మెగా డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల చేశారు. ఇప్పటికే cse.ap.gov.inలో అందుబాటులోకి తీసుకువచ్చారు. వాట్సప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.9552300009 నెంబరుకు మెసేజ్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
మెగా డీఎస్సీ రాసే అభ్యర్థులకు విద్యా మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్సీ నిర్వహణ పట్ల కూటమి ప్రభుత్వం నిబద్దత చాటుకుందని మంత్రి స్పష్టం చేశారు. జూన్ 6 నుంచి 30 వరకు మెగా డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 16347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 20 నుంచి
మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మూడున్నర లక్షల మందికిపైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు.