూడు మాసాల్లో ఎన్‌ఎస్‌ఈ 50 స్టాక్స్ 6 శాతం పెరిగినట్టు వారు గుర్తు చేశారు. చైనా నుంచి అమెరికా కంపెనీలు పెట్టుబడులు ఉపసంహరించుకోవడం వల్ల ఇండోనేషియా, మెక్సికో, పోలండ్ దేశాలు ప్రయోజనం పొందే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా భారత ఆర్థిక వ్యవస్థను విస్మరించడానికి లేదని, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగవచ్చని లండన్‌కు చెందిన ఆర్థిక విశ్లేషకుడు గోర్డాన్ బోవర్స్ అభిప్రాయపడ్డారు.

K Venkateswara Rao | 12:10 PM, Sat Sep 09, 2023

G20 : జీ20లో ఇవాళ కీలక ఒప్పందాలపై సంతకాలు

జీ20 దేశాల సమావేశంలో ఇవాళ కీలక ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి. ఇండియా, సౌదీ అరేబియా, అమెరికాలు ప్రధాన రైల్వే, ఓడరేవు ప్రాజెక్టులను నిర్మించే ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. ఇండియా నుంచి మధ్య ప్రాచ్యం మీదుగా ఐరోపా దేశాలకు వాణిజ్యం, ఇంధనం, డేటా బదిలీకి వీలు కల్పించే కీలక ఒప్పందాలపై
అవగాహనా ఒప్పందం జరగనుందని అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ సలహాదారు ఫైనర్ వెల్లడించారు.

సౌదీ అరేబియా, భారత్, యూఏఈ, యూరోపియన్ యూనియన్ దేశాలు ఈ ప్రాజెక్టులో కీలకంగా పాల్గొంటాయని ఫైనర్ న్యూఢిల్లీలో ప్రకటించారు.ఈ ఒప్పందం ఇజ్రాయెల్‌తో అమెరికా సంబంధాలను మరింత బలపరచడానికి దోహతపడుతుందన్నారు. అనేక నెలలపాటు దౌత్యం ఫలితంగా ఈ ఒప్పందాలు జరగనున్నాయని ఫైనర్ చెప్పారు.

ఈ ప్రాజెక్టుకు అపారమైన వాణిజ్య సామర్థ్యం ఉందని, అయితే ఎంత కాలానికి పూర్తవుతుందనే దానిపై స్పష్టత లేదని ఫైనర్ తెలిపారు. ఉక్రెయిన్‌ రష్యా యుద్ధంపై జీ20 దేశాల అధినేతలు విభేదించారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించే కీలకమైన ఒప్పందాలు జీ20లో జరుగుతాయని ఆశిస్తున్నారు.

K Venkateswara Rao | 10:19 AM, Sat Sep 09, 2023

దివాలా తీసిన నగరం

భారత్ వంటి దేశాలను కొల్లగొట్టి, ఆ సంపదతో ప్రపంచ సంపన్న దేశాల్లో ఒకటిగా నిలిచిన దేశం బ్రిటన్. ఇప్పుడా దేశం ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది. కరోనా, ఆ వెంటనే ఉక్రెయిన్ యుద్ధం... ఇంగ్లండ్ ఆర్థిక వ్యవస్థ వెన్ను విరిచాయి. ఆ నేపథ్యంలో ఆ దేశపు ప్రధాన నగరాల్లో ఒకటి దివాలా తీసింది.

బ్రిటన్‌లోని రెండో అతి పెద్ద నగరం బర్మింగ్‌హామ్, తాజాగా దివాలా తీసినట్టు ప్రకటించింది. బర్మింగ్‌హామ్, యూరోపియన్ యూనియన్‌లోనే అతిపెద్ద స్థానిక స్వపరిపాలనా సంస్థ. దాని ఆదాయం సుమారు 4.3 బిలియన్ డాలర్లు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి తారుమారు అవడంతో పైసా పైసా లెక్కపెట్టి ఖర్చు పెట్టుకోవలసిన పరిస్థితి.

