హనీమూన్‌కు వెళ్లిన జంట కనిపించకుండా పోయిన ఘటన మేఘాలయలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఇటీవలే పెళ్లైన ఓ జంట వారం గడచినా తిరిగి రాకపోవడం, ఫోన్ కాల్‌కు స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేఘాలయ ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది.
వేలాది పోలీసులతో గాలింపు చేపట్టినట్లు సీఎం కాన్నాడ్ సంగ్మా వెల్లడించారు.
మధ్యప్రదేశ్ ఇండోర్ నగరానికి చెందిన రవాణా వ్యాపారి రాజారఘువంశీ, సోమన్ ఇటీవలే పెళ్లైన దంపతులు. హనీమూన్ కోసం మే 20న మేఘాలయ వెళ్లారు.మేఘాలయలోని చిరపుంజిలో పర్యటనకు వెళ్లి కనిపించకుండా పోయారు. స్థానికంగా ఓ బైక్ తీసుకుని కొండ ప్రాంతాలకు వెళ్లారు. బైక్ ఓ ప్రాంతంలో వదిలేసి నడుచుకుంటూ అటవిలోకి వెళ్లారు. బైక్ పార్క్ చేసిన ప్రాంతాన్ని పోలీసులు గుర్తించారు. అడవిలో దారితప్పి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మేఘాలయ ప్రభుత్వం ముమ్మర గాలింపు చేపట్టింది. ఆచూకీ చెప్పిన వారికి రూ.5 లక్షల రివార్డు ప్రకటించారు.
మేఘాలయలో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. దీంతో సెర్చ్ ఆపరేషన్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. జంటను వెతికేందుకు సాంకేతిక పరికరాలు వాడుతున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. చిరపుంజిలో అతి భారీ వర్షాలు పడతూ ఉండటంతో వారు ఎక్కడైనా చిక్కుకుపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.