Thursday, November 30, 2023

Odisha-365
google-add

Onion Price : ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు

Editor | 16:59 PM, Fri Aug 11, 2023

టొమాటో ధరలు దిగివస్తుండగా ఉల్లి ధరలు పరుగులు పెడుతున్నాయి. గడచిన వారంలోనే కిలోకు రూ.12 పెరిగి కేజీ రూ.32కు చేరాయి. దేశంలో సగటున ఉల్లి ధర రూ.25 ఉంది. రాబోయే రెండు నెలలు కొత్త పంట వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో ఉల్లి ధరలు సెప్టెంబరు నాటికి కేజీ రూ.60 దాటే అవకాశం ఉందంటూ క్రిసిల్ సంస్థ నివేదికలో ప్రకటించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

2022-23లో కేంద్రం ఉల్లి ధరలు పెరిగినప్పుడు విడుదల చేసేందుకు 3 లక్షల క్వింటాళ్లను బఫర్ స్టాక్ ఉంచింది. 2020-21లో ఉల్లి బఫర్ స్టాక్ లక్ష టన్నులు కాగా మూడేళ్లలో క్రమంగా 3 లక్షల టన్నులకు పెంచారు. మార్కెట్లో ఉల్లి ధరలు అనూహ్యంగా పెరిగినప్పుడు అదుపు చేసేందుకు కేంద్రం ఈ బఫర్ స్టాక్స్ ఉపయోగించుకుంటుంది. త్వరలో కేంద్ర ఏజన్సీలు నాఫెడ్, ఎన్‌సీసీ‌ఎఫ్ సంస్థలు ఉల్లి స్టాక్స్ విడుదల విధానాలను విడుదల చేస్తాయని కేంద్ర ఆహార, పౌరసరఫరాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఢిల్లీలో వెల్లడించారు.

దేశంలో సగటు రేటు కన్నా ఎక్కువ ధరకు ఉల్లి విక్రయించే ప్రాంతాల్లో బఫర్ స్టాక్స్ విడుదల చేయనున్నారు. వినియోగదారులకు ఉల్లి ధరలు అందుబాటులో లేని ప్రాంతాల్లో కేంద్రం బఫర్ స్టాకులను ఇ వేలం ద్వారా విడుదల చేయనుంది. రబీ పంట ఏప్రిల్ నుంచి జూన్ వరకు మార్కెట్‌కు వచ్చింది. మొత్తం ఉల్లి అవసరాల్లో రబీ పంట ద్వారానే 65 శాతం లభిస్తోంది. ఇక ఖరీఫ్ అక్టోబరులో మార్కెట్లకు వచ్చే అవకాశం ఉంది. అంటే మరో రెండు నెలల పాటు మార్కెట్లో ఉల్లి ధరలు విపరీతంగా పెరగకుండా కేంద్ర బఫర్ స్టాకులను విడుదల చేయడానికి సిద్దమైంది.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023