Thursday, November 30, 2023

Odisha-365
google-add

ఇంఫాల్ విమానాశ్రయం వద్ద అనుమానిత వస్తువు : రఫేల్ యుద్ధ విమానాలతో గాలింపు

K Venkateswara Rao | 14:24 PM, Mon Nov 20, 2023

మణిపుర్‌లోని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయం (Imphal International Airport) వద్ద గాల్లో ఎగిరిన గుర్తు తెలియని వస్తువుపై సైన్యం అప్రమత్తమైంది. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వస్తువు గాల్లో ఎగురుతోందని విమానాశ్రయ వర్గాలు ఏటీసీకి సమాచారం ఇచ్చాయి. అప్రమత్తమైన ఏటీసీ, విమానాశ్రయంలో విమానాల రాకపోకలు నిలిపేసింది.

వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయడంతో సమీపంలోని ఎయిర్‌బేస్ నుంచి రెండు రఫేల్ యుద్ధ విమానాలను రంగంలోకి దింపారు. అత్యాధునిక సెన్సార్ వ్యవస్థ కలిగిన రఫేల్ యుద్ద విమానంతో గాలించినా ప్రయోజనం దక్కలేదు. ఎలాంటి అనుమానిత వస్తువు ఆనవాళ్లు లభించలేదని అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంఫాల్ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ మెకానిజమ్‌ను యాక్టివేట్ చేశారు. ఆ తరవాత నుంచే ఆ అనుమానిత వస్తువు కనిపించకుండా పోయిందని తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో మూడు గంటల పాటు విమానాల రాకపోకలు నిలిపేశారు.

google-add
google-add
google-add

Badi Baat

లేటెస్ట్ అప్‌డేట్

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add

రాజకీయం