Wednesday, November 29, 2023

Odisha-365
google-add

TTD EO PC: తిరుమల నడకదారిలో బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటుకు టీటీడీ నిర్ణయం

Editor | 17:03 PM, Sat Aug 12, 2023

తిరుమల నడకదారిలో బాలిక విషాదాంత ఘటనపై అత్యవసర సమావేశం నిర్వహించిన ఈఓ ధర్మారెడ్డి, తర్వాత మీడియాతో మాట్లాడారు. చిన్నారి మీద దాడి ఘటన బాధాకరమన్న ఈఓ, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేస్తామని చెప్పారు.

తిరుమల నడకదారిలో ఫారెస్ట్, పోలీస్, టీటీడీ కలిసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఈఓ ధర్మారెడ్డి చెప్పారు. ప్రతీ 40 అడుగులకూఒక సెక్యూరిటీ గార్డు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. నడక మార్గాన్ని ప్రతీరోజూ సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ మూసివేయాలన్న ప్రతిపాదనపై ఆలోచిస్తున్నామన్నారు. నడక మార్గంలో 500 క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమలకు చిన్నపిల్లలతో వచ్చేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

లక్షిత మృతికి కారణమైన జంతువేంటో పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ తర్వాత తెలుస్తుందని ఈఓ ధర్మారెడ్డి చెప్పారు. ఆ జంతువును బంధించడానికి బేస్‌క్యాంప్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎలుగుబంటి అయితే మత్తు ద్వారా బంధిస్తామనీ, చిరుతపులి అయితే బోనులో బంధిస్తామనీ చెప్పారు. గతంలో ఒక చిరుతను బంధించినప్పుడే మరో చిరుత కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని గుర్తు చేసారు.

తిరుమల నడకదారిలో జంతువుల కదలికలను గుర్తించేందుకు అధునాతన సాంకేతిక వ్యవస్థలను వాడుకుంటామని ఈఓ చెప్పారు. ట్రాప్ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగించి జంతువుల కదలికలను గుర్తిస్తామని వివరించారు. గాలిగోపురం నుంచి నరసింహస్వామి ఆలయం వరకూ హై ఎలర్ట్ జోన్‌గా ప్రకటించారు. ఆ మార్గంలో అదనపు భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

google-add
google-add
google-add

ప్రభుత్వ పథకాలు

కుల గణనకు రంగం సిద్దం

K Venkateswara Rao | 10:40 AM, Thu Nov 23, 2023
google-add

యువత

google-add

సంస్కృతి

google-add
google-add
google-add