Monday, December 11, 2023

Odisha-365
google-add
68వ అంతస్తు నుంచి జారి పడి సాహసికుడి మృతి

Accident : 68వ అంతస్తు నుంచి జారిపడి సాహసికుడి మృతి

Editor | 12:14 PM, Mon Jul 31, 2023

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనాల బయటవైపు నుంచి పాకుకుంటూ ఎక్కుతూ కొందరు సాహసికులు రికార్డులు నెలకొల్పుతూ ఉంటారు. ఎత్తైన భవనాలను ఎక్కడంలో సాహసికుడు రెమి లుసిడికి మంచి అనుభవమే ఉంది. అయితే హాంకాంగ్‌లోని ది ట్రెగెంటర్ టవర్ కాంప్లెక్స్ ఎక్కే ప్రయత్నంలో 68వ అంతస్తు నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. కిందపడే ముందు 68వ అంతస్తులోని కిటికీలో ఇరుక్కుపోయాడు. బయటపడేందుకు దాన్ని కాలితో తన్నడంతో అక్కడ నుంచి జారిపడి చనిపోయి ఉండవచ్చని హాంకాంగ్ పోలీసులు అనుమానిస్తున్నారు. 

హాంకాంగ్ పోలీసుల కథనం ప్రకారం లుసిడి ఉదయం 6 గంటలకు భవనం సెక్యూరిటీ వద్దకు వచ్చి 40వ అంతస్తులో తన మిత్రుడు ఉన్నాడని చెప్పి లోపలికి వెళ్లాడు. అయితే 40 అంతస్తులో నివశించేవారు ఎవరూ కూడా లుసిడి ఎవరో తనకు తెలియదని చెప్పినట్టు పోలీసులు తెలిపారు.  49వ అంతస్తు  మెట్ల మార్గంలో వెళ్లినట్టు కొందరు గుర్తించారు. ఆ తరవాత 7.38 గంటల సమయంలో పెంట్‌హౌస్‌లో చనిపోయి ఉండటాన్ని పనిమనిషి గమనించి సెక్యూరిటీ సిబ్బందిని అలెర్ట్ చేసిందని పోలీసులు తెలిపారు. అతను భవనం ఎక్కే సమయంలో కిటికీలో ఇరుక్కుపోయి ఉంటాడని, బయడపడేందుకు దాన్ని తన్నడంతో జారి కిందపడి ఉండవచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనా స్థలం నుంచి మృతుడి కెమెరా స్వాధీనం చేసుకున్నారు. 

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

బిట్ కాయిన్ దూకుడు

K Venkateswara Rao | 12:23 PM, Thu Dec 07, 2023

మరో కీలక ఉగ్రవాది హతం

K Venkateswara Rao | 10:28 AM, Thu Dec 07, 2023

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add