Thursday, November 30, 2023

Odisha-365
google-add
అల్లుడి చంపి ఆపై...

Crime News : అల్లుడిని దారుణంగా చంపి సెప్టిక్ ట్యాంకులో పూడ్చేశారు

Editor | 10:07 AM, Wed Aug 09, 2023

తెలంగాణలోని జనగామ జిల్లాలో సొంత అల్లుడినే చంపి సెప్టిక్ ట్యాంకులో పూడ్చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థుల కథనం ప్రకారం జనగామ జిల్లా దేవరుప్పల మండలం కామారెడ్డి గూడేనికి చెందిన నాగరాజు మద్యం తాగి ఇల్లాలు లక్ష్మిని తరచూ వేధిస్తున్నారు. సోమవారం రాత్రి కూడా నాగరాజు మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య లక్ష్మితో గొడవపడ్డాడు. భార్య అన్నం పెట్టే ప్రయత్నం చేయగా రక్తం కారేలా ఆమె వేలు కొరికాడు. అడ్డుకున్న మామను ఆయన మెడలోని కండువాతో బిగించాడు. మామ అబ్బసాయిలు కూడా అల్లుడి మెడలోని కండువాతో గట్టిగా బిగించడంతో నాగరాజు చనిపోయాడని పోలీసుల కథనం ద్వారా తెలుస్తోంది. నాగరాజు చనిపోవడంతో ఏం చేయాలో తెలియక సెప్టిక్ ట్యాంకులో తలకిందులుగా పడేసి మట్టిపోశారు. మంగళవారం  ఎవరి పనులకు వారు వెళ్లిపోయారు.

మంగళవారం ఉదయం జనగామలో ఉంటోన్న నాగరాజు పెద్దకుమారుడు కిరణ్ వచ్చి ఇంట్లో  పడి ఉన్న నాగరాజు దుస్తులపై ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నాగరాజు మామ అబ్బసాయిలు గ్రామ సర్పంచ్‌కు విషయం తెలియజేశారు. సర్పంచ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. 

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023