Wednesday, November 29, 2023

Odisha-365
google-add
ప్రియుడి మోజులో పడి చివరకు ...

Crime News : ప్రియుడి మోజులో భర్తను కడతేర్చిన భార్య

Editor | 10:14 AM, Sat Aug 05, 2023

విశాఖలో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులో పడిన శివజ్యోతి, భర్త రమేష్ కుమార్ హత్యకు ప్లాన్ వేసి అమలు చేసింది. ప్రియుడు రామారావు సహకారంతో మరో ఇద్దరికి సుపారీ ఇచ్చి కానిస్టేబుల్‌గా చేస్తోన్న బర్రి రమేష్‌కుమార్‌ను హత్య చేయించింది. విశాఖ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో రమేష్ కుమార్ కానిస్టేబుల్‌గా చేస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీ రాత్రి ఇంటికి వచ్చిన రమేష్ తెల్లారేసరికి గుండెపోటుతో చనిపోయాడంటూ భార్య శివజ్యోతి ఎంవీపీ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ మల్లేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. 

భర్తతో తనకు ఎలాంటి గొడవలు లేవని శివజ్యోతి కొన్ని వీడియోలు సీఐకు చూపడంతో అనుమానం వచ్చి రమేష్ మృతదేహానికి పోస్ట్ మార్టమ్  చేయించారు. ఊపిరాకపోవడం వల్లే రమేష్‌కుమార్ చనిపోయాడని రిపోర్టులో తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శివజ్యోతి ప్రియుడు రామారావు మోజులో పడి సుపారీ ఇచ్చిమరీ హత్య చేయించిందని తెలియడంతో నగర వాసులు ఉలిక్కి పడ్డారు.

google-add
google-add
google-add

ప్రభుత్వ పథకాలు

కుల గణనకు రంగం సిద్దం

K Venkateswara Rao | 10:40 AM, Thu Nov 23, 2023
google-add

యువత

google-add

సంస్కృతి

google-add
google-add
google-add