Thursday, November 30, 2023

Odisha-365
google-add

బీజేపీ అధికారంలో ఉంటేనే సుపరిపాలన, వైసీపీ పాలన అధ్వాన్నం: పురందరేశ్వరి

T Ramesh | 14:11 PM, Mon Nov 20, 2023

దశబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఎన్నో ప్రజాసమస్యలకు పరిష్కారం చూపిన ఘనత ప్రధాని నరేంద్రమోదీకే దక్కుంతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి అన్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తోన్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. మహిళా బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడం లో ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

ఎస్సీ వర్గీకరణ సమస్యకు కూడా బీజేపీ మాత్రమే పరిష్కారం చూపగల్గుతుందన్నారు. అవినీతి రహిత పాలన బీజేపీ నేతృత్వంలో సాధ్యమన్నారు. కేంద్రంలో బీజేపీ సుపరిపాలన అందిస్తుంటే, రాష్ట్రంలో మాత్రం వైసీపీ పాలన మాత్రం అధ్వానంగా ఉందన్నారు. సొంత నేతల జేబుల నింపడమే లక్ష్యంగా పాలన ఉందని విమర్శించారు. గుడిలో విగ్రహాల కూల్చివేత ఘటనలు జరిగినా సరైన చర్యలు చేపట్టడంలో విఫలమైందన్నారు.  వైసీపీ ప్రభుత్వ విధ్వంసక పాలనను  ప్రజలంతా గమనిస్తున్నారని పురందరేశ్వరి అన్నారు.

ఒంగోలులో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న పురందరేశ్వరి, ఎస్సీలకు సంబంధించి 27 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.  సామాజిక బస్సుయాత్ర నిర్వహించే అర్హత వైసీపీకి లేదని ఆమె దుయ్యబట్టారు.

google-add
google-add
google-add

Badi Baat

లేటెస్ట్ అప్‌డేట్

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add

రాజకీయం