Thursday, June 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

K Venkateswara Rao by K Venkateswara Rao
Jun 4, 2025, 04:09 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పసిడి. విలువైన లోహం. ప్రపంచంలో పలు దేశాల కేంద్ర బ్యాంకులు ఇటీవలి కాలంలో బంగారం నిల్వలు భారీగా పెంచుకుంటూ పోతున్నాయి. భారతీయ రిజర్వు బ్యాంకు కూడా బంగారం నిల్వలు ఏటా పెంచుకుంటూ పోతోంది. ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిల్వలు కలిగిన 8వ దేశంగా భారత్ అవతరించింది. అయితే రిజర్వు బ్యాంకు టన్నుల కొద్దీ బంగారం ఎందుకు కొనుగోలు చేస్తోంది. అనే అనుమానం చాలా మందికి రావచ్చు. దీనికి అనేక కారణాలు చెబుతున్నారు ఆర్థిక విశ్లేషకులు.

భారతీయ రిజర్వు బ్యాంకు నిర్వహణ వ్యూహంలో భాగంగా పసిడి కొనుగోలు చేస్తోంది. ఇది దేశ ఆర్థిక స్థిరత్వం భద్రతను నిర్ధారించడంలో సహాయపడుతుంది. గణనీయమైన బంగారు నిల్వలు ఆర్థిక సవాళ్లను తట్టుకుంటాయి. ఆర్థిక వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుంది. బంగారంలో వ్యూహాత్మక పెట్టుబడి రిజర్వుబ్యాంకు ముందుచూపునకు నిదర్శనంగా నిలుస్తుంది. జాతీయ కేంద్ర బ్యాంకు వద్ద ఉన్న బంగారం నిల్వలు, డిపాజిటర్లు, నోట్ హోల్డర్లు ట్రేడింగ్ సహచరులకు హామీగా ఉపయోగపడుతుంది. జాతీయ కరెన్సీ విలువను కాపాడటానికి రిజర్వు బ్యాంకు బంగారం కొనుగోలు చేస్తుంది.

మొత్తం ఎంత బంగారం ఉంది?

ప్రపంచ బంగారు మండలి అంచనా ప్రకారం, 2019లో ఇప్పటివరకు తవ్విన మొత్తం బంగారం 190,040 మెట్రిక్ టన్నులు. అంచనాలు 20 శాతం అటుఇటూగా ఉంటాయి. 2017 అంచనాలు, అప్పటి ధరల మొత్తం బంగారం విలువ $7.5 ట్రిలియన్లు. ప్రపంచవ్యాప్తంగా బంగారం ఉత్పత్తి చేసే 10 దేశాలలో ఘనా అగ్రస్థానంలో ఉంది పశ్చిమ ఆఫ్రికా బంగారం ఉత్పత్తిలో 70 శాతం ఘనాలోనే తవ్వుతున్నారు.

రిజర్వు బ్యాంకు వద్ద టన్నుల కొద్దీ బంగారం నిల్వలు

ఇటీవలి కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం నిల్వలను భారీగా పెంచుకుంటోంది.బంగారం నిల్వలు పెంచుకుంటూ రిజర్వుబ్యాంకు వ్యూహాత్మకంగా ముందుకుసాగుతోంది. ఏప్రిల్ నాటికి రిజర్వు బ్యాంకు వద్ద మొత్తం 880 టన్నుల బంగారం ఉంది. అంటే 8 లక్షల 80 వేల కిలోలన్న మాట. దీని విలువ ప్రస్తుత ధరల ప్రకారం 8 లక్షల 70 వేల కోట్లపైగామాటే. అయితే మొత్తం బంగారంలో 58 శాతం మాత్రమే మన దేశంలో ఉంది. మిగిలిన బంగారం, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాడ్ వద్ద నిల్వ చేశారు.

మన బంగారం విదేశాల్లో నిల్వ ఎందుకు?

