Monday, December 11, 2023

Odisha-365
google-add

Leopard trapped: తిరుమల అడవుల్లో చిక్కిన చిరుత

P Phaneendra | 10:06 AM, Mon Aug 14, 2023

తిరుమల కొండల్లోని అడవుల్లో ఓ చిరుతపులి అటవీ శాఖ అధికారులకు చిక్కింది. ఇటీవల ఆరేళ్ళ చిన్నారి బాలిక లక్షితను చంపేసిన పులి ఇదే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పులిని ఏం చేయాలని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

 

గత శుక్రవారం చిరుతపులి దాడిలో ఆరేళ్ళ బాలిక మరణం తర్వాత ఆ ప్రాంతంలో అటవీ శాఖ సిబ్బంది మూడు బోన్లు, క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు అమర్చారు. ఈ క్రమంలో అలిపిరి నడకదారిలో ఏడో మైలురాయి దగ్గర ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుతపులి చిక్కింది. అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

 

శుక్రవారం నాడు ఆరేళ్ళ చిన్నారి బాలిక అలిపిరి నడకమార్గంలో తిరుమలకు వెడుతూ ఉండగా చిరుతపులి దాడిలో హతమయింది. కొన్నాళ్ళ క్రితం కూడా ఒక చిన్నారిపై పులి దాడి చేసిన సందర్భం ఉంది. అప్పుడు అటవీ శాఖ అధికారులు దాన్ని బంధించి, తిరుమల కొండల్లోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

google-add
google-add
google-add

ప్రభుత్వ పథకాలు

కుల గణనకు రంగం సిద్దం

K Venkateswara Rao | 10:40 AM, Thu Nov 23, 2023
google-add

యువత

google-add

సంస్కృతి

google-add
google-add
google-add