Monday, December 11, 2023

Odisha-365
google-add
నిరుద్యోగులకు గుడ్ న్యూస్

AP Govt Jobs : యూనివర్శిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3 వేల పోస్టుల భర్తీ

Editor | 17:30 PM, Thu Aug 03, 2023

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్‌ ఐటీల్లో  ఖాళీగా ఉన్న 3295  అధ్యాపకుల భర్తీకి సీఎం  జగన్ మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ  నవంబరు 15 నాటికి పూర్తిచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా పోస్టులు భర్తీ  చేయనున్నారు. ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. 

విశ్వవిద్యాలయాల్లో  2635 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లతో పాటు, ట్రిపుల్‌ ఐటీల్లో 660 పోస్టులు  భర్తీ  చేయనున్నారు.యూనివర్సిటీల్లో  ఉత్తమ ఫలితాలు సాధించాలంటే... పూర్తి స్ధాయిలో రెగ్యులర్‌ పోస్టుల భర్తీ చేయాల్సిందేనని  సీఎం స్పష్టం చేశారు. నిర్దేశించిన ప్రమాణాలతో అభ్యర్ధులు ఖచ్చితంగా క్వాలిఫై కావాలని, నూటికి నూరుశాతం మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కాంట్రాక్ట్‌ విధానంలో పనిచేస్తున్న వారికి సంవత్సరానికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు వెయిటేజ్‌ ఇవ్వాలని  నిర్ణయించారు.

సెప్టెంబరు 3,4 వారాల్లో ఈ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.  అక్టోబరు 10వ తేదీ నాటికి పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నారు. రాత పరీక్షల ఫలితాల విడుదల అనంతరం నెల రోజుల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి, నవంబరు 15 నాటికి  నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 

google-add
google-add
google-add

ప్రభుత్వ పథకాలు

కుల గణనకు రంగం సిద్దం

K Venkateswara Rao | 10:40 AM, Thu Nov 23, 2023
google-add

యువత

google-add

సంస్కృతి

google-add
google-add
google-add