Wednesday, November 29, 2023

Odisha-365
google-add

TTD girl death: తిరుమల నడకదారిలో బాలిక దుర్మరణంపై ఈఓ అత్యవసర సమావేశం

Editor | 16:54 PM, Sat Aug 12, 2023

తిరుమల నడకదారిలో శుక్రవారం రాత్రి ఆరేళ్ళ బాలిక లక్షిత దుర్మరణం సంచలనం సృష్టించింది. చిరుతపులి దాడిలోనే బాలిక చనిపోయిందని ప్రచారం జరుగుతున్నా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, అటవీశాఖ అధికారులు ధ్రువీకరించలేదు. బాలిక మృతి ఘటనపై టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఈ ఉదయం అటవీశాఖ, విజిలెన్స్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలేనికి చెందిన దినేష్ కుమార్, శశికళ దంపతుల కుమార్తె లక్షిత శుక్రవారం సాయంత్రం తిరుమల కాలిబాటలో తప్పిపోయింది. కూతురి కోసం ఎంత వెతికినా దొరకలేదు. దాంతో రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసారు. శుక్రవారం రాత్రి 70మంది భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఈరోజు శనివారం ఉదయం నడకదారిలో లక్షిత శవాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోస్ట్‌మార్టమ్‌ కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టమ్ పూర్తిచేసి, కళేబరాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.

సంఘటనా స్థలాన్ని సీసీఎఫ్ నాగేశ్వరావు, డీఎఫ్ఓ సతీష్‌కుమార్ పరిశీలించారు. బాలికను చంపిన జంతువు ఏమిటో పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్ వచ్చాకే తెలుస్తుందని వివరించారు. ఆ జంతువును బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు. బాలిక కుటుంబానికి టీటీడీ, అటవీశాఖ చెరో 5లక్షల పరిహారం ప్రకటించాయి.

google-add
google-add
google-add

ప్రభుత్వ పథకాలు

కుల గణనకు రంగం సిద్దం

K Venkateswara Rao | 10:40 AM, Thu Nov 23, 2023
google-add

యువత

google-add

సంస్కృతి

google-add
google-add
google-add