Thursday, November 30, 2023

Odisha-365
google-add

బీజేపీకి అధికారమిస్తే అక్రమార్కులు జైలుకే: అమిత్ షా

T Ramesh | 15:52 PM, Mon Nov 20, 2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్న అమిత్ షా, జనగామలో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. అవినీతి రహిత పాలన కోసం బీజేపీని గెలిపించాలని కోరారు.

  సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి కారణంగానే రజాకార్ల నుంచి హైదరాబాద్ రాష్ట్రం విముక్తి పొందిందన్నారు. బీజేపీకి తెలంగాణలో అధికారమిస్తే బీసీని ముఖ్యమంత్రి చేయడంతో పాటు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎమ్ఐఎమ్ కుటుంబ పార్టీలని విమర్శించిన అమిత్ షా, కేసీఆర్ పాలనపై విచారణ జరిపి అక్రమాలపై చర్యలు తీసుకుంటామన్నారు.  బైరాన్ పల్లిలో అమరవీరుల స్తూపం నిర్మిస్తామని వాగ్దానం చేశారు.

 ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధంగా కేసీఆర్ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న అమిత్ షా, వరికి రూ. 3100 మద్దతు ధర కల్పిస్తామన్నారు. ఫసల్ బీమాను ఉచితంగా అమలు చేస్తామని సభలో హామీ ఇచ్చారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add

రాజకీయం