Thursday, November 30, 2023

Odisha-365
google-add
టొమాటోకు రికార్డు  ధర

Tomato Record Price : టొమాటోకు రికార్డు ధర

Editor | 14:34 PM, Wed Jul 26, 2023


మదనపల్లె : టొమాటో ధరలు వినియోగదారులను భయపెడుతుంటే, పంట సాగుచేసిన రైతులకు మాత్రం సిరులు కురిపిస్తోంది. గత నెలరోజులుగా టొమాటో ధరలు చుక్కలను తాకుతున్నాయి. తాజాగా ఆసియాలో పెద్దదైన మదనపల్లె టొమాటో మార్కెట్లో రైతులకు రికార్డు ధర దక్కింది. ఇవాళ జరిగిన వేలం పాటలో ఏ గ్రేడ్ టొమాటో కిలోకు రూ.168 రికార్డు ధర దక్కింది. ఇక బి గ్రేడ్ రకాలకు రూ.118 నుంచి రూ.138 ధర దక్కింది. మదనపల్లె మార్కెట్లో టొమాటో కిలో సగటు ధర రూ. 156కు చేరింది. మార్కెట్ చరిత్రలో కిలో టొమాటోకు రూ.168 ధర దక్కడం ఇదే మొదటిసారని మార్కెట్ కార్యదర్శి  అభిలాష్ వెల్లడించారు.

దేశంలో  20 రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో టొమాటో ధరలు మరింత పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే దేశంలో అనేక ప్రాంతాల్లో టొమాటో ధరలు రూ.150 నుంచి రూ.230 దాకా పలుకుతున్నాయి. పశ్చిమబెంగాల్ సిలిగురిలో అత్యధికంగా కిలో టొమాటో రూ. 250 గరిష్ఠ ధర పలికింది. టొమాటో ధరలు రోజు రోజుకూ పెరిగిపోతూ ఉండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. 

టమాటో ధరలు నియంత్రించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే దేశంలో చాలా నగరాల్లో కిలో టమాటో రూ.75కు సరఫరా చేస్తూ వినియోగదారులకు కొంత ఊరట కలిగిస్తున్నారు. అయితే అవి అందరికీ అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 




google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023