Saturday, September 23, 2023

Odisha-365
google-add

ANANTNAG ENCOUNTER OVER: లష్కరే తయ్యబా కమాండర్ హతం.. ముగిసిన అనంతనాగ్ ఎన్‌కౌంటర్

T Ramesh | 18:03 PM, Tue Sep 19, 2023

  జమ్మూ-కశ్మీర్ రాష్ట్రంలోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరుగుతున్న ఎదురుకాల్పులకు తెరపడింది. లష్కరే తయ్యబా కమాండర్ మరణంతో సుదీర్ఘంగా కొనసాగిన ఎన్‌కౌంటర్ ముగిసింది. అయితే ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

లష్కరే తయ్యబా కమాండర్ ఉజైర్‌ఖాన్‌ను మట్టుబెట్టడంతో ముష్కరుల వేటను నిలిపివేశారు. తీవ్రవాదులు, భద్రతా బలగాల మధ్య వారం రోజులుగా సాగిన భీకరపోరులో కర్నల్ మన్‌ప్రీత్ సింగ్‌తో పాటు మేజర్ అశిష్ ధొనక్, జమ్మూకశ్మీర్ పోలీసు విభాగానికి చెదిన డీఎస్పీ హుమయూన్ భట్ అమరులయ్యారు. అదే రోజు ఓ జవాన్ ఆచూకీ దొరకలేదు. సెప్టెంబర్ 18న ఆ జవాను మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

నేడు జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో లష్కరే చీఫ్ ఉజైర్ ఖాన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ అడిషినల్ డీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. అయితే కాల్పులు నిలిపివేసినప్పటికీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్థానికులు అటు వెపు వెళ్లవద్దని సూచించారు.

google-add
google-add
google-add

Badi Baat

లేటెస్ట్ అప్‌డేట్

google-add

వీడియోలు

google-add

రాజకీయం

google-add
google-add
google-add

బ్లాగ్

google-add
google-add