ప్రపంచ మార్కెట్లో కొనుగోలు చేసిన బంగారం, రిజర్వు బ్యాంకు అక్కడే నిల్వ చేస్తూ వచ్చింది. అయితే ఇటీవలి కాలంలో ఇంగ్లాండ్ నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో 100 టన్నుల బంగారం ముంబైలోని మింట్‌కు తరలించారు. దీంతో దేశీయ నిల్వలు 58 శాతానికి పెరిగాయి. మరో 42 శాతం విదేశాల్లోనే నిల్వ చేశారు. 2023 మార్చిలో మనదేశంలోని మొత్తం బంగారం నిల్వలు 300 టన్నులు మాత్రమే. మిగిలిన బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, ఇతర అంతర్జాతీయ బ్యాంకుల్లో నిల్వ చేశారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం తాజాగా రిజర్వు బ్యాంకు వద్ద బంగారం నిల్వ మొత్తం 880 టన్నులకు చేరుకుంది.

కొన్ని దేశాలు భారీగా కొనుగోళ్లు, మరికొన్ని అమ్మకాలు

ప్రపంచంలో చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయి.2025లో అతి చిన్న దేశం పోలండ్ అత్యధికంగా 12 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. పోలండ్ వద్ద ప్రస్తుతం 509 టన్నుల బంగారం నిల్వలున్నాయి . ఐరోపా సెంట్రల్ బ్యాంకు వద్ద మరో 507 టన్నుల బంగారం నిల్వలున్నాయి. ప్రపంచంలోనే చైనా అత్యధికంగా బంగారం కొనుగోలు చేస్తోంది. అయితే 2025లో చైనా 2 టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. కిర్గిస్థాన్, టర్కీ కేంద్ర బ్యాంకులు రెండు టన్నులు చొప్పున బంగారం కొనుగోలు చేశాయి. అయితే మరికొన్ని దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని విక్రయిస్తూ వస్తున్నాయి. రష్యా, సింగపూర్, పిలిప్పైన్స్, ఉజ్బెకిస్తాన్ దేశాలు పెద్ద ఎత్తున బంగారాన్ని విక్రయించాయి. ఏప్రిల్ మాసంలోనే ఉజ్బెకిస్థాన్ 11 టన్నుల బంగారాన్ని అమ్మేసింది. పోలండ్ 2024లో అత్యధికంగా 90 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. టర్కీ 75 టన్నులు, భారత్ 73 టన్నులు పసిడి కొనుగోలు చేసి వరుసగా మూడు స్థానాల్లో నిలిచాయి. 2024లో చైనా కన్నా రెట్టింపు పరిమాణంలో రిజర్వుబ్యాంకు బంగారం కొనుగోలు చేసింది.

ఆకాశంలో పసిడి ధరలు

భౌగోళికంగా ఏర్పడిన ఉద్రిక్తతలు బంగారం ధరలకు ఆజ్యం పోస్తున్నాయి. గత ఏడాది కాలంలోనే గోల్డ్ రేటు 30 శాతంపైగా ఎగబాకింది. తాజాగా 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 99,285కు చేరుకుంది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం, ఇజ్రాయెల్, పాలస్తీనా పోరు, ఆర్థిక సంక్షోభం వార్తలు.. మదుపర్లు బంగారం కొనుగోలు చేసేలా చేస్తున్నాయి. ఏడాది కాలంగా పుత్తడి ధర పెరుగుతూపోతోంది తప్పితే తగ్గుదల మాత్రం కనిపించడం లేదు. యుద్ధాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు పెట్టుబడులకు అనుకూలంగా లేవు. అందుకే బంగారంలో పెట్టుబడులు అనువైనవిగా భావిస్తున్నారు. అటు కేంద్ర బ్యాంకులతోపాటు, పెట్టుబడిదారులు కూడా పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తున్నారు.

కరెన్సీ ముద్రణ బంగారానికి ఏమిటీ లింకు?

ప్రపంచంలో చాలా దేశాలు పేపర్ కరెన్సీ వాడుతున్నాయి. ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు కరెన్సీ ముద్రణ అధికారం కలిగి ఉంటాయి. అయితే కరెన్సీ విలువకు ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు హామీ ఇస్తాయి. కరెన్సీ విలువకు సమానంగా బంగారం నిల్వలు పెంచుకుని, ముద్రణ మొదలెడుతుంది. అలాగే మన దేశంలోనూ రిజర్వు బ్యాంకు ఏటా 3 లక్షల కోట్ల కరెన్సీ ముద్రిస్తుంది. అందుకు సమానమైన బంగారం కూడా కొనుగోలు చేస్తుంది.

