భారీ బడ్జెట్‌తో తెరకెక్కి, త్వరలో విడుదలకు సిద్దమవుతోన్న కన్నప్ప చిత్రానికి చెందిన హర్డ్‌డ్రైవ్‌ను అనుమతి లేకుండా తీసుకెళ్లారంటూ చిత్ర ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఫిల్మ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.
హైదరాబాద్ కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్‌కుమార్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కన్నప్ప చిత్రానికి సంబంధించిన కీలక కంటెంట్ కలిగిన డ్రైవ్‌ను ముంబైలోని హెచ్‌ఐవిఈ స్టూడియోకు డీటీడీసీ కొరియర్ ద్వారా పంపించారు. ఈ నెల 25న ఆఫీస్ బాయ్ రఘు డ్రైవ్ తీసుకున్నారు. విషయం ఎవరికీ చెప్పకుండా చరిత అనే మహిళకు అప్పగించాడు. రఘు, చరితలపై నిర్మాణ విజయ్ కుమార్ ఫిల్మ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హార్డ్ డ్రైవ్‌లో గంటన్నర సినిమా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.