Sunday, October 01, 2023

Odisha-365
google-add

PFI under new guise: రూపు మార్చుకుని మళ్ళీ రానున్న నిషిద్ధ పీఎఫ్ఐ సంస్థ

P Phaneendra | 15:17 PM, Fri Sep 15, 2023

భారత ప్రభుత్వం నిషేధించిన ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ సంస్థ సభ్యులు తమ రాజకీయ పార్టీ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా – ఎస్‌డీపీఐ ద్వారా మరో కొత్త సంస్థను ఏర్పాటు చేయడానికి సిద్ధమవతున్నారు.

 గత సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం పీఎఫ్ఐను నిషేధించింది. అప్పటినుంచీ ఆ సంస్థ నాయకులు, కార్యకర్తలు ఎస్‌డీపీఐకి అనుబంధంగా యూత్ ఫ్రంట్‌ పేరుతో కొత్త సంస్థ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యువతను సమీకరిస్తున్నారు. ఆ మేరకు ఎస్‌డీపీఐ కూడా సూచనప్రాయంగా సంకేతాలు ఇస్తూ వస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.  

 తెలుస్తున్న వివరాల మేరకు... నిషిద్ధ పీఎఫ్ఐ ఇప్పుడు తన రిక్రూట్‌మెంట్‌ పద్ధతుల్లో కొన్ని మార్పులు చేసింది. పీఎఫ్ఐ గతంలో ఆపరేట్ చేసిన ప్రతీ ప్రదేశం నుంచీ కనీసం 4-5 మంది బలమైన యువకులను ఎంపిక చేసుకుంటారు. వారికి తమకు కావలసినట్టు శిక్షణ ఇస్తారు. అంతేకాదు, వారిని పూర్తిస్థాయి కార్యకర్తలుగా నియమించుకోడానికి వీలుగా వారికి నిధులు కూడా సమకూరుస్తారు.  

తమకు పట్టున్న ప్రాంతాల్లో ఇలా కార్యకర్తలను నియమించుకునే ప్రక్రియ పూర్తయిన తర్వాత, సమకాలీన జాతీయ అంశాలపై ఎస్‌డీపీఐ ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వచ్చే యేడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా అప్పటికల్లా కొత్త సంస్థను ఎస్‌డీపీఐ ప్రకటిస్తుంది.  

గతంలో పీఎఫ్ఐ కార్యకర్తల ఎంపిక, నియామకం వంటి ప్రక్రియలు మసీదులు, మదరసాలు, ఇతర ముస్లిం సంస్థల వద్ద జరుగుతుండేవి. అయితే ఈ సంస్థ, దాని నియామక విధానాలపై కొత్తగా కేంద్ర బలగాల నిఘా పెరిగిన నాటి నుంచీ సంస్థ కొత్త కొత్త వ్యూహాలు అవలంబిస్తోంది.

 గత మూడు నెలలుగా పీఎఫ్ఐ, ఎస్‌డీపీఐ కలిసి తిరువనంతపురం వద్ద వరుసగా బోలెడు ప్రైవేటు సమావేశాలు ఏర్పాటు చేసాయి, చేస్తున్నాయి. ఆ రహస్య సమావేశాలకు త్వరలో ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా పలువురు కార్యకర్తలు హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది.

 తమ కార్యకలాపాల పరిధిని విస్తరించే లక్ష్యంతో పీఎఫ్ఐ పనిచేస్తోంది. అందుకే సైబర్ నిపుణులను రిక్రూట్ చేసుకుంటోంది. వారికి తమ సైబర్ వింగ్‌లో తమ అవసరాలకు తగినట్టుగా శిక్షణ ఇస్తుందని సమాచారం.

 ఆ సంస్థ టెక్నాలజీ ఫ్రెండ్లీగా ఉండే కార్యకర్తలను రిక్రూట్ చేసుకుంటోందని సమాచారం. అలాగే ఇంటర్నెట్ ద్వారా మరింత మందిని సమీకరించి, వారి ద్వారా తమ కార్యకలాపాలు విస్తరించాలని ప్రణాళికలు రచిస్తోందని తెలుస్తోంది. ఈ సంస్థను బలోపేతం చేయడానికి పలువురు టెక్ ఎంటర్‌ప్రెన్యూర్లు పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం.

 పీఎఫ్ఐను భారత ప్రభుత్వం గతేడాది జాతివ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు నిషేధించింది. ఉపా చట్టం కింద మొత్తం ఐదేళ్ళపాటు పీఎఫ్ఐ మీద నిషేధం విధించారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

వీడియోలు

google-add

రాజకీయం