పహల్గాం ఉగ్రదాడి తరవాత పాక్, భారత్ మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఉగ్రమూకల నిర్మూలనకు ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్, పాక్‌పై పలు ