Thursday, November 30, 2023

Odisha-365
google-add

దేశవ్యాప్తంగా కార్తిక శోభ, మహాదేవుడి స్మరణతో మార్మోగిన వేదభూమి

T Ramesh | 11:21 AM, Mon Nov 20, 2023

హర హర మహాదేవ నామస్మరణతో వేదభూమి పులకిస్తోంది. శివకేశవులకు ప్రీతికరమైన కార్తికమాసం కావడంతో  భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేడు మొదటి కార్తిక సోమవారం కావడంతో పుణ్యస్నానాల కోసం భక్తులు నదీ, సముద్రతీర ప్రాంతాలకు పోటెత్తారు.

స్నానాల  అనంతరం దీపాలు వెలిగించి గంగమ్మకు పూజలు చేశారు.  ఉత్తరభారతంలో ఛట్ పూజ వైభవంగా చేశారు. సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించారు. పట్నాలో నిర్వహించిన ఛట్ పూజలో జర్మనీకి చెందిన దంపతులు పాల్గొన్నారు. సనాతన ధర్మం అద్భుతమని వ్యాఖ్యానించారు.  జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.  దీపాలు వెలగించి శివకేశవులను స్మరిస్తున్నారు.  

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. పంచారామాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.  శ్రీశైలం, వేములవాడలు శివభక్తులతో నిండిపోయాయి. హర హర శంకర శంభో శంకర అంటూ అశుతోషుడిని కీర్తించారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add

రాజకీయం