మావోయిస్టు పార్టీకి మరో భారీ దెబ్బ తగిలింది. కీలక నేత కునియం హిడ్మా అలియాస్ మోహన్‌ను ఒడిషా పోలీసులు అరెస్ట్ చేశారు. కోరాపుట్ జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ ఈ విషయాన్ని స్వయంగా మీడియాకు వెల్లడించారు. ఒడిషా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో డీవీఎఫ్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. బోయిపరిగుడ పోలీస్ స్టేషన్ పరిధిలో పెటగుడ గ్రామ సమీపంలో హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 35 రౌండ్లు బుల్లెట్లు, ఏకే 47 రైఫిల్, 117 డిటోనేటర్లు, వాకీ టాకీ, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
ఛత్తీస్‌గఢ్ బీజీపుర్‌కు చెందిన హిడ్మా 2007 నుంచి ఏపీ, ఒడిశాలోని మల్కాన్‌గిరి, కోరాపుట్, ఛత్తీస్‌గఢ్‌లోని సుక్కా, బీజాపూర్ ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొనేవాడు. 2020 నుంచి 2023 వరకు పలు ఎన్‌కౌంటర్‌లతోపాటు అనేక హింస్మాత్మక కార్యక్రమాల్లో పొల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. అతనిపై రూ.కోటి రివార్డు ఉంది.