Monday, December 11, 2023

Odisha-365
google-add
వారంలో మూడో ఉరి శిక్ష అమలు

Singapore : సింగపూర్‌లో వారంలో మూడో ఉరి శిక్ష అమలు

Editor | 13:13 PM, Thu Aug 03, 2023

మత్తుపదార్థాల రవాణా, వినియోగం అరికట్టేందుకు సింగపూర్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ వారంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఇద్దరికి ఉరి అమలు చేసిన సింగపూర్ ఇవాళ మరొకరికి ఉరిశిక్ష అమలు చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటికే సింగపూర్ ఐదుగురికి ఉరిశిక్ష అమలు చేసింది. నాలుగేళ్ల కిందట మహ్మద్ లతీఫ్ 55 గ్రాముల హెరాయిన్‌తో నార్కొటిక్స్ అధికారులకు దొరికిపోయాడు.  లతీఫ్ డెలివరీ ఏజంటుగా చేస్తూ, హెరాయిన్ కూడా సరఫరా చేస్తున్నట్టు కేసు రుజవు కావడంతో ఇవాళ అతనికి ఉరి శిక్ష వేసినట్టు సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో తెలిపింది.

కోవిడ్ నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం ఉరి శిక్షల అమలును రెండేళ్లకుపైగా నిలిపేసింది. తాజాగా గత మార్చి  నుంచి మరలా ఉరి శిక్షలు అమలు చేయడం మొదలు పెట్టింది. గత వారం మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఓ మహిళకు ఉరి శిక్ష అమలు చేశారు. రెండు దశాబ్దాల తరవాత ఓ మహిళకు ఉరి అమలు చేయడం ఇదే తొలిసారి. మానవ హక్కుల సంఘాలు ఉరి శిక్షల అమలుపై తీవ్ర నిరసనలు చేస్తున్నా సింగపూర్ వెనక్కు తగ్గడం లేదు.

 50 గ్రాముల హెరాయిన్ కలిగి ఉన్నాడనే ఆరోపణలు రుజువు కావడంతో  మహ్మద్ అజిజ్ బిన్ హుస్సేన్ అనే వ్యక్తికి రెండు రోజుల కిందటే ఉరి శిక్ష వేశారు. ఈ వరుస ఉరి శిక్షల అమలుపై ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అనేక దేశాలు ఉరి శిక్ష అమలును నిలిపేస్తున్న తరుణంలో సింగపూర్ ప్రభుత్వం ఉరిశిక్షలు అమలు చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అదుపు చేయాలంటే ఇదే సరైన మార్గమని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. 

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

బిట్ కాయిన్ దూకుడు

K Venkateswara Rao | 12:23 PM, Thu Dec 07, 2023

మరో కీలక ఉగ్రవాది హతం

K Venkateswara Rao | 10:28 AM, Thu Dec 07, 2023

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add

వీడియోలు