Monday, December 11, 2023

Odisha-365
google-add
ఫేమస్ యూట్యూబర్ పై క్రిమినల్ కేసు..?

KAI CENAT: గిఫ్ట్స్ కోసం అభిమానుల అల్లరి...కేసు నమోదు

Editor | 12:21 PM, Sat Aug 05, 2023

అభిమానుల అత్సుత్సాహం ఓ యూట్యూబర్ ను చిక్కుల్లో పడేసింది. ఆఖరికి క్రిమినల్ కేసును ఎదుర్కొవాల్సిన పరిస్థితి తలెత్తింది.ONLINE INFLUENCER, యూట్యూబర్  KAI CENAT పిలుపు మేరకు అతని అభిమానులు లైవ్ స్ట్రీమింగ్ ప్రాంతానికి పోటెత్తారు. దీంతో పోలీసులు కై సీనట్ అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

న్యూయార్క్ కు చెందిన 21 ఏళ్ల ఆన్‌లైన్ ఇన్‌ఫ్లుయెన్సర్ కై సీనట్, మన్ హటన్ యూనియన్ స్క్వేర్ పార్క్ లో లైవ్ స్ట్రీమింగ్ ఈవెంట్ చేస్తునట్లు ఇన్‌స్టాలో మెసేజ్ షేర్ చేశారు. ఈ లైవ్ లో ఫ్యాన్స్ తో నేరుగా మాట్లాడతానని అంతేకాకుండా వారికి ప్లే స్టేషన్ 5 గేమ్ కన్సోల్స్ సహా పలు గిఫ్ట్స్ ఇస్తానని ప్రకటించారు.

సైనట్ పోస్టు క్షణాల్లో వైరల్ కావడంతో పాటు మన్‌హటన్ పార్క్ కు ఫ్యాన్స్ పోటెత్తారు. సుమారు 2 వేల మంది అక్కడికి చేరుకున్నారు. దీంతో వీధులు కిటకిటలాడాయి. వీరిని అదుపుచేసేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.    

సీనట్ అభిమానుల్లో కొంతమంది వాహనాలను అడ్డగించి అల్లర్లకు పాల్పడ్డారు. బాటిళ్లు విసరడం, తోపులాట, కార్ల ధ్వంసం వంటి చర్యలకు పాల్పడ్డారు. మరికొందరు అక్కడున్న నిర్మాణాలపైకి ఎక్కి కేకలు వేశారు. అల్లర్ల కారణంగా కొందరు పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు.

అత్సుత్సాహంతో అల్లరి చేష్టలకు దిగిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సీనట్ ను కూడా అక్కడి నుంచి తరలించారు. అల్లర్లకు ప్రేరేపించినందుకు గాను అతడిపై క్రిమినల్ కేసులు నమోదుకు సిద్ధమయ్యారు.

 సీనట్ ఓ పాపులర్ వీడియో క్రియేటర్, ట్విచ్ అనే లైవ్ స్ట్రీమింగ్, ప్లాట్‌ఫామ్ లో అతడికి 65 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్, ట్విట్టర్ సహా పలు సోషల్ మీడియా అకౌంట్లను లక్షల మంది ఫాలో అవుతున్నారు. గతేడాది స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. 

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

బిట్ కాయిన్ దూకుడు

K Venkateswara Rao | 12:23 PM, Thu Dec 07, 2023

మరో కీలక ఉగ్రవాది హతం

K Venkateswara Rao | 10:28 AM, Thu Dec 07, 2023

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023