Thursday, November 30, 2023

Odisha-365
google-add

‘ధోభీ ఘాట్ ఆక్రమించి కాళీమాత ఆలయ సమీపంలో చర్చి నిర్మాణం’

T Ramesh | 15:58 PM, Wed Nov 15, 2023

అన్యమతస్తుల ఆగడాలు పెచ్చుమీరాయనడానికి రాష్ట్రంలో మరో ఉదాహరణ దొరికింది. నిబంధనలకు వ్యతిరేకంగా చట్టాలంటే లెక్కలేకుండా వ్యవహరిస్తున్న తీరు మరోసారి బహిర్గతమైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎలాంటి అనుమతులూ లేకుండా అక్రమంగా జరుగుతున్న చర్చి నిర్మాణాన్ని అడ్డుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు స్థానికులు ఫిర్యాదు చేశారు.

రాజీవ్ గృహకల్ప అపార్టుమెంట్ రోడ్డులో కాళీమాత ఆలయం సమీపంలో రజక కళ్యాణ మండపం, ధోభీ ఘాట్‌ను ఆక్రమించి నిర్మిస్తున్న చర్చి నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని ఫిర్యాదులో కోరారు. ఆదరణ మినిస్ట్రీస్ పేరిట పాస్టర్ జోసెఫ్ నేతృత్వంలో ఈ మతపరమైన కట్టడ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టం మేరకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిబంధనలు ఉల్లంఘిస్తూ పనులు చేస్తున్నారని వివరించారు. 

రాష్ట్ర హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా ఈ మతపరమైన కట్టడ పనులు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. నివాసాల మధ్య చర్చి నిర్మాణం చేపట్టవద్దని గత ఏడాది హైకోర్టు వెలువరించిన తీర్పును ఉదహరించారు. సుప్రీంకోర్టుల తీర్పుల మేరకు ఈ నిర్మాణాన్ని చేపట్టడం నేరమన్నారు.

స్థానిక ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ ప్రాంతంలో ఒక్క క్రైస్తవుడు కూడా లేరన్నారు. హిందూ దేవాలయ చట్టం-1987, సెక్షన్ 30 ప్రకారం హిందూదేవాలయాల చుట్టూ, హిందూ నివాస గృహాల మధ్యలో రోడ్లపై , మైక్ సెట్ ద్వారా పోస్టర్లు, బ్యానర్లు, ప్రార్థనలు వంటి అన్య మతప్రచారం నిషేధించిన విషయాన్ని గమనించాలని కోరారు.

స్థానిక కాళీ మాత ఆలయానికి సమీపంలో ఈ చర్చ్ నిర్మాణానికి పూనుకున్నారని తక్షణమే  నిలిపివేత చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023