Sunday, October 01, 2023

Odisha-365
google-add

ఖలిస్తానీల కేంద్రస్థానం, భారత్‌కు వ్యతిరేకం కెనడా

P Phaneendra | 16:28 PM, Tue Sep 19, 2023

ప్రపంచ అగ్రరాజ్యాల్లో ఒకటైన కెనడా, భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఇటీవల జి-20 సమావేశాలకు హాజరవడానికి వచ్చినప్పుడు సైతం, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అంటీముట్టనట్టుగానే ఉండిపోయారు. దానికి ప్రధాన కారణం... ఖలిస్తాన్ అనుకూలవాది అయిన జగ్మీత్ సింగ్ ధలీవాల్ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ పార్టీ ట్రూడో ప్రభుత్వానికి కీలక మద్దతు ఇస్తుండడమే.  

జస్టిన్ ట్రూడో అధికారంలోకి వచ్చిన 2021 నుంచీ అతని రాజకీయ బలహీనతను అడ్డం పెట్టుకుని ఖలిస్తానీ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా తమ కార్యకలాపాలను బాహాటంగానే చేపడుతున్నారు. వారు ట్రూడోని ఎంతలా ప్రభావితం చేసారంటే ఆఖరికి కెనడా పార్లమెంటులో సైతం ట్రూడో భారతదేశాన్ని నిందిస్తున్నాడు. ఒక ఖలిస్తానీ ఉగ్రవాది చనిపోతే అది భారత జాతీయవాద ప్రభుత్వం నడుపుతున్న రిసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ గూఢచారుల పనే అంటూ కెనడా ప్రధాని తమ పార్లమెంటులో మాట్లాడుతున్నాడు. ఇంతటి భారత వ్యతిరేక ఖలిస్తానీ ఉగ్రవాద అనుకూల ప్రభుత్వం ఉంటే కెనడాలో హిందూ మందిరాల మీద, ఇతర హిందూ సంస్థల మీద విషం జిమ్మడం, దాడులు చేయడం అత్యంత సహజం.

ఎప్పటిదాకానో అక్కరలేదు. ఒక్క 2023లోనే ఖలిస్తానీ అనుకూల కార్యక్రమాల జాబితా చూస్తే చాలు... కెనడా పాలకులు భారత వ్యతిరేకవాదులకు మద్దతు ఎలా ఇస్తున్నారో అర్ధమవుతుంది. హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి, భారత దౌత్య కార్యాలయాల వద్ద దేశ వ్యతిరేక నినాదాలు వినిపించాయి. సిక్కులకు ప్రత్యేక దేశం కోసం రిఫరెండాలు నిర్వహించారు. ఇలా ఒకటా రెండా... ఎన్నెన్నో ఉదాహరణలు.

జనవరి 30, 2023: బ్రాంప్టన్‌లోని గౌరీశంకర మందిరంలో భారత వ్యతిరేక రాతలు రాసారు, ఆలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేసారు. కెనడా గడ్డ మీద జరుగుతున్న భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక కార్యక్రమాలపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది.

ఫిబ్రవరి 15, 2023: మిసిసాగాలోని రామమందిరం గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాసారు. కొందరు దుండగులు ‘మోదీని ఉగ్రవాదిగా ప్రకటించాలి’, ‘సంత్ భింద్రన్‌వాలే అమరవీరుడు’, ‘హిందుస్తాన్ ముర్దాబాద్’ వంటి నినాదాలు ఆలయం గోడలపై రాసుకొచ్చారు.

మార్చి 20, 2023: ఖలిస్తాన్ అనుకూల ట్విట్టర్ ఖాతాలను భారతదేశం నిషేధించింది. వాటిలో కొన్ని కెనడా ప్రభుత్వ అధికారుల ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. కెనడాలోని న్యూ డెమొక్రటిక్ పార్టీ నాయకుడు జగ్మీత్ సింగ్, కెనడియన్ పంజాబీ కవయిత్రి రూపీ కౌర్, గుర్దీప్ సింగ్ సహోతా అనే యాక్టివిస్టు, యునైటెడ్ సిఖ్స్ అనే స్వచ్ఛంద సంస్థ... తదితరుల ట్విట్టర్ ఖాతాలను భారత ప్రభుత్వం బ్లాక్ చేసింది.

మార్చి 23, 2023: వాంకూవర్‌లోని భారత దౌత్య కార్యాలయం ముందు వందలమంది నిరసనకారులు గుమిగూడారు. సిక్కులకు ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేసారు. భారతదేశంలోని పంజాబ్‌ను విడదీసి, ఖలిస్తాన్ పేరిట ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలనేది వీరి డిమాండ్.

 ఏప్రిల్ 5, 2023: ఒంటారియో ప్రొవిన్స్‌ విండ్సర్‌లోని స్వామినారాయణ్ మందిరంలో భారత వ్యతిరేక నినాదాలు రాసారు. భారతదేశాన్నీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పరుష పదజాలంతో విమర్శిస్తూ వ్యాఖ్యలు రాసారు. విండ్సర్ పోలీసులు ఈ ఘటనను ‘ద్వేషాన్ని ప్రేరేపించే ఘటన’గా అభివర్ణించారు.

 జులై 8, 2023: టొరంటోలోని భారత కాన్సులేట్ కార్యాలయం ముందు వందలమంది సిక్కులు గుమిగూడారు. భారతదేశం ఉగ్రవాదిగా ప్రకటించిన హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్ హత్యకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు.   

 జులై 9, 2023: వాంకూవర్‌ నగరంలో ఖలిస్తానీ వాదులు భారత వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో త్రివర్ణ పతాకాన్ని తగులబెట్టారు. ఆ పతాకాన్ని రక్షించడానికి ప్రయత్నించిన ఒక భారతీయుణ్ణి చితకబాదారు.

 31, జులై 2023: బ్రిటిష్ కొలంబియాలో ఖలిస్తాన్ అనుకూలవాదులు భారత వ్యతిరేక ప్రచారం నిర్వహించారు. బ్రిటిష్ కొలంబియా ప్రొవిన్స్‌లో ఉన్నసీనియర్ భారత దౌత్యాధికారులకు వ్యతిరేకంగా పోస్టర్ల ద్వారా ప్రచారం నిర్వహించారు. భారత దౌత్యాధికారుల బొమ్మలపై ‘వాంటెడ్’ అని రాసిన పోస్టర్లను సర్రే పట్టణంలోని పలు ప్రదేశాల్లో ప్రదర్శించారు. సిక్కు వేర్పాటు సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్‌ జూన్ 8న హత్యకు గురయ్యాడు. దానికి కారణం భారతదేశమేనని ఖలిస్తాన్ అనుకూలవాదుల భావన.  

 13 ఆగస్టు 2023: బ్రిటిష్ కొలంబియాలోని లక్ష్మీనారాయణ మందిరం ద్వారాలు పాక్షికంగా ధ్వంసం చేసారు. తలుపులపై ఖలిస్తాన్ అనుకూల నినాదాలతో కూడిన పోస్టర్లు అంటించారు. భారతదేశం నుంచి పంజాబ్‌ను విడదీసి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలన్నది వారి డిమాండ్.

07 సెప్టెంబర్ 2023: బ్రిటిష్ కొలంబియా ప్రొవిన్స్‌లోని సర్రే పట్టణంలో మాతా భామేశ్వరి దుర్గ ఆలయం గోడలపై పంజాబ్ వేర్పాటువాద అనుకూల నినాదాలు రాసారు. ఆ మరునాడే, వాంకూవర్‌లోని బారత కాన్సులేట్‌ను మూసివేస్తామంటూ వేర్పాటువాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ బెదిరించింది.

12 సెప్టెంబర్ 2023: పంజాబ్ వేర్పాటువాద ఉగ్రవాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్,  ఖలిస్తానీ అనుకూల ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. బ్రిటిష్ కొలంబియాప్రొవిన్స్ సర్రే పట్టణంలోని గురుద్వారాలో రిఫరెండం నిర్వహించింది. ఇటువంటి సంస్థలు భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయనీ, దేశ సమైక్యతకు భంగం కలిగిస్తున్నాయనీ భారత ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ సర్రే పోలీసులు ఎలాంటి చర్యా తీసుకోలేదు.  

 

ఒకప్పుడు భారతదేశాన్ని విదేశీ ముష్కరుల నుంచి రక్షించడానికి కంకణం కట్టుకున్న సిక్కులలోని కొన్ని వర్గాలు ఇప్పుడు దేశాన్ని ముక్కలు చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. భారతభూభాగంలోని పంజాబ్‌ను ఖలిస్తాన్‌ అనే ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని పరాయిగడ్డ నుంచి ఉద్యమాలు చేస్తున్నాయి. కెనడాలో రాజకీయంగానూ బలం పుంజుకున్న సిక్కు వర్గాలు, భారత్‌కు వ్యతిరేకంగా ఆ దేశ ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నాయి. ప్రస్తుతం కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పార్టీకి గద్దెమీద నిలవడానికి అవసరమైన మద్దతు అందిస్తోంది సిక్కుల పార్టీ. అందువల్లే ట్రూడో, వారికి వ్యతిరేకంగా నోరెత్తడం లేదు. భారత్‌ను ఎంత నిందిస్తున్నా కిమ్మనడం లేదు. పైగా... వారు చేస్తున్న నిరాధార ఆరోపణలను స్వయంగా తానే చేస్తూ భారతదేశ సార్వభౌమాధికారాన్ని అవమానిస్తున్నాడు. కొన్నాళ్ళ క్రితం భారత్ అమల్లోకి తెద్దామని ప్రయత్నించిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌లో నెలల తరబడి ఉద్యమం జరిగింది. దానికి ఆర్థిక, హార్దిక సహాయం అందించినది ఈ ప్రబుద్ధులే.

google-add
google-add
google-add

Badi Baat

లేటెస్ట్ అప్‌డేట్

google-add

వీడియోలు

google-add

రాజకీయం