ద్రవ్యోల్భణం అదుపు చేయడంలో బంగారం ఉపయోగపడుతుంది. కరెన్సీ విలువను కాపాడుకోవడం, ద్రవ్యోల్భణానికి వ్యతిరేకంగా హెడ్జ్ ఫండుగా ఉపయోగపడుతుంది. బంగారం నిల్వలు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతాయి. అంతే కాదు బంగారం ధరలు వేగంగా పెరగడంతో విలువ పెరిగి, రిజర్వు బ్యాంకు భారీ లాభాలు ఆర్జిస్తోంది.ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో రిజర్వు బ్యాంకు రూ.60 వేల కోట్ల డివిడెండును కేంద్ర ప్రభుత్వానికి అందించింది.

ఏ దేశం వద్ద ఎంత బంగారం నిల్వ ఉందంటే

అగ్రరాజ్యం అమెరికా వద్ద అత్యధికంగా 8133 టన్నుల బంగారం నిల్వలున్నాయి. తరవాత 7 వేల టన్నులతో జర్మనీ రెండవ స్థానంలో ఉంది. చైనా 2204 టన్నులు, భారత్ 880, టర్కీ 626 టన్నులు, కజికిస్థాన్ 291 టన్నులు, జోర్డాన్ 73 టన్నుల బంగారం నిల్వలు కలిగి ఉన్నాయి. పోలండ్ వద్ద కూడా భారీగా బంగారం నిల్వలున్నాయి. అయితే అధికారిక సమాచారం మాత్రం అందుబాటులో లేదు.

బంగారం ధర ఎవరు నిర్ణయిస్తారు?

బంగారం ధర దూసుకుపోతోంది. భారీగా పడిపోయింది అంటూ వార్తలు వింటూ ఉంటాయి. అయితే అసలు ఈ బంగారం ధర నిర్ణయించేది ఎవరు? అని అనుమానం ఎప్పుడైనా వచ్చిందా? అసలు బంగారం ధర ఎక్కడ నిర్ణయిస్తారో పరిశీలిద్దాం.

బంగారం ధర ప్రపంచ మార్కెట్లో సరఫరా, డిమాండ్ ద్వారా ప్రభావితమవుతుంది. ఇది యునైటెడ్ స్టేట్స్‌లోని కామెక్స్, బ్రిటన్‌లోని లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ వంటి ప్రధాన మార్కెట్‌లలో ధర నిర్ణయిస్తారు.. ఈ సంస్థలు ట్రేడెడ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టుల ఆధారంగా ధరలను లెక్కిస్తాయి. ప్రస్తుత, స్థిర ధరలను లెక్కించి సగటు ధర ప్రకటిస్తారు. స్పాట్ ధరను గోల్డ్ ఫ్యూచర్స్ డెరివేటివ్ మార్కెట్లలో సరఫరా, డిమాండ్ గణాంకాల ఆధారంగా లెక్కిస్తారు.

డిమాండ్, కరెన్సీ హెచ్చుతగ్గులలో మార్పులను పరిగణనలోకి తీసుకుని, ప్రత్యక్ష బంగారం ధరను రూపొందింస్తారు. LBMA బంగారం ధరను ప్రతిరోజూ రెండుసార్లు, UK సమయం ప్రకారం ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ఎలక్ట్రానిక్ వేలం ద్వారా నిర్ణయిస్తుంది. నిమిషానికి నిమిషానికి హెచ్చుతగ్గులను గమనించడానికి, పెద్ద ఆర్డర్‌ల కోసం ఈ ధర ఉపయోగించబడుతుంది.

భారతదేశంలో, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఈ కింది ఫార్ములా ఉపయోగించి బంగారం ధరలను లెక్కిస్తుంది: MCX వద్ద బంగారం ధర = (అంతర్జాతీయ బంగారం ధర x USD నుండి రూపాయి మార్పిడి రేటు ఆధారంగా నిర్ణయిస్తుంది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ కూడా భారతదేశంలో బంగారం ధరలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. డిమాండ్ ,సరఫరా, కరెన్సీ బలం, దిగుమతి ఛార్జీలు, మార్కెట్ సెంటిమెంట్ అన్నీ బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.

Tags: #todaygoldrateandhratodaynewsSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు
general

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం
general

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి
general

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?
general

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

Latest News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.