Wednesday, November 29, 2023

Odisha-365
google-add
వాలంటీర్ అరాచకం వృద్ధురాలి ధారుణ హత్య

Crime News: విశాఖలో వాలంటీర్ అరాచకం.. వృద్ధురాలి దారుణ హత్య

Editor | 10:50 AM, Mon Jul 31, 2023

విశాఖనగరంలో దారుణం చోటు చేసుకుంది. వార్డు వాలంటీర్ వృద్ధురాలి గొంతునులిమి చంపేసిన ఘటన సంచలనంగా మారింది. పెందుర్తి పరిధిలోని సుజాతనగర్ కాలనీలో ఈ ఘాతుకం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కోటగిరి శ్రీనివాస్ సుజాతనగర్ పరిధిలోని పురుషోత్తంపట్నంలో ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఆయన వద్ద అదే ప్రాంతానికి చెందిన రాయవరపు వెంకటేష్ పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి 10 గంటలకు శ్రీనివాస్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లిన వెంకటేష్... ఇంట్లో ఉన్న వృద్ధురాలిని దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. 

రాత్రి గం.12.30 నిమిషాలకు షాపు నుంచి ఇంటికి చేరుకున్న శ్రీనివాస్ తల్లి వరలక్ష్మి చనిపోయి ఉండటం, ఆమె మెడలో బంగారు ఆభరణాలు లేకపోవడం గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పెందుర్తి పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించారు. ఆ వీడియోల్లో వాలంటీర్ వెంకటేష్ వచ్చి వెళ్లినట్టు స్పష్టంగా గుర్తించారు. 

నిందితుడు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు దొంగిలించేందుకు వాలంటీర్ వెంకటేష్ ఆమెను దిండుతో ఊపిరాడకుండా చేసి చంపినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.  మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

google-add
google-add
google-add

ప్రభుత్వ పథకాలు

కుల గణనకు రంగం సిద్దం

K Venkateswara Rao | 10:40 AM, Thu Nov 23, 2023
google-add

యువత

google-add

సంస్కృతి

google-add
google-add
google-add