Thursday, November 30, 2023

Odisha-365
google-add

C-295: వాయుసేనలో చేరిన అత్యాధునిక రవాణా విమానం

T Ramesh | 17:12 PM, Mon Sep 25, 2023

భారత వాయుసేనలోకి మరో అత్యుధునిక రవాణా విమానం చేరింది. ఎలాంటి ఉపరితలంపైన అయినా  టేకాఫ్, ల్యాండింగ్ చేయగల సత్తా ఉన్న సరికొత్త రవాణా విమానం C-295ను రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాయుసేనకు అప్పగించారు. 9 టన్నుల బరువును రవాణా చేయగల ఈ విమానం, 260 నాటికల్ మైల్స్ వేగంతో ప్రయాణం చేస్తుంది.

సైనిక దళాల చేరవేతకు ఉపయోగపడేలా దీనిని రూపొందించారు. ప్రస్తుతం వాయుసేనలో ఉన్న హెచ్ఎస్-748 ఆవ్రో ఎయిర్ క్రాఫ్ట్ స్థానాన్ని ఇది భర్తీ చేయనుంది. ఈ విమానాలను మొత్తం 56 కొనుగోలు చేసేందుకు ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థతో భారత్ రూ. 21,935 కోట్ల విలువైన ఒప్పందాన్ని చేసుకుంది.

ఈ ఒప్పందం ప్రకారం 2025 నాటికి 16 విమానాలను ఎయిర్ బస్ సరఫరా చేస్తుంది. పారా ట్రూప్స్ ను చేరవేయడంతో పాటు ఇతర బరువులు, సాధారణ రాకపోకలకు , అత్యవసర వైద్య సేవలకు... ఇలా పలురకాలుగా ఈ విమానం ఉపయోగ పడుతుంది.

విపత్తుల సమయంలోనూ సాయం అందించేందుకు, సాగరగస్తీకి కూడా దీనిని ఉపయోగించవచ్చు. సాధారణ విమానాలు దిగలేని ప్రదేశాల్లో సైతం ఇది తేలికగా ల్యాండ్ అవుతుంది.   గజియాబాద్  పర్యటనలో భాగంగా భారత్ డ్రోన్ శక్తి-2023 ఎగ్జిబిషన్ ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. భారత వాయుసేన, డ్రోన్ ఫెడరేషన్ సంస్థ సంయుక్తంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశాయి.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023