Monday, December 11, 2023

Odisha-365
google-add

AP CM: సున్నావడ్డీ స్కీమ్ బటన్ నొక్కిన జగన్

Editor | 14:54 PM, Fri Aug 11, 2023

టీడీపీ, జనసేన అధినేతలపై సీఎం జగన్ మరోసారి ఘాటు విమర్శలు చేశారు.  వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమకార్యక్రమాలతో విపక్షాలకు దిక్కుతోచడం లేదన్న ముఖ్యమంత్రి జగన్.. డ్వాక్రా మహిళలను మోసం చేసిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుదే అన్నారు.ఆయన పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకువస్తుందా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పేదలకు ఇళ్ళు ఇస్తుంటే అడ్డుకున్నారని ఆరోపించిన సీఎం జగన్.. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు దత్తపుత్రుడు హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

మహిళా పక్షపాతిగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం జగన్ అన్నారు. అక్కచెల్లెమ్మల సాధికారిత కోసం తమ ప్రభుత్వం సున్నావడ్డీ పథకాన్ని అమలు చేస్తోందని ఉద్ఘాటించారు. కోటి 5 లక్షల మంది మహిళలకు పథకం ద్వారా లబ్ధి జరుగుతోందని వివరించారు. ఇప్పటి వరకు రూ. 4,969.05  కోట్లు సాయం అందించామని పేర్కొన్నారు. వడ్డీ రీయింబర్స్‌మెంట్ కోసం 1,353కోట్లు చెల్లించినట్లు చెప్పారు.

వైఎస్సార్ సున్నావడ్డీ నిధులను లబ్ధిదారులకు అమలాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ జమ చేశారు. 2014-19 మధ్య కాలంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు వాగ్ధానం చేసి మరిచారని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో 14వేల కోట్ల బకాయిలు పెండింగులో ఉన్నాయని వివరించారు. చంద్రబాబు సీఎం అయితే పేదలకు మంచి జరగదన్న సీఎం జగన్.. శవ రాజకీయాలకు సైతం టీడీపీ అధినేత వెనకాడటం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

google-add
google-add
google-add
google-add

సంస్కృతి

google-add
google-add