Thursday, June 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

Phaneendra by Phaneendra
Jun 3, 2025, 02:15 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మీకు మర్కజ్ రవి అనే పేరు గుర్తుందా? మర్కజ్ అంటే ముస్లిముల మతపరమైన సమావేశం. రవి అనేది సాధారణంగా హిందువులు పెట్టుకునే పేరు. అలాంటిది ఆ రెండింటికీ ముడి ఎలా పడింది? తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికగా చెప్పుకునే ఈనాడు, మర్కజ్‌ సమావేశానికీ రవి అనే వ్యక్తికీ ముడి పెట్టింది.

 

‘మర్కజ్ రవి’ కథ:

కోవిడ్ మహమ్మారి ప్రారంభ దశలో ఉన్న సమయంలో, అంటే 2020 మార్చి 13న ఢిల్లీలో జరిగిన ముస్లిముల సమావేశం (మర్కజ్) జరిగింది. దానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి కొన్ని వేలమంది వెళ్ళారు. వారిలో చాలామందికి కరోనా వ్యాధి సోకింది. వారి ద్వారా మరికొన్ని వేల మందికి ఆ మహమ్మారి సోకింది. అలా ఢిల్లీ వెళ్ళిన వారిలో హైదరాబాద్ అమీర్‌పేట్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. సహజంగానే, అతనొక ముస్లిం వ్యక్తి. మార్చి 13న జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆ వ్యక్తి, మార్చి 18న హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. 14 రోజుల హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. క్వారంటైన్ పూర్తయిన కొద్ది రోజులకు పరీక్షలు చేసినప్పుడు అతనికి  అనూహ్యంగా కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. అతని ద్వారా మరెంతో మందికి ఆ మహమ్మారి సోకింది.

ఆ సంఘటనకు సంబంధించి ఈనాడు పత్రిక ప్రచురించిన వార్తలో ఆ వ్యక్తి పేరు ‘రవి’ అని రాసింది. మర్కజ్ కోసం ‘రవి’ ఢిల్లీ వెళ్ళి వచ్చాడనీ, అతనికి కోవిడ్ సోకిందనీ రాసుకొచ్చింది. అయితే మర్కజ్ అంటే ముస్లిముల మతపరమైన సమావేశం అన్న సంగతిని మాత్రం రాయలేదు. ఆ సమావేశానికి వెళ్ళిన వ్యక్తి ఒక ముస్లిం అని రాయలేదు. బాధితుల పేర్లు బైటపెట్టకూడదు అనే నియమం ప్రకారం సదరు కోవిడ్ సోకిన వ్యక్తి పేరును మార్చి రాసారు, ఆ విషయాన్ని వెల్లడించారు. అయితే ముస్లిం వ్యక్తికి హిందూ పేరు పెట్టడం దేనికి సంకేతం? అతను వెళ్ళిన సమావేశం ముస్లిం మతానికి సంబంధించినది అన్న విషయం మెజారిటీ ప్రజలకు తెలియని తెలుగు రాష్ట్రాల్లో చెలామణీలో ఉన్న ఆ దినపత్రిక, సదరు వ్యక్తికి హిందూ పేరు పెట్టడం వల్ల జనాల్లో ఏ రకమైన అభిప్రాయం కలుగుతుంది?

 

నిందితుల పేర్లు దాచడం దేనికి?

హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల్లోని పత్రికల్లో ముస్లిం ప్రాబల్యం ఉండే ప్రాంతాల్లో కొన్ని రకాల నేర వార్తలు ప్రచురితమవుతుంటాయి. వాటిలో ఒక తాంత్రికుడు మహిళలకు దయ్యాలు వదులుస్తానని నమ్మించి వారిని లైంగికంగా లోబరచుకోవడం, వేధించుకోవడం లాంటి వార్తలు తరచుగా కనిపిస్తాయి. హైదరాబాద్ పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో అలాంటి వార్తలు వెలుగు చూస్తుంటాయి. అలాంటి వార్తలను నిశితంగా చూస్తే, చాలా వరకూ కేసుల్లో సదరు తాంత్రికుడు ముస్లిం వ్యక్తి అయి ఉంటాడు. కానీ పత్రికలు మాత్రం ఉద్దేశ పూర్వకంగా తాంత్రికుడు, బాబా అనే పదాలు ఉపయోగించి, ఆ వార్తను ప్రచురిస్తాయి. అలాంటి సంఘటనలు సర్వసాధారణం అయిపోయాయి.

‘కొన్ని రకాల వార్తల్లో బాధితుడి పేరు బైటపెట్టకూడదు’ అనే నియమం మంచిదే. కానీ ఆ పేరు హిందువుదే ఎందుకు అయి ఉంటుంది? ఏ క్రైస్తవ పేరో లేక ముస్లిం పేరో అయి ఉండవచ్చు కదా… అలా మాత్రం జరగదు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి మర్కజ్ కరోనా కేసులో బాధితుడి పేరు బైట పెట్టకూడదంటే ఏ అబ్దుల్ అనో కరీం అనో నయీం అనో పెట్టవచ్చు కదా… అలా రాయలేదు. అలాగే తంత్రగాళ్ళు, దొంగ బాబాలు అని రాసే బదులు ఫకీర్, మౌల్వీ, మౌలానా అనే పదాలు వాడవచ్చు కదా. అలాగే క్రైస్తవ పాదరీల అకృత్యాల గురించి రాసేటప్పుడు కూడా మతగురువు అని రాస్తారు. అదంతా ఏంటంటే… హిందూ మత పెద్దలు దొంగలు, మోసగాళ్ళు,  నేరగాళ్ళు అని పరోక్షంగా ప్రచారం చేయడం… హిందూ మతానికి చెందిన వాళ్ళ గురించి స్వయంగా హిందూ మతస్తులలోనే నమ్మకం లేకుండా చేయడం. అది ఉద్దేశపూర్వకమా, యాదృచ్ఛికమా అన్నది చెప్పడం కష్టమే. కానీ మౌలికంగా పాఠకుల మనసుల్లో హిందూ మతం అంటే ఒక రకమైన తేలిక భావం, చులకన భావం, క్రమంగా హిందుత్వం అంటే విముఖత కలిగేలా అలాంటి వార్తలు ఉంటున్నాయి.

ఈ రకమైన ప్రచారం కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామమే. రకరకాల నేరాలకు పాల్పడిన ముస్లిం పీర్లు, మౌలానాలు, ఫకీర్లను తాంత్రికుడు లేక బాబా అని వ్యవహరిస్తూ వార్తలు రాసిన సందర్భాలు కోకొల్లలు. అలాంటి రాతలను చదివే పాఠకుల మనసుల్లో హిందూ మతగురువుల పట్ల విద్వేష భావం పెచ్చరిల్లుతుంది. అలాంటి కొన్ని ప్రధానమైన సంఘటనల వివరాలు చూద్దాం….

 

(1) మంద్‌సౌర్, మధ్యప్రదేశ్‌:

ముబారక్ మన్సూరీ అనే వ్యక్తి చేతబడి, బాణావతి వంటి వాటిని వదిలిస్తాననే సాకుతో హిందూ మహిళలను లొంగదీసుకునేవాడు. వారితో అనునయంగా మాట్లాడి ప్రేమ ముగ్గులోకి దింపేవాడు. బాధిత మహిళలకు తెలియకుండా వారికి మత్తు పదార్ధాలు ఇచ్చేవాడు. వారు తెలివి కోల్పోయాక వారిని మానభంగం చేసేవాడు. అలా కనీసం 50 మంది మహిళలను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

2025 మే 20న ఒక బాధిత మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో పోలీసులు మే 22న అతని ఇంట్లో సోదాలు చేసారు. ఆ రోజే అతన్ని అరెస్ట్ చేసారు. మే 24న కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కణ్ణుంచి జైలుకు పంపించారు.

మంద్‌సౌర్‌ జిల్లాలో సంచలనం కలిగించిన ఈ కేసు గురించి మే 29న ప్రముఖ హిందీ పత్రిక దైనిక్ భాస్కర్ ఒక కథనం ప్రచురించింది. ‘‘తాంత్రికుడి వేటుకు బలైన 40-50 మంది మహిళలు’’ అన్నది ఆ కథనం శీర్షిక. ఎంపీ 44 న్యూస్ అనే స్థానిక న్యూస్ ఛానెల్ కూడా అలాగే హెడ్‌లైన్ పెట్టింది. ‘‘భర్తపై పిచ్చివాడు అనే ముద్ర వేసి మహిళను లైంగికంగా వేధించిన తాంత్రికుడు’’ అన్నది ఆ ఛానెల్ శీర్షిక. స్టేట్ మిర్రర్ అనే పత్రిక ‘‘మంత్ర తంత్రాల పేరుతో ప్రేమ వల : 40-50 మంది హిందూ మహిళలపై అత్యాచారం చేసిన తాంత్రికుడు’’ అనే కథనాన్ని ప్రచురించింది.

 

(2) మేరఠ్, ఉత్తరప్రదేశ్:

చేతబడి వదిలిస్తానంటూ రషీద్ ఖాన్ అనే వ్యక్తి 17 ఏళ్ళ హిందూ బాలికను లొంగదీసుకున్నాడు. ఆ అమ్మాయి తెచ్చిన కొన్ని లక్షల రూపాయల నగదు, ఆభరణాలూ, విలువైన వస్తువులూ తీసుకున్నాడు. తర్వాత ఈ అమ్మాయిని వదిలిపెట్టి  పరారైపోయాడు. అతని అకృత్యాలు వెలుగు చూడడంతో, రషీద్ ఖాన్ పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు ఈ యేడాది జనవరి 25న అతన్ని, అతని సహాయకులు ముగ్గురినీ అరెస్ట్ చేసారు.

ఆ సంఘటన గురించి ఈటీవీ భారత్ 2025 జనవరి 11న కథనం ప్రసారం చేసింది. దానికి ‘‘మేరఠ్‌లో మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన మంత్రగాడు, మంత్ర తంత్రాల పేరిట నగదు, నగలతో పరారీ’’ అని హెడ్‌లైన్ పెట్టింది.

అదే రోజు ‘దైనిక్ భాస్కర్’ పత్రిక దాదాపు అలాంటి పతాక శీర్షికతోనే కథనం ప్రచురించింది. ‘‘మేరఠ్‌లో మైనర్ అమ్మాయి కిడ్నాప్,  దుష్టశక్తుల నుంచి కాపాడే పూజల పేరుతో లొంగదీసుకున్న మంత్రగాడు, 6 లక్షల నగదు, ఆభరణాలూ ఎత్తుకుపోయాడు’’ అని ఆ శీర్షిక.

ఆజ్‌తక్‌ ఛానెల్ 2025 జనవరి 12న కథనం ప్రసారం చేసింది. దాని హెడ్‌లైన్ ‘‘మైనర్ అమ్మాయిని లేపుకుపోయిన మంత్రగాడు, అతనికి ఆరుగురు పిల్లలు’’. 

అదే రషీద్ ఖాన్ కేసు గురించి టీవీ9 భారత్‌వర్ష్ 2025 జనవరి 13న కథనం ప్రసారం చేసింది. దాని శీర్షిక ‘’17 ఏళ్ళ అమ్మాయిని  మంత్రగాడు అర్ధరాత్రి పిలిపించుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మర్నాడు పెద్ద గొడవ జరిగింది. ఎందుకో తెలుసా?’’ ఆ కథనానికి సంబంధించిన థంబ్‌నెయిల్‌లో పట్టుపంచె కట్టుకున్న ఓ వ్యక్తి ఓ అమ్మాయి నెత్తిమీద చెయ్యి పెట్టి ఉన్నట్లు ప్రచురించారు. దాన్ని చూస్తే ఓ హిందూ మాంత్రికుడు అమ్మాయిని ఏదో చేస్తున్నాడు అనే ఉద్దేశం కలిగేలా ఉంది.

ఇంకా మరిన్ని మీడియా సంస్థలు ఆ కథనం గురించి అలాగే ప్రచారం చేసాయి. నిజానికి రషీద్ ఖాన్ ముస్లిమే తప్ప హిందువు కాదు. హిందూ బాలికలను ఆకట్టుకుని ప్రలోభపెట్టి వారిని లొంగదీసుకుని నగలు, నగదు ఎత్తుకుపోవడం అతని పద్ధతి. మీడియా సంస్థలు మాత్రం మైనర్ అమ్మాయిని ఎత్తుకుని పోయిన మాంత్రికుడు/మంత్రగాడు అన్న కోణంలో కథనం ప్రసారం చేసారు.

 

(3) ఢిల్లీ:

ఇది 2024 ఆగస్టు నాటి ఘటన. మహమ్మద్ షరీఫ్ అనే దుర్మార్గుడు 12ఏళ్ళ అమ్మాయిని శ్మశానంలోకి తీసుకెళ్ళి ఆ చిన్నారిని మానభంగం చేసాడు. ఆ చిన్నపిల్లకు దెయ్యం పట్టిందని, దానివల్లనే ఆమె తండ్రికి అనారోగ్యం కలిగిందని, ఆ దెయ్యాన్ని వదిలిస్తాననీ నమ్మబలికి ఆ బాలికను శ్మశానానికి తీసుకువెళ్ళాడు. వాడే ఒక దెయ్యంగా మారి ఆ చిన్నారి జీవితాన్ని బుగ్గిపాలు చేసాడు. పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నిందితుడు షరీఫ్‌ను అరెస్ట్ చేసారు. మీడియా యధావిధిగా ఈ కేసు విషయంలో కూడా నిందితుడు ముస్లిం మతస్తుడు అనే విషయం తెలియకుండా జాగ్రత్త పడింది.

అమర్ ఉజాలా ఆగస్టు 28న ప్రచురించిన వార్తకు ‘పన్నెండేళ్ళ బాలికపై మంత్రగాడి ఘాతుకం, తండ్రి జబ్బు నయం చేస్తానని చెప్పి దారుణం’ అని పతాకశీర్షిక ఉంచింది. ఇండియా టుడే పత్రిక కూడా అదేరోజు ‘చేతబడికి విరుగుడు పేరిట చిన్నారిపై శ్మశానంలో అఘాయిత్యానికి పాల్పడిన ఢిల్లీ మంత్రగాడు’ అనే శీర్షికతో వార్త ప్రచురించింది. ఏబీపీ న్యూస్ ఛానెల్ ఆగస్ట్ 29న ప్రసారం చేసిన వార్తకు ‘ఢిల్లీలో మంత్రగాడి దారుణం, శ్మశానంలో 12ఏళ్ళ చిన్నారి బాలికపై బలాత్కారం, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపు’ అని హెడ్‌లైన్ పెట్టింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ‘12ఏళ్ళ చిన్నారిని చిదిమేసిన 52ఏళ్ళ మాంత్రికుడి అరెస్ట్’ అనే శీర్షికతో వార్త ప్రచురించింది. దాని సోదర సంస్థ ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’12 ఏళ్ళ అమ్మాయిని లైంగికంగా వేధించిన మంత్రగాణ్ణి పట్టుకున్న పోలీసులు’ అని హెడ్‌లైన్ పెట్టింది.

 

(4) ముంబై, మహారాష్ట్ర:

మెహదీ కాశిం షేక్ అలియాస్ మెహదీ హసన్‌ ఆరుగురు మైనర్ బాలికలు సహా ఏడుగురు అమ్మాయిలను రేప్ చేసాడు. ఈ కేసులో కూడా నిందితుడు మంత్రతంత్రాల పేరుతో జనాలను మోసం చేసాడు. నవంబర్ 2010లో నిందితుణ్ణి పోలీసులు అరెస్ట్ చేసారు. 2016 ఏప్రిల్‌లో జీవిత ఖైదు శిక్ష పడింది.

ఆ వార్త గురించి 2016 ఏప్రిల్ 13న నవభారత్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. ‘‘ఆరుగురు మైనర్లు సహా ఏడుగురిని రేప్ చేసిన ‘బాబా’కు జీవిత ఖైదు’’ అన్నది దాని శీర్షిక.  తర్వాత 2024 మార్చి 4న లైవ్ లా వెబ్‌సైట్‌లో ఆ ఘటన గురించి ఒక కథనం ప్రచురించారు. మెహదీ కాశిం షేక్‌కు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను బొంబాయి హైకోర్టు సమర్థిస్తూ తీర్పునిచ్చిన సందర్భం అది. అప్పుడు ప్రచురించిన ఆ కథనానికి ‘‘ప్రజల మూఢ విశ్వాసాల నుంచి లబ్ధి పొందే బాబా’’ అని హెడ్డింగ్ పెట్టింది. 2024 మార్చి 5న టీవీ9 భారత్‌వర్ష ఛానెల్ కథనం ప్రసారం చేసింది. దానికి ‘‘మంత్ర తంత్రాల తర్వాత రేప్ చేస్తాడు… ఆరుగురు చిన్నపిల్లలని రేప్ చేసిన మంత్రగాడు… ఇకపై జీవితమంతా జైల్లోనే’’ అని హెడ్‌లైన్ పెట్టింది.

 

(5) ముంబై, మహారాష్ట్ర

అబూబకర్ మొహమ్మద్ అలీ షేక్ పంథా చాలా తేడా. క్యాన్సర్ తగ్గించేస్తా అని హామీలు ఇచ్చేస్తాడు. అమెరికా వీసా ఇప్పించడానికి సాయం చేస్తా అంటాడు. మాటలతో కోటలు కట్టేస్తాడు. ఇతని బాధితుల్లో అత్యధికులు ముస్లిం మహిళలే ఉండడం గమనార్హం. 2024లో అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసారు.

ఆ వార్తను హిందుస్తాన్ టైమ్స్ పత్రిక 2024 ఫిబ్రవరి 1న ప్రచురించింది. దానికి పెట్టిన శీర్షికలో యధావిధిగా మంత్రగాడు అని పేర్కొంది. ‘క్యాన్సర్ నయం చేస్తా, యుఎస్ వీసా ఇప్పిస్తా అంటూ మహిళలను మోసం చేసినందుకు మంత్రగాడి అరెస్ట్’ అన్నది ఆ శీర్షిక.

 

(6) అమ్రోహా, యూపీ:

గుర్తు తెలియని వ్యాధికి చికిత్స చేస్తామంటూ ఒక పదిహేనేళ్ళ బాలికను గ్యాంగ్‌రేప్ చేసారు నలుగురు దుర్మార్గులు. ఆ సంఘటన 2021 జులైలో జరిగింది. నిందితుల పేర్లు అఫ్జల్ మలిక్, తారిక్, అస్లమ్, జుల్ఫికర్. వాళ్ళు నలుగురూ ముస్లిములే అయినప్పటికీ హెడ్‌లైన్స్ చదివితే లేక వింటే ‘వాళ్ళెవరో హిందువులే ఆ ఘాతుకానికి పాల్పడ్డారు’ అని ప్రజలు పొరబడడం ఖాయం.

2021 జులై 6న ‘లైవ్ హిందుస్తాన్’ ఛానెల్‌లో ఈ నేరం గురించిన వార్త ప్రసారం చేసారు. ‘‘తంత్ర మంత్రాలతో రోగాలు తగ్గిస్తామంటూ అమ్రోహాలో బాలిక మానభంగం, నలుగురు దుండగులపై కేసు నమోదు, దర్యాప్తు మొదలు’’ అని హెడ్‌లైన్ పెట్టారు. అలా నేరస్తులను మాంత్రికులుగా పరిచయం చేయడం ద్వారా వారు హిందూ మతస్తులు అనే భ్రమ కలిగించారు. జులై 7న ఆజ్‌తక్‌లోనూ అదే రకమైన కథనం ప్రసారమైంది. ‘‘చికిత్స పేరుతో మైనర్ బాలికను గ్యాంగ్‌రేప్ చేసిన మాంత్రికులు, పరారీలో నిందితులు’’ అన్నది దాని హెడ్‌లైన్. జులై 7నే టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఈ కథనాన్ని ప్రచురించింది. ‘‘రోగంతో బాధపడుతున్న 15ఏళ్ళ అమ్మాయిపై బలాత్కారం చేసిన మంత్రగాడు, అతని శిష్యులు’’ అన్నది వారి హెడ్‌లైన్. టైమ్స్ నౌ ఛానెల్ కూడా తక్కువేమీ తినలేదు. ‘‘చికిత్స సాకుతో అమ్రోహా అమ్మాయిని రేప్ చేసిన మేరఠ్ మంత్రగాడు’’ అనే హెడ్‌లైన్‌తో జులై 7న కథనం ప్రసారం చేసింది.

 

(7) లఖ్‌నవూ, ఉత్తరప్రదేశ్:

2020లో లఖ్‌నవూ నగరంలో ఓ మజార్‌లో సెక్స్ రాకెట్ పట్టుబడింది. మజార్ అంటే అరబిక్‌లో సమాధి క్షేత్రం అని అర్ధం. ముస్లిములు తాము గొప్పవారిగా భావించే వారి సమాధులను పుణ్యక్షేత్రాలుగా భావించి అక్కడ ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి చోట పనిచేస్తున్న నాసిర్ అక్కడకు వచ్చే మహిళలను చికిత్స పేరిట లైంగికంగా వేధించేవాడు. అంతేకాదు, ఆ మజార్‌లోనే వ్యభిచార ముఠా కూడా నడుపుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసి నాసిర్‌ను అరెస్ట్ చేసారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఆ వార్తను ప్రచురించింది. షరా మామూలుగానే ఆ కథనానికి ‘‘మంత్రగాడి లైంగిక వేధింపుల వీడియో వైరల్ అవడంతో అరెస్టు చేసిన పోలీసులు’’ అనే హెడ్‌లైన్ పెట్టింది.

 

(8) నయాపురా, మధ్యప్రదేశ్:

2020 జూన్ నెల. అంటే కోవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయం. మధ్యప్రదేశ్‌ రత్లాం జిల్లాలోని నయాపురా ప్రాంతంలో అస్లం అనే ఒక ముస్లిం గురువు ఉండేవాడు. అతను ఎవరి చేతి మీద ముద్దు పెట్టుకుంటే వాళ్ళకి కరోనా వైరస్ సోకదు అని ప్రచారం చేసుకున్నాడు. దాంతో అతన్ని నమ్మే భక్తులు ఎగబడి వెళ్ళారు. అతని చేతిని ముద్దాడి తమకు కరోనా వైరస్ సోకదు అనే నమ్మకంతో ఆనందంగా ఉన్నారు. అయితే, అస్లంకే కరోనా వైరస్ సోకినట్లు తెలిసింది. అంతే కాదు, కోవిడ్ మహమ్మారి కారణంగా అస్లం 2020 జూన్ 4న చనిపోయాడు. అస్లం మరణంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అతని దగ్గరకు వచ్చేవారి వివరాలు కనుక్కుని వారందరికీ టెస్టులు చేయించారు. ఆ పరీక్షల్లో 29మందికి కరోనా వైరస్ సోకిందని వెల్లడైంది. అస్లం సంఘటన తర్వాత నయాపురా, రత్లాం ప్రాంతాల్లో ఇలాంటి ముస్లిం గురువులు 37మందిని క్వారంటైన్ చేసారు.

ఇంత ప్రమాదకరమైన సంఘటన విషయంలో కూడా సదరు వ్యక్తి ముస్లిం అన్న విషయాన్ని మీడియా యథాశక్తి దాచిపెట్టింది. ‘చేతి మీద ముద్దు పెట్టే బాబా’ అనే కోణానికే ప్రాధాన్యం ఇచ్చింది. బాబాలు, గురువుల్లో ఇలాంటి మోసగాళ్ళు మాత్రమే ఉంటారు అనే భావన ప్రజల్లో కలిగించేలా చేసింది. వారు ముస్లిములు అనే విషయాన్ని దాచిపెట్టడం ద్వారా హిందూ మత గురువులు, బాబాలు మాత్రమే అలాంటి పనులు చేస్తారని పరోక్షంగా అర్ధమయేలా చేసింది.

ప్రభాత్ ఖబర్ పత్రిక ‘‘చేతిని ముద్దాడి కరోనాకు బాబా చికిత్స, ఆయన దగ్గరకు వెళ్ళిన 19మందికి కరోనా పాజిటివ్, ప్రజల్లో భయాందోళనలు’’ అనే శీర్షిక పెట్టింది. ఆజ్‌తక్ ఛానెల్ ‘‘చేతిమీద ముద్దుపెట్టి ‘వైద్యం’ చేసే బాబా కరోనాతో మృతి, 29మంది భక్తులకూ కరోనా పాజిటివ్’’ అని హెడ్‌లైన్ రన్ చేసింది. ఎన్‌డిటివి ఇండియా ఛానెల్ ‘‘చేతిమీద ముద్దుతో చికిత్స చేసే మంత్రగాడు కరోనాతో మృతి, ఆయననుంచి 23మందికి సంక్రమించిన కోవిడ్, మరో 37మంది బాబాలను క్వారంటైన్ చేసిన యంత్రాంగం’’ అని శీర్షిక ఉంచింది.

 

(9) నదియా, పశ్చిమ బెంగాల్:

బెంగాల్‌లోని నదియా జిల్లా కామ్‌ఠాల్‌బేరియా గ్రామంలో అల్పనా బీబీ అనే ఒక ఆడ ముస్లిం ఫకీర్ ఉండేది. మంత్రతంత్రాలతో చికిత్స చేస్తానంటూ ఆమె ప్రజలను ఆకట్టుకునేది. 2019 సెప్టెంబర్‌లో అర్ఫినా బీబీ అనే మహిళ తన పిల్లలను అల్పనా బీబీ దగ్గరకు తీసుకువెళ్ళింది. పదేళ్ళ పిల్లవాడు జాన్ నబీ షేక్, ఆరేళ్ళ పిల్లవాడు జహంగీర్ షేక్‌లకు ఆమె చికిత్స చేసింది. అయితే జాన్ నబీ షేక్ చనిపోయాడు. జహంగీర్‌కు ఒళ్ళంతా గాయాలయ్యాయి. పిల్లలను తీసుకువెళ్ళడానికి వచ్చిన తల్లిదండ్రులు ఆ విషయం తెలిసి నిర్ఘాంత పోయారు. ఆ పిల్లల శరీరాలను తనిఖీ చేస్తే… వాళ్ళ వీపుల మీద కాలిన గాయాలు ఉన్నాయి. ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే అల్పనా బీబీ చికిత్ పేరిట ఆ పిల్లల వీపుల మీద వేడివేడి నూనె పోసింది. దాని మీద కారం చల్లింది. ఆ మంట తట్టుకోలేక జాన్ నబీ షేక్ ప్రాణాలు వదిలేసాడు. విషయం బైటపడేసరికి కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలు అల్పనా బీబీని అరెస్ట్ చేసారు.

మీడియా తన పని తాను చేసుకుంటూ పోయింది. నిందితురాలి ఉనికిని దాచిపెట్టి ఓ మంత్రగత్తె అంటూ ముద్ర వేసేసింది. ‘‘పశ్చిమ బెంగాల్‌లో మైనర్ బాలుడి మరణం, మంత్రగత్తె అరెస్ట్’’ శీర్షికతో  హిందుస్తాన్ టైమ్స్ పత్రిక వార్త ప్రచురించింది. ‘‘తంత్ర పూజల కారణంగా పశ్చిమ బెంగాల్‌లో పదేళ్ళ బాలుడి మరణం’’ అని ఎన్‌డీటీవీ ఛానెల్ కథనాన్ని ప్రసారం చేసింది. ‘‘పదేళ్ళ బాలుడి మరణంతో మంత్రగత్తె అరెస్ట్’’ అని ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది. యథావిధిగా ఈ మీడియా సంస్థలన్నీ నిందితురాలు ముస్లిం మహిళ అన్న విషయాన్ని దాచి పెట్టాయి.

 

(10) బిలాస్‌పూర్, ఛత్తీస్‌గఢ్:

2019 మే నెలలో సంఘటన ఇది. ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌కు చెందిన ఒక 34 ఏళ్ళ మహిళకు భర్తతో విభేదాలు వచ్చాయి, అతను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా మరికొన్ని కుటుంబ సమస్యలూ ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం ఆమె అస్లం ఫైజీ అలియాస్ సుహైల్ రజా అనే 28 ఏళ్ళ మౌల్వీని ఆశ్రయించింది. అతను ఆవిడ సమస్యను పరిష్కరిస్తానని మాటిచ్చాడు. ఆ క్రమంలో మౌల్వీ దగ్గరకు వెడుతుండేది. దాన్ని అలుసుగా తీసుకున్న ఆ మౌల్వీ, ఆ మహిళను బెదిరించి ఆమెపై అఘాయిత్యం చేసాడు. కొన్ని రోజుల్లోనే ఆమె సమస్యలు పరిష్కారమైపోతాయి అని మభ్యపెట్టాడు. మౌల్వీ చెప్పిన గడువు గడిచిపోయినా ఆ మహిళ భర్త తిరిగి రానూ లేదు, ఆమె కుటుంబ సమస్యలూ పరిష్కారం కాలేదు. మౌల్వీ తనను మోసం చేసాడనీ, శారీరకంగా వాడుకున్నాడనీ అర్ధమయ్యాక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మౌల్వీని అరెస్ట్ చేసారు. 

ఈ వార్తను నయీ దునియా పత్రిక 2019 మే 26న ప్రచురించింది. యధావిధిగా, మహిళపై అఘాయిత్యం చేసిన మంత్రగాడు అని రాసుకొచ్చింది. అంతే కాదు, ఆ కథనానికి వాడిన బొమ్మలో రుద్రాక్షలు ధరించి, పట్టుబట్టలు కట్టుకుని నుదుట కుంకుమ బొట్టు పెట్టుకున్న వ్యక్తి చిత్రాన్ని ప్రచురించింది. అంటే హిందూ మంత్రగాడు మహిళను లోబరచుకుని బలవంతంగా ఆమెను అనుభవించాడు అనే అర్ధం వచ్చేలా ఆ కథనం చెప్పకనే చెప్పింది.

