ఉన్మాదులను దేశం నుంచి వేరు చేసినా వారి విధానం మార్చుకోలేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ధ్వజమెత్తారు. నాగపూర్ కేంద్రంగా జరుగుతోన్న సంఘ్ శతాబ్ది సమారోహ్ కార్యక్రమంలో భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన వాళ్లని, మన దేశంలో ఉగ్రవాదులు వచ్చి కాల్చి చంపారు. ఆ సంఘటన వల్ల అందరి మనుసుల్లో బాధ, కోపం ఉంది. ఈ ఘటనపై అనేక చర్చలు జరిగాయి. ఈ సంఘటన మూలాన మన సైనికుల వీరత్వం మరోసారి మెరుపు తీగలా మెరిసింది. ప్రజలను రక్షించడానికి ఉన్న అవకాశాలు పలు విధాలుగా ఉన్నాయి. చాలా ఆలోచించి మన పాలకులు ప్రతిదాన్ని ఆచితూచి తీసుకున్న నిర్ణయాలు , దాని పర్యవసానాలు మనం చూస్తూనే ఉన్నాం.
సమాజం మొత్తం ఈ విషయంలో ఐక్యత చూపించింది. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రసంగాలు పాతవైనా, చప్పబడినా దాని ప్రభావం ఉంటుంది. ఈ సంఘటన వల్ల కుల, మత బేధాలు లేకుండా అందరూ కలసికట్టుగా దేశం కోసం వేసిన అడుగు చరిత్రలో నిలిచిపోతుంది.ఈ ఉన్మాదం ఏదైతే ఉందో, మనకు అంటుకోకుండా ఉండటానికి వారిని వేరు చేశారు. వేరు అయ్యారు అనేది లేకుండా దేశంపై ఉన్మాదం ఎక్కువ అవుతుంది. ఆ ఉన్మాదం తగ్గినప్పుడు అంతా మంచిగా ఉంటుంది.
ఎదురుగా వచ్చి యుద్ధాన్ని ఎదురించలేని వాడు, ఉగ్రవాదులను ప్రోత్సహించి గెలవాలని చూస్తున్నాడు. సైబర్ నేరాలు, ఫాక్సీ యుద్ధాలు నడుస్తున్నాయి. ప్రపంచం మొత్తం మీద ఈ విషయం గొత్తెత్తి చెప్పినా ఉన్మాదం పోవడం లేదు. గతంలో ఎదురుబొదరు ఉండి యుద్ధం చేసేవారు. ఎవరు గెలిస్తే వారు రాజు అయ్యేవారు. ఇది అలాంటిది కాదు గదా? యుద్ధానికి అనేక కొత్త విధానాలు వచ్చాయి. మన ఇంట్లోనే కూర్చొని బటన్ నొక్కితే డ్రోన్లు యుద్ధం చేస్తాయి. కొత్త కొత్త టెక్నాలజీ వస్తోంది. దీని వల్ల ప్రపంచంలో ఇలాంటివి తయారు చేస్తున్న వారికి కూడా పరీక్షలాంటిదే. మనం రక్షణ కల్పించుకోవాలంటే స్వయం నిర్ణయాలు తీసుకోవాలి. వాటిని అమలు చేయాలని భాగవత్ పేర్కొన్నారు.
మన తరుపు నుంచి మనకు ప్రపంచంలో ఎవరూ శత్రువులు లేరు. మన దరిద్రం ఏమిటంటే, ప్రపంచంలో ఇలాంటి అరాచకాలు చేసే ఉన్మాదులు మనదేశంలోనే పుట్టుకొస్తున్నారు. ఇలాంటి వారు ఉన్నారు కాబట్టి దాడికి, ప్రతిదాడికి మనం సిద్దంగా ఉండాలి. కొత్త కొత్త విషయాలు, విధివిధానాలు రూపొందించుకోవాలి. మేమూ చూస్తున్నాం..ఎక్కడెక్కడ ఏ జరుగుతుందోనని సైనిక ముఖ్య అధికారి ఒకరు చెప్పారు. ఆధిపత్యం కోసం రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్, లండన్ నగరంపై ఏకదాటిగా బాంబుల వర్షం కురిపించాడు. మనకు పోరాడే శక్తి లేదు, బ్రిటన్ మంత్రి మండలి లొంగిపోవాలని ప్రధాని చర్చిల్‌కు సూచించింది. మనల్ని ఎన్నుకున్నది ఎవరు? ప్రజలు, యుద్దం చేయాలా లేదా, అనేది ప్రజలు నిర్ణయిస్తారు. లోకల్ మెట్రోలో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న చర్చిల్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలంతా దాసాహం వద్దు, చివరి వరకూ పోరాడదామని చెపుతున్నారని చర్చిల్ పార్లమెంటులో చెప్పినట్లు భాగవత్ గుర్తుచేశారు.
యుద్ధంలో గెలిచిన తరవాత చర్చిల్ ఓ విషయం చెప్పారు. నేను సింహాన్ని కాదు. మీరే సింహాలు, నేను ఆ శబ్దాన్ని మాత్రమే తీసుకెళ్లానని ప్రజలనుద్దేశించి అప్పటి బ్రిటన్ ప్రధాని చర్చిల్ చెప్పినట్లు భాగవత్ గుర్తుచేశారు.
సమాజం ఐక్యంగా ఉండాలి. మన దేశం భిన్నత్వానికి నిలయం. దీని వల్ల సమస్యలూ ఉన్నాయి. ఒకరికి లాభం చేకూర్చేది, మరొకరికి నష్టం చేస్తోంది. దేశ హితం కోసం ఇవన్నీ సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఉగ్ర మూలాలు ఉండకూడదు. అవసరం లేని చోట గొడవలు ఉండకూడదు. గొడవల్లో తలదూర్చి, చట్టాలను చేతుల్లోకి తీసుకోవడాన్ని అరికట్టాలి. దీని మూలాన నిరపరాదులు ప్రభుత్వంపై పోరాటాలు చేయాల్సి వస్తోంది. సమాజంలో గొడవలు లేపే వారు కూడా ఉన్నారు. మన రాజ్యాంగం ప్రకారం అలాంటివి చేయకూడదు.