Sunday, October 01, 2023

Odisha-365
google-add

Elon Musk:  ఎక్స్(ట్విట్టర్) లో పోస్టు చేయాలంటే నెలవారీ ఛార్జీ చెల్లించాల్సిందేనా..?

T Ramesh | 15:29 PM, Tue Sep 19, 2023

సంచలనాత్మక నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ప్రపంచ కుబేరుడు ఎలన్‌మస్క్, ఎక్స్(ట్విట్టర్) లో ఉచిత సేవలు నిలిపివేయాలని భావిస్తున్నారట. ఏదైనా సమాచారాన్ని పోస్టు చేయాలన్నా, ఇతరులతో పంచుకోవాలన్నా పెయిడ్ సబ్ క్రిప్షన్ తీసుకోవాల్సిందేనట. అంటే ఎక్స్ ను ఉపయోగించాలంటే నెలవారీ ఛార్జీలు చెల్లించాల్సిందే. నకిలీ అకౌంట్లకు చెక్ పెట్టడమే లక్ష్యంగా  ఎలన్ మస్క్  ఈ నిర్ణయం తీసుకోబోతున్నారనే ప్రచారం సాగుతోంది.

ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు తో ఆన్‌లైన్ లో సంభాషించిన ఎలన్ మస్క్,  ఎక్స్ గురించి మాట్లాడారు. ప్రతినెలా 550 మిలియన్ల మంది ఎక్స్ ను ఉపయోగిస్తున్నారని రోజుకు 100 నుంచి 200 మిలియన్ పోస్టులు చేస్తున్నారని ప్రకటించారు. అయితే ఇందులో నిజమైన ఖాతాదారుల ఎంతో మందో నకిలీ ఖాతాలో ఎన్నో సరైన లెక్కలు లేవు.  ఆర్టి ఫిషియల్ ఇంటిలిజెన్స్ లాంటి కొత్త టెక్నాలజీ కీలకంగా మారిన సమయంలో ఎక్స్(ట్విట్టర్)లో సంస్కరణలు చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

విద్వేష ప్రసంగాల పోస్టులకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.  ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ఎలన్ మస్క్ అందులో చెప్పుకోదగిన స్థాయిలో మార్పులు తీసుకొచ్చారు. నిషేధిత ఖాతాలను యాక్టివ్  చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరించారు. అలాగే ప్రముఖు ఖాతాలకు ఉపయోగించే బ్లూమార్క్ ను కూడా తొలగించారు.

కొన్ని రోజులుగా ట్విటర్ ఆదాయం తగ్గిపోయిందనే ప్రచారం జరుగుతోంది. యాడ్ సేల్స్ కూడా తగ్గిపోయాయని, దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టిన మస్క్, పోస్టుకు డబ్బులు వసూలు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add

వీడియోలు

google-add
google-add
google-add

రాజకీయం