Sunday, October 01, 2023

Odisha-365
google-add

భారత్‌పై కెనడా ఆరోపణలతో అగ్రదేశాల ఆందోళన

P Phaneendra | 17:57 PM, Tue Sep 19, 2023

ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ ఉగ్రవాదసంస్థ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధానమంత్రి తమ దేశ పార్లమెంటులో చేసిన ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రపంచ దేశాలు తమ ఆందోళనలను వ్యక్తం చేస్తూ స్పందిస్తున్నాయి.

కెనడా ఆరోపణలపై అమెరికా తీవ్రంగా ఆందోళన చెందుతోందని ఆ దేశ జాతీయ భద్రతా కౌన్సిల్ అధికార ప్రతినిథి అడ్రియన్ వాట్సన్ అన్నారు. ‘‘మా కెనడా భాగస్వాములతో మేం నిరంతరం కాంటాక్ట్‌లోనే ఉంటాం. కెనడాలో (హత్య కేసు) దర్యాప్తు ముందుకు సాగాలి, నేరస్తులను కఠినంగా శిక్షించాలి’’ అని వ్యాఖ్యానించారు.

జూన్‌ నెలలో జరిగిన నిజ్జర్ హత్య కేసులో కెనడా ప్రభుత్వం ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. అయితే ఆ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను వెతుకుతున్నామని కెనడా పోలీసులు ఆగస్ట్ నెలలో వెల్లడించారు.

కెనడా చేస్తున్న ఆరోపణల పట్ల ఆస్ట్రేలియా కూడా ఆందోళన వ్యక్తం చేస్తోందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. ‘‘ఈ విషయంలో జరుగుతున్న పరిణామాలపై మేము మా భాగస్వామ్య దేశాలతో సన్నిహితంగా చర్చిస్తున్నాము. భారత్‌లోని ఉన్నతాధికారులకు మా ఆందోళనలను తెలియజేసాము’’ అని ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘ఈ నివేదికలు ఆస్ట్రేలియాలోని కొన్ని జాతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆస్ట్రేలియా బహుళ సంస్కృతులు కలిగిన దేశం. మా దేశస్తులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా శాంతియుతంగా ప్రకటించగలరు. ఆస్ట్రేలియాలో భారతీయ డయాస్పోరా ఎంతో విలువైనది. ఆస్ట్రేలియాను చైతన్యవంతమైన సమాజంగా తీర్చిదిద్దడంలో భారతీయుల సేవలు ఎనలేనివి’’ అని ఆస్ట్రేలియా పేర్కొంది.

భారత కెనడా దేశాల మధ్య దౌత్య సమరం జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని కెనడా హైకమిషన్‌కు భద్రత పెంచారు.  కెనడా ప్రధాని తమ దేశపు పార్లమెంటులోనుంచి భారతదేశ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు అసంబద్ధమైనవి, ప్రేరేపితమైనవి అని భారత విదేశాంగశాఖ వ్యాఖ్యానించింది. వాటిని పూర్తిగా తిరస్కరిస్తున్నట్టు ప్రకటించింది.

google-add
google-add
google-add

Badi Baat

లేటెస్ట్ అప్‌డేట్

google-add

వీడియోలు

google-add

రాజకీయం