మొదటి భాగం ఇక్కడ చదవండి
రెండవ భాగం ఇక్కడ చదవండి
చివరి, మూడవ భాగం….
చైనా దూకుడు ధోరణికి భారత్ వ్యతిరేకత :–
సిపిఇసి ప్రాజెక్టుకు భారత్ మొదటినుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. దానికి కారణం… భారత ప్రాదేశిక సమగ్రతను చైనా ఉల్లంఘిస్తుండడమే. పాక్ ఆక్రమిత కశ్మీర్ ద్వారా సిపిఇసి దారులు నిర్మించే ప్రయత్నమే. పాకిస్తాన్ భారతదేశం నుంచి అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాల్లోనుంచి ఆ ప్రాజెక్టును చైనా నడిపిస్తోంది.
2022లో భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి చైనా చర్యలను తీవ్రంగా తప్పుపడుతూ ఒక ప్రకటన విడుదలచేసారు. ‘‘ఆ చర్యలను చేపట్టినది ఏ పక్షమైనా కానివ్వండి, అటువంటి చర్యలు నేరుగా భారతదేశపు సార్వభౌమత్వానికీ, ప్రాదేశిక సమగ్రతకూ భంగం కలిగిస్తున్నాయి. సోకాల్డ్ సిపిఇసిలో భాగంగా, పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన భారతదేశపు భూభాగాల్లో ప్రాజెక్టులు చేపట్టడాన్ని భారత్ దృఢంగా, నిలకడగా వ్యతిరేకిస్తోంది’’ అని ఆ ప్రకటన సారాంశం.
ఆ ప్రాదేశిక వివాదమే భారతదేశపు నిరోధానికి కేంద్రబిందువు. చైనా చర్యలు భారతదేశపు సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే ప్రయత్నాల్లో భాగంగా భారత్ భావిస్తోంది.
పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ విషయాన్ని దాటి ఆలోచిస్తే, చైనా భారతదేశపు ప్రాదేశిక ప్రభావాన్ని చుట్టుముట్టి, దాన్ని కొన్ని స్థానాలకు మాత్రమే పరిమతం చేయాలన్న చైనా స్థూల వ్యూహంలో సిపిఇసి ఒక భాగం అని భారత్ భావిస్తోంది. గ్వదర్ పోర్టు అభివృద్ధి కార్యకలాపాలు అరేబియా సముద్రంలో చైనా తన నౌకాదళం ఉనికిని చాటుకోడానికి చేస్తున్న ప్రయత్నాలే అన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. తద్వారా భారత్ మారిటైమ్ ప్రయోజనాలకు నేరుగా భద్రతా ప్రమాదం వాటిల్లుతోందని భావించవచ్చు. పాకిస్తాన్‌కు చైనా భారీగా మిలటరీ సహాయం అందించింది. అడ్వాన్స్‌డ్ ఫైటర్ జెట్‌లు, క్షిపణి వ్యవస్థలు, సాయుధ నౌకలూ ఇస్లామాబాద్ మిలటరీ సామర్థ్యాలను మరింత పెంచుతూ, భారత్ భద్రతా వాతావరణాన్ని మరింత సంక్లిష్టం చేసాయి.
చైనా దౌత్య విన్యాసాలు సైతం భారత్‌కు వ్యతిరేకంగానేఉన్నాయి. పాక్ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్లకు ప్రపంచస్థాయి ఉగ్రవాదులుగా ఐక్యరాజ్య సమితి గుర్తింపు కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా ఆదిలోనే గండి కొట్టింది. అవే జరిగితే భారత్‌కు భారీ నష్టమే.
సిపిఇసిలో అప్ఘానిస్తాన్ – భారత్ సార్వభౌమత్వానికి ముప్పు :–
సిపిఇసిలో అప్ఘానిస్తాన్‌ను జోడించడం భారతదేశపు వ్యూహాత్మక ఆందోళనలను మరింత పెంచింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటంటే…
· ప్రాంతీయ ప్రభావాన్ని తక్కువ చేయడం: మధ్య ఆసియా దేశాలతో భారత్ దౌత్యపరమైన సంబంధాలు పెరుగుతుండడం మీద చైనా ప్రత్యక్ష స్పందనే ఈ నిర్ణయం. సిపిఇసిలో అప్ఘానిస్తాన్‌ను జోడించడం ద్వారా, భారతదేశం ప్రాదేశిక ఔట్‌రీచ్ కార్యక్రమాలను బలహీన పరిచేందుకు భారత్ తీసుకొచ్చింది.