 

(11) హర్యానా:                                                    

గుర్గావ్‌ సమీపంలోని సోహ్నా గ్రామానికి చెందిన దీన్ మొహమ్మద్ అలియాస్ దీనూ వయసు 65 ఏళ్ళు. అతనికి ముగ్గురు భార్యలు, పది మంది సంతానం ఉన్నారు. 2002లో అతను స్థానిక గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగానూ పని చేసాడు. తనకు దెయ్యాలు భూతాలను వదిలించగల శక్తి ఉందని, అనారోగ్యాలను బాగు చేస్తానంటూ చెప్పుకుంటూ దీనూ ఆడవాళ్ళను ఆకట్టుకునేవాడు. వాళ్ళను లైంగికంగా వేధించేవాడు. తమ చెడు అనుభవాల గురించి బైటకు చెప్పుకోలేని మహిళలు మౌనంగా ఉండిపోయారు. 2016లో ఒక 19 ఏళ్ళ యువతికి అనారోగ్యంతో బాధ పడుతుంటే తల్లిదండ్రులు ఆమెను దీనూ దగ్గరకు తీసుకువెళ్ళారు. యువతి అనారోగ్యాన్ని తగ్గిస్తాననే వంకతో దీనూ ఆమెను పలుమార్లు బలాత్కరించాడు. అంతే కాదు, ఆ యువతిని చికిత్స కోసం తీసుకువెళ్ళిన ప్రతీసారీ ఆమె తండ్రి దగ్గర నుంచి రూ. 5వేలు వసూలు చేసేవాడు. చివరికి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు 2016 జులై 31న సదర్ గుర్గావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. దాని ఆధారంగా పోలీసులు దీన్ మొహమ్మద్‌ను, అతనికి సహకరించిన దరాబ్ ఖాన్ అనే అనుచరుణ్ణీ అరెస్ట్ చేసారు.

ఈ నేర వార్తను మీడియా యధావిధిగా మంత్రగాడు, మాంత్రికుడు చేసిన నేరం అనే కోణంలోనే ప్రచురించింది. పైగా రుద్రాక్ష మాలలు ధరించి, బొట్టు పెట్టుకున్న మనిషి బొమ్మలు ముద్రించడం ద్వారా నేరస్తుడు ఒక హిందూ మంత్రగాడు అనేలా ప్రజల్లోకి విషయం వెళ్ళేలా చేసారు. ఇంక పతాక శీర్షికల్లో కూడా మంత్రగాడు అనే పద ప్రయోగంతో ఎవరో హిందువే నేరానికి పాల్పడ్డాడు అనే భావం కలిగేలా రాసుకొచ్చారు. బిజినెస్ స్టాండర్డ్, ఇండియాటుడే పత్రికలు ‘‘హర్యానాలో టీనేజ్ యువతిని రేప్ చేసిన మంత్రగాడి అరెస్ట్’’ అని హెడ్‌లైన్ పెట్టాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా ఒకడుగు ముందుకువేసి ‘‘పదిమంది పిల్లల తండ్రి అయిన గుర్‌గావ్ మంత్రగాణ్ణి యువతి రేప్ కేసులో అదుపులోకి తీసుకున్నారు’’ అని రాసుకొచ్చింది.

 

ఉపసంహారం:

ఈ వార్తలన్నీ చూస్తే మనకు అర్ధమయ్యేది ఒకటే. ఈ దేశపు మీడియాకు హిందువులంటే ప్రేమ లేదు. ముస్లిములు చేసిన అకృత్యాలను సెక్యులరిజం ముసుగులో దాచి పెడతారు. చాలా సందర్భాల్లో మాత్రం హిందువులే ఆ నేరాలకు పాల్పడ్డారా అనే అనుమానాలు కలిగేలా చేస్తారు. అలాంటి సంఘటనల విషయంలో పాత్రికేయులు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది.

Tags: BabaHindusIndian MediaMisinformationMuslim ClericsTantrikTOP NEWS
ShareTweetSendShare

Related News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు
general

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం
general

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి
general

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?
general

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

Latest News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.