Thursday, November 30, 2023

Odisha-365
google-add
నుహ్ నిందితుల ఇళ్లపైకి బుల్డోజర్లు

HARYANA RIOTS: నుహ్ అల్లర్లలో నిందితుల ఇళ్లు కూల్చివేత

Editor | 11:57 AM, Fri Aug 04, 2023

హర్యానా నుహ్ జిల్లాలో అల్లర్లకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. జిల్లాలో అక్రమంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం బుల్డోజర్లతో సమాధానం ఇచ్చింది. నుహ్ జిల్లా తావుడాలో అక్రమంగా వేసిన 250 గుడిసెలను బుల్డోజర్లతో తొలగించారు. వీరంతా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చి ప్రభుత్వ స్థలాలను కబ్జాచేసి గుడిసెలు వేసుకున్నారని హర్యానా పట్టణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. గుడిసెల తొలగించే సమయంలో అల్లర్లు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. 

నుహ్ అల్లర్లలో  తావుడా  గ్రామంలోని గుడిసె వాసులు రాళ్లదాడులతోపాటు, దుకాణాల లూటీలోనూ పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు సేకరించారు. దాడుల ఫోటోలు, వీడియోలను పోలీసులు మీడియాకు విడుదల చేసారు. నల్హార్ గ్రామంలో కూడా పోలీసులు ఇలాంటి చర్యలు చేపట్టారు. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారిపై 45 కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అల్లరి మూకలు ఆరావళీ పర్వతాల్లోని చిన్న చిన్న గ్రామాల్లో తలదాచుకున్నట్టు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే రాతలను పోస్ట్ చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేశారు. నుహ్‌లో చెలరేగిన అల్లర్లు పొరుగు జిల్లాలకు కూడా వ్యాపించిన సంగతి తెలిసిందే. ముందు జాగ్రత్తగా గురుగ్రామ్‌లో శుక్రవారంనాడు మసీదుల్లో ప్రార్థనలకు అనుమతించడం లేదని పోలీసులు ప్రకటించారు.

 విశ్వహిందూ పరిషత్ ఆధ్యాత్మిక యాత్ర చేపట్టిన సమయంలో నుహ్ జిల్లా ఎస్పీ వరుణ్ సింగ్లా సెలవులో ఉండటాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఎస్పీపై బదిలీ వేటు వేసింది. కొత్తగా నరేంద్ర బిజ్రానియాను నియమించింది.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023