Monday, December 11, 2023

Odisha-365
google-add
గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టిన  సింహపురి చిన్నోడు

WORLD RECORD: నెల్లూరు కుర్రాడా మజాకా… గిన్నిస్ రికార్డు బ్రేక్

Editor | 11:46 AM, Tue Aug 08, 2023

ఒక్కొక్కరికీ ఒక్కో ప్రతిభ ఉంటుంది. సోషల్ మీడియా పుణ్యమా అంటూ అందరూ తమ ప్రతిభను ప్రదర్శిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కొందరు మాత్రం అత్యంత అసమాన ప్రతిభా పాటవాలు చూపుతూ ప్రపంచ వ్యాప్తంగా అధికారికంగా గుర్తింపు సాధిస్తున్నారు. తమకు ఇష్టమైన వ్యాపకం, కళలను విభిన్నంగా వైవిధ్యంగా వేగంగా ప్రదర్శిస్తూ గిన్నిస్ బుక్ నుంచి గుర్తింపు సాధిస్తున్నారు. లలిత కళలు, యుద్ధకళలు, ఆహారం తీసుకునే విధానం, సాహసాలు వంటి వగైరా చేష్టలతో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంటున్నారు.  

ఈ కోవకే చెందిన ఓ వ్యక్తి తలతో అత్యంత వేగంగా వాల్‌నట్స్ పగలగొట్టి రికార్డు సృష్టించాడు. ఏకంగా గిన్నిస్ బుక్‌లోనే స్థానం సంపాదించాడు ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు చెందిన ఎస్ నవీన్ కుమార్. ఒక్క నిమిషం వ్యవధిలో 273 వాల్‌నట్స్‌ను తలతో అత్యంత సునాయాసంగా వేగంగా పగలగొట్టాడు. 2023 ఏప్రిల్ 30న ఈ ఘనత సాధించాడు. 

నవీన్ కుమార్ గతంలోనూ మార్షల్ ఆర్ట్స్ లో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. నెల్లూరులో మార్షల్ ఆర్ట్స్ కోచ్‌గా పనిచేస్తూ తన అభిరుచి మేరకు చిత్ర విచిత్రమైన  విన్యాసాలు చేస్తున్నాడు. ఆ క్రమంలోనే ఈ రికార్డు బద్దలుకొట్టాడు. గతంలో అతితక్కువ సమయంలో ఎక్కువ వాల్‌నట్స్ పగలగొట్టిన రికార్డు పాకిస్తాన్‌కు చెందిన మహమ్మద్ రషీద్ పేరిట ఉండేది. రషీద్ 2014లో ఒక నిమిషంలో 150 వాల్‌నట్స్ పగలగొట్టి రికార్డు సృష్టించాడు. ఇప్పుడా రికార్డును నవీన్ అధిగమించాడు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

బిట్ కాయిన్ దూకుడు

K Venkateswara Rao | 12:23 PM, Thu Dec 07, 2023

మరో కీలక ఉగ్రవాది హతం

K Venkateswara Rao | 10:28 AM, Thu Dec 07, 2023

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add