Thursday, November 30, 2023

Odisha-365
google-add
పెళ్లి వదంతులు ఖండించిన తరుణ్

SOCIAL MEDIA NEWS : పెళ్లి పై హీరో తరుణ్ క్లారిటీ..

Editor | 14:31 PM, Wed Aug 02, 2023

పెళ్లి వార్తల పుకార్ల పై హీరో తరుణ్ స్పందించారు. తన పెళ్లి జరిగిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిచారు. వదంతులు ఎలా పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదన్న తరుణ్, తాను ఇంకా మ్యారేజ్ చేసుకోలేదని క్లారిటీ ఇచ్చారు.  పెళ్లి ఫిక్స్ అయితే ఆ శుభవార్తను తానే అందరితో పంచుకుంటానని తెలిపారు.

బాలనటుడిగా సినిమాల్లోకి అరంగేట్రం చేసిన తరుణ్, నువ్వే కావాలి సినిమాతో హీరో గా మారారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస లవ్ స్టోరీ మూవీల్లో నటించి మెప్పించారు. 2018లో విడుదలైన ‘‘ఇది నా లవ్ స్టోరీ’’ సినిమా ఆయనకు చివరిది. 2018లో రిలీజైన ఈ సినిమా తర్వాత ఆయన మళ్లీ నటించలేదు.

తరుణ్ తల్లి రోజారమణి ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేసింది. తన కుమారుడికి త్వరలో పెళ్లి చేస్తానని, అమ్మాయిది టాలీవుడ్ కు చెందిన బడా ఫ్యామిలీ అంటూ చెప్పింది. దీంతో ఎవరికి వారు ఊహాగానాలు చేసుకున్నారు. ఫలానా ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అంటూ తప్పుడు వార్తలు వైరల్ చేశారు. ఆఖరకు మెగా ఫ్యామిలీకి అల్లుడు కాబోతున్నాడనే వార్త కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.  

సోషల్ మీడియా  వార్తలపై స్పందించిన తరుణ్, పెళ్లి పై వస్తున్న వార్తలను ఖండించారు. తాను పెళ్లి చేసుకోలేదని తేల్చిచెప్పారు. అలాగే వదంతుల వ్యాప్తి, సృష్టిపై అసహనం వ్యక్తం చేశారు. 

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023