· శత్రువులకు అండ: ఆ ఒప్పందం చైనా-పాకిస్తాన్-తాలిబన్ అక్షాన్ని బలోపేతం చేస్తుంది. ప్రత్యేకించి, పహల్‌గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ ప్రకటనలను తాలిబన్లు తిరస్కరిం,చిన నేపథ్యంలో ఆ ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ ఏకీకరణలు, భారత వ్యతిరేక శక్తులకు చైనా మద్దతు ఇస్తున్న సంకేతాలే. కాబట్టి, భారత్ ప్రాదేశిక భద్రతా ఫ్రేమ్‌వర్క్‌ను చైనా సవాల్ చేస్తుంది.
· వ్యూహాత్మకంగా చుట్టుముట్టడం: సిపిఇసిని అప్ఘానిస్తాన్ వరకూ పొడిగించడం అనే చర్య భారతదేశపు పొరుగులో చైనా రవాణా, ఆర్థిక ఉనికిని మరింత బలోపేతం చేసింది. వ్యూహాత్మకంగా భారత్‌ను చైనా చుట్టుముడుతోందన్న భావనలను శక్తివంతం చేస్తుంది. సైనిక రవాణా అవసరాలకు వాణిజ్య కార్యకలాపాల ముసుగు తొడగడం భారత్ భద్రత గురించి భయాలను మరింత పెరిగేలా చేస్తోంది.
· భౌగోళిక రాజకీయాల ధ్వంసం: అప్ఘానిస్తాన్‌తో చైనా, పాకిస్తాన్‌ల త్రైపాక్షిక ఒప్పందం ఇటీవల ఆ దేశంతో భారత్ దౌత్య సంబంధాలను తక్కువ చేసే దిశగా సాగే ప్రమాదముంది. మరీ ముఖ్యంగా పహల్‌గామ్ దాడిని కాబూల్ ఖండించింది, ఆ తర్వాతి పరిణామాల్లోనూ అప్ఘాన్ పాలక వర్గం భారత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోంది, భారతదేశ నాయకులతో రాజకీయంగా సంబంధాలు కొనసాగిస్తోంది. అలా, ఆసియాలోని ఇతర దేశాలతో భారత్ సత్సంబంధాలు నిర్మించుకోడానికి చేస్తున్న ప్రయత్నాలకు గండి కొట్టడానికి చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోందన్న విషయం తేటతెల్లంగా వెల్లడయింది.
చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌ను అప్ఘానిస్తాన్ వరకూ విస్తరించే చర్య ఆ దేశం నిస్సిగ్గుగా భౌగోళిక రాజకీయాల్లో కుయుక్తులు పన్నుతోందనడానికి నిదర్శనం. సిపిఇసి విస్తరణ కార్యక్రమంతో దక్షిణ, మధ్య ఆసియా ప్రాంతాలను కొల్లగొట్టడానికి, తన ఆధిపత్యాన్ని స్థాపించుకోడానికీ చైనా చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచానికి వెల్లడి అయ్యాయి. ఈ ప్రాజెక్టు పుణ్యమా అని పాకిస్తాన్ ఇప్పటికే చైనా అప్పుల ఊబిలో పీకల వరకూ కూరుకుపోయింది, బీజింగ్ ఉక్కు పిడికిలి నుంచి ఇస్లామాబాద్ ఎప్పటికీ బైటపడలేదన్న సంగతి స్పష్టమైపోయింది. కళ్ళ ముందు పాకిస్తాన్ ఉదాహరణ కనిపిస్తున్నా ఇప్పుడు అప్ఘానిస్తాన్ కూడా మళ్ళీ అదే బాట పడుతోంది. ఆ దేశపు వనరులను కొల్లగొట్టడానికి చైనా విసిరిన వలలో తెలిసి తెలిసీ అప్ఘానిస్తాన్ చిక్కుకుంటోంది.
భారతదేశం విషయానికి వస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా సిపిఇసి నిర్మాణం, దాన్ని అప్ఘానిస్తాన్ వరకూ పొడిగించడం అనే చర్యల ద్వారా చైనా భారత్ సార్వభౌమత్వం మీద ప్రత్యక్ష దాడికి పాల్పడుతోంది, అలాగే ఆసియా ప్రంతంలో భారత్ ప్రభావాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తోంది. నోటితో మాత్రం శాంతి సుస్థిరతల పాట పాడుతున్నా, చైనా కార్యాచరణ చూస్తుంటే భారత్ చుట్టూ ఉన్న దేశాలను చాలా దూకుడుగా కబ్జా చేస ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది, ఆ క్రమంలో పాకిస్తాన్, అప్ఘాన్ తాలిబన్ వంటి ప్రతికూల శక్తులకు అండగా నిలుస్తోందన్న సంగతి కళ్ళముందు విస్పష్టంగా కనిపిస్తోంది.
(సమాప్తం)