Monday, December 11, 2023

Odisha-365
google-add

వరల్డ్‌కప్ ఫైనల్ పోరు: విరాట్, రాహుల్ హాఫ్ సెంచరీలు, ఆస్ట్రేలియా టార్గెట్ 241

T Ramesh | 18:02 PM, Sun Nov 19, 2023

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50ఓవర్లలో 240 పరుగులు చేసింది. రోహిత్ సేన  ప్రత్యర్థి ఆస్ట్రేలియా ముందు 241 లక్ష్యాన్ని ఉంచింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ శ్రమతోనే ఈ స్కోర్ సాధ్యమైంది.   

కేఎల్ రాహుల్ అర్ద సెంచరీ పూర్తి చేశాడు. 35.5 బంతిని ఆడి 50 పరుగులకు చేరుకున్నాడు. 86 బంతులు ఆడి అర్ధ సెంచరీ చేశాడు. 35 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు. 36వ ఓవరు ఐదో బంతికి జడేజా ఔట్ కావడంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. హాజల్ వుడ్ బౌలింగ్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 22 బంతులు ఆడి 9 పరుగులు చేశాడు. 37వ ఓవర్ లో కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించగల్గారు. 40 ఓవర్లకు స్కోరు 197/5.

41 వ ఓవర్ లో రోహిత్ సేన 200 స్కోర్ మార్క్ ను దాటింది. స్టార్క్ వేసిన 42వ ఓవర్ మూడో బంతికి కేఎల్ రాహుల్ 66 పరుగుల వద్ద క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో మహమద్ షమీ క్రీజులోకి వచ్చాడు. కానీ 6 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. దీంతో 211 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ నష్టపోయింది.

45.5 బంతికి జస్పిత్ బుమ్రా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.214 వద్ద ఎనిమిదో వికెట్ డౌన్  47 వ ఓవర్ లో కేవలం రెండు పరుగులే వచ్చాయి. 48 ఓవర్ మూడో బంతికి సూర్యకుమార్ యాదవ్ కూడా పెవిలియన్ క్యూ కట్టాడు. 28 బంతులు ఆడి 18 పరుగులకే క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు.

స్టార్క్ 3 వికెట్లు తీయగా, హాజల్ వుడ్ 2, కమిన్స్ 2, జంపా 1, మ్యాక్సీవెల్ 1 వికెట్లు పడగొట్టారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

బిట్ కాయిన్ దూకుడు

K Venkateswara Rao | 12:23 PM, Thu Dec 07, 2023

మరో కీలక ఉగ్రవాది హతం

K Venkateswara Rao | 10:28 AM, Thu Dec 07, 2023

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add