Wednesday, November 29, 2023

Odisha-365
google-add

చవితి సందర్భంగా వినాయకుడి విగ్రహం పెట్టుకున్న హిందువులపై పోలీసుల దాడి

P Phaneendra | 15:57 PM, Thu Sep 21, 2023

తమిళనాడులోని పెరంబలూర్ జిల్లా వి. కలత్తూర్ గ్రామంలో పోలీసుల అరాచకానికి అంతే లేకుండా పోయింది. వినాయక చవితి పండుగ జరుపుకోవడం కోసం గ్రామంలోని ఆలయంలో వినాయకుడి విగ్రహం పెట్టుకున్న హిందువులపై దాడులకు పాల్పడ్డారు. ఆడవాళ్ళు, బాలికలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎవరినీ వదలకుండా చితగ్గొట్టారు.

వి కలత్తూరు గ్రామస్తులు వినాయక చవితి పర్వదినం జరుపుకోడానికి గణాధిపతి విగ్రహం తెచ్చుకుని స్థానిక ఆలయంలో పెట్టుకున్నారు. అయితే పండుగ ముందురోజు, అంటే సెప్టెంబర్ 17 రాత్రి కొంతమంది పోలీసులు గ్రామంలోకి చొరబడ్డారు. సరైన అనుమతులు తీసుకోలేదంటూ వినాయకుడి మూర్తిని ఆలయం నుంచి తొలగించారు. గ్రామస్తులు ఎంత వేడుకున్నా వినకుండా గణపతిని అక్కడినుంచి తీసేసారు. అక్కడితో ఆగలేదు. ఇంకో అడుగు ముందుకువేసి, గ్రామంలోని స్త్రీ పురుషులను విచక్షణారహితంగా చితక్కొట్టారు. పెద్దవయసు గల మహిళలు, బాలికలు అని కూడా చూడకుండా బాదేసారు. ఆ ఘటన తాలూకు వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన గురించి ప్రధాన స్రవంతి మీడియా పట్టించుకోకపోయినా, సోషల్ మీడియా పట్టించుకుంది. నరత్తర్ అనే యూట్యూబ్ ఛానెల్ అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో నిజాలు తెలుసుకుంది.  

నిజానికి వి కలత్తూర్ గ్రామస్తులు తమ ఊరిలో వినాయక చవితి సందర్భంగా విగ్రహం పెట్టుకోడానికి అనుమతి కోరుతూ జిల్లా అధికారులకు పిటిషన్ పెట్టుకున్నారు. అయితే, గ్రామంలో మతసామరస్యం దెబ్బతింటుందంటూ అధికారులు ఏకపక్షంగా అనుమతి నిరాకరించారు. హిందువులు ఎన్నోసార్లు అధికారులను వేడుకున్నారు. గ్రామంలో మత సామరస్యానికి భంగం వాటిల్లనీయబోమని హామీ ఇచ్చారు. అయినప్పటికీ వారికి అనుమతి ఇవ్వలేదు. దాంతో గ్రామస్తులు వినాయకుడి చిన్న బొమ్మ ఒకటి స్థానిక మందిరంలో పెట్టుకున్నారు. రెండుమూడు రోజుల్లోనే నిమజ్జనం కూడా చేయాలని నిర్ణయించుకున్నారు.

అయితేఅసలుపండుగమొదలవకముందేఘోరంజరిగిపోయింది. 17తేదీఅర్ధరాత్రివేళ, గ్రామస్తులందరూనిద్రపోతున్నసమయంలోకొంతమందిపోలీసులుఊరిలోకిచొరబడ్డారు. కొందరుహిందువులనునిద్రలేపారు. అనుమతులులేకుండావినాయకుణ్ణిఎలాస్థాపిస్తారనిప్రశ్నించారు. తర్వాతగ్రామహిందువులపైతమప్రతాపంచూపించారు.  

వారుముందుగావినాయకుడివిగ్రహాన్నిబలవంతంగాతొలగించారు. దానికిఅడ్డుపడినవారినిదయాదాక్షిణ్యాలులేకుండాచితకబాదారు. పోలీసులుపిల్లలముందేవారితల్లులచీరలులాగేసారు, యువతులతోఅసభ్యకరంగాప్రవర్తించారు. చిన్నారులపైదాడిచేసారు. పురుషులు, పెద్దవారినిఅమానుషంగాకొట్టి, బంధించారు. మహిళలు, యువతులనుకస్టడీలోకితీసుకునిచట్టవిరుద్ధంగా పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు.

 గ్రామస్తులు ఎంత వేడుకున్నా పోలీసుల దాడి ఆగలేదు. వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేసి తొలగించారు. ఆ గ్రామస్తులందరూ హిందూ మున్నని సంస్థ సమర్ధకులు అనే ఉద్దేశంతో వారిని చితకబాదారు. ఒక పూటంతా పోలీస్ స్టేషన్లో ఉంచాక  వారి వివరాలు తీసుకుని ఆ తర్వాత విడిచిపెట్టారు. అది కూడా, గ్రామస్తులు తాము గుడిలో ఎలాంటి పండుగా జరుపుకోము, ఏ పూజలూ చేసుకోమని రాతపూర్వకంగా మాట ఇచ్చిన తర్వాతనే వదిలిపెట్టారు.

 18వ తేదీ, వినాయక చవితి పండుగ నాటి ఉదయం, పోలీసులు గ్రామానికి మళ్ళీ వచ్చారు. పలువురు హిందువులను, మహిళలు, అమ్మాయిలు, ముసలివారిని అరెస్ట్ చేసారు. దాంతో గ్రామంలోని మిగతా హిందువులు, హిందూ మున్నని తదితర హిందూ సంఘాల కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌ ముందు ఆందోళన చేపట్టారు. హిందువులపై దాడులకు పాల్పడి, అమానుషంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. కలత్తూర్ గ్రామ హిందువలకు న్యాయం జరిగేవరకూ తాము అక్కడే ఉంటామని హిందూ మున్నని కార్యకర్తలు హామీ ఇచ్చారు.

 ఈ దుర్మార్గ ఘటన ప్రధానస్రవంతి మీడియా కళ్ళకు కనబడలేదు. స్థానిక యూట్యూబ్ ఛానెల్ ఒకటి ప్రసారం చేసేవరకూ మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ప్రజలు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం మొదలయ్యాక ఇప్పుడిప్పుడే ఈ సంఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. డిఎంకె మంత్రి, సీఎం కొడుకు అయిన ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలకు రూపం ఇస్తే ఇలాగే ఉంటుందని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 వి. కలత్తూరు గ్రామం పెరంబలూరు జిల్లాలో ఉంది. ఇక్కడ ముస్లిములు హిందువులపై చేసే అరాచకాలకు అంతూపొంతూ లేదు. ఇక్కడ గుడులను ఎన్నోసార్లు ధ్వంసం చేసారు. 2021లో మహమ్మద్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తి స్థానిక ఆలయంలోని రథాన్ని ధ్వంసం చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. కలత్తూరు, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని దాదాపు అన్ని గుడులనూ ముస్లిములు ధ్వంసం చేసారు.

google-add
google-add
google-add

ప్రభుత్వ పథకాలు

కుల గణనకు రంగం సిద్దం

K Venkateswara Rao | 10:40 AM, Thu Nov 23, 2023
google-add

యువత

google-add

సంస్కృతి

google-add
google-add
google-add