దాదాపు 10 లక్షల మందికి సేవలు అందించే బర్మింగ్‌హామ్‌ సిటీ కౌన్సిల్‌ మంగళవారం సెక్షన్‌ 114 నోటీస్‌ ఫైల్‌ చేసింది. లోకల్‌ గవర్నమెంట్‌ అసోసియేషన్‌ అదనపు సాయం అందించాలని సిటీ కౌన్సిలర్లు జాన్‌ కాటన్‌, షెరెన్‌ థాంప్సన్‌ కోరారు. 2023-24కు దాదాపు 109 మిలియన్‌ డాలర్లు అవసరం ఉంది. తమకు అందాల్సిన 1.25 బిలియన్‌ డాలర్ల నిధులను కన్జర్వేటివ్‌ ప్రభుత్వం లాక్కుందని థాంప్సన్‌ ఆరోపించారు. 

ఐటీ సిస్టమ్‌లో సమస్యలు కూడా బర్మింగ్‌హామ్‌ సిటీ కౌన్సిల్‌ ఆర్థిక దుస్థితిని మరింత ఎగదోశాయి. మే నెలలో ఒరాకిల్‌ ఈపీఆర్‌ సిస్టమ్‌కు 100 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంది. తొలుత అంచనా వేసిన దాని కంటే ఇది దాదాపు నాలుగు రెట్లు అదనం.

పరిస్థితిపై బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ స్పందించింది. అక్కడి ప్రజల విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. తాము కొంతవరకూ సాయం చేస్తామని ప్రధానమంత్రి అధికారిక ప్రతినిధి పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వాలు కూడా పన్ను చెల్లింపుదారుల సొమ్ము నుంచి వచ్చే బడ్జెట్‌ను జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు.

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023

G20 BHARAT APP:జీ-20  యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని మంత్రులకు ప్రధాని పిలుపు

జీ-20 భారత్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని మంత్రులకు ప్రధాని మోదీ సలహా ఇచ్చారు. దిల్లీ వేదికగా జరిగే జీ-20 సదస్సు నిర్వహణ, సమాయత్తతపై మంత్రులకు దిశానిర్దేశం చేసిన ప్రధాని మోదీ.. విదేశీ ప్రతినిధులతో సంభాషణలు సజావుగా సాగేందుకు యాప్ దోహదపడుతుందని వివరించారు.

సదస్సుకు సంబంధించిన సమగ్ర సమాచారంతో పాటు హాజరయ్యే ప్రతినిధుల తాలూకా వివరాలు, సమావేశంలో చర్చించబోయే అంశాలు తదితర విషయాలను యాప్ లో పొందుపరిచారు. ఈ యాప్ ఆవిష్కరణతో భారత్ వర్తమాన సాంకేతికత కిర్తీ ఇనుమడించడంతో పాటు దేశం యెక్క నిబద్ధతను తెలియజేస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ యాప్‌ను 15 వేలమంది డౌన్ లోడ్ చేసుకున్నట్లు కేంద్ర సమాచార, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. జీ-20 సభ్యదేశాలకు సంబంధించిన భాషల్లో ఈ యాప్‌లో సమాచారం అందుబాటులో ఉంటుందని, దీంతో ప్రతిఒక్కరికీ ఎంతో సహాయకారిగా ఉంటుందని వెల్లడించింది.

సదస్సుకు హాజరైన ప్రతినిధులు దేశంలో ఒక చోట నుంచి మరో చోటుకి వెళ్లేందుకు అలాగే జీ-20 సమావేశాలు జరిగే వేదికలు వద్దకు వెళ్లేందుకు సాయ పడుతుంది. 24 భాషాల్లో సమాచారం అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా భాషా పరమైన అడ్డంకులు అధిగమించవచ్చు.

T Ramesh | 14:29 PM, Wed Sep 06, 2023

PM@G20 MEET : డిజిటల్ ఎకానమీపై ప్రధాని ప్రసంగం

PM@G20 MEET : డిజిటల్ ఎకానమీపై ప్రధాని ప్రసంగం

T Ramesh | 13:15 PM, Sat Aug 19, 2023

UGC proposes to make four-year UG courses must for degree with honoursunique421unique421

US-China tensions mount as Nancy Pelosi’s plane heads for Taiwan | Top

Technical | 15:14 PM, Thu Jun 01, 2023

upload
upload