Wednesday, November 29, 2023

Odisha-365
google-add

NTR COIN : ఈ నెల 28న ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణ

T Ramesh | 18:10 PM, Sat Aug 12, 2023

మాజీ సీఎం NTR బొమ్మతో కూడిన వందరూపాయల నాణేన్ని ఈ నెల 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించబోతున్నారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన గౌరవార్థం కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి తెలిపారు. నాణెం తయారీకి సంబంధించిన ప్రకియపై హైదరాబాద్ లోని  మింట్ కు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసిందని వివరించారు.  ఈ నెల 28న రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు వందమందిని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.

50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింకుతో నాణేన్ని తయారు చేస్తారు. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో కూడిన అశోకచక్రం మరో వైపు ఎన్టీఆర్ బొమ్మ దానికి కింద నందమూరి తారకరామారావు శత జయంతి అని హిందీలో ఉంటుంది.   

google-add
google-add
google-add

ప్రభుత్వ పథకాలు

కుల గణనకు రంగం సిద్దం

K Venkateswara Rao | 10:40 AM, Thu Nov 23, 2023
google-add

యువత

google-add

సంస్కృతి

google-add
google-add
google-add