Thursday, November 30, 2023

Odisha-365
google-add
మణిపూర్ ఘటనపై విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు

Manipur Issue : మణిపూర్ అల్లర్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు

Editor | 16:13 PM, Mon Jul 31, 2023

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై  సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. మహిళలను నగ్నంగా పరుగెత్తించిన ఘటనకు సంబంధించిన వీడియోలు వెలుగుచూసే వరకు ప్రభుత్వం ఏం చేస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్ ప్రశ్నించారు. దేశంలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయని, మే 3న అల్లర్లు మొదలయ్యాక  ఎన్ని కేసులు నమోదు చేశారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వ  అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణిని ప్రశ్నించారు. 

బాధిత మహిళల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు పట్ల బాధిత మహిళలకు నమ్మకం కలిగేలా చూడాలని, ఈ కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా కేంద్రం తెలిపిందని కపిల్ సిబల్ కోర్టుకు చెప్పారు. మణిపూర్‌‌లో ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగాయనే దానిపై  ప్రభుత్వం వద్ద కూడా సరైన గణాంకాలు లేవని ఆయన వాదనలు వినిపించారు. 

పోలీసులు కూడా నిందితులతో చేతులు కలిపారని, వారి నుంచి బాధిత మహిళలకు రక్షణ కల్పించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. మే 4న ఘటన చోటు చేసుకోగా, మే 18న జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని జూన్‌లో సంబంధిత స్టేషన్‌కు కేసు బదిలీ చేశారని సిబల్ గుర్తుచేశారు.  జూన్ 19న వీడియో బయటకు వచ్చిన తరవాత, దానిపై సుప్రీంకోర్టు సీరియస్ అయిన తరవాత మాత్రమే కేసులో పురోగతి కనిపించిందని సిబల్  కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసు విచారణ ఇతర రాష్ట్రాల్లో చేపట్టాలని ఇప్పటికే కేంద్రం కోరిందని, సీబీఐ విచారణకు తాము వ్యతిరేకమన్నారు. ఈ కేసు విచారణను అస్సాంకు బదిలీ చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని బాధితులు కూడా వ్యతిరేకిస్తున్నట్టు సిబల్ కోర్టు దృష్టికి తెచ్చారు. 

ఈ కేసు విచారణను అస్సాంకు బదిలీ చేయాలని కేంద్రం ఎప్పుడూ కోరలేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు. ఈ కేసు విచారణను ఎక్కడకు బదిలీ చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. బాధితులు చాలా భయాందోళనలో ఉన్నారు. ఒకవేళ సీబీఐ విచారణ వేసినా, వారి ముందు బాధితులు ధైర్యంగా చెబుతారనే నమ్మకం తమకు లేదని సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ అన్నారు. పౌరసమాజంలోని మహిళా సభ్యులతో రాజ్యాంగబద్ద హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తే బాధితులు నిర్భయంగా వారికి జరిగిన అన్యాయాన్ని చెప్పుకునే  అవకాశం ఉందని ఇందిరా జైసింగ్ సీజే దృష్టికి తీసుకెళ్లారు.

మణిపూర్ బాధిత మహిళలు వారి పేర్లు బయటకు రాకుండా చూడాలని కోర్టును వేడుకున్న సంగతి తెలిసిందే.  కోర్టు డాక్యుమెంట్లలో కూడా వారి పేర్ల బదులు ఎక్స్, వై అని నమోదు చేశారు. ఈ కేసును ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయాలని బాధితులు కోరారు. రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదని, తమకు పోలీసుల నుంచి భద్రత కల్పించాలని కోరారు.  సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద తమ స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు సమీపంలోని మెజిస్ట్రేట్‌ను ఆదేశించాలని వారు కోరారు. ఈ కేసును ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే.  


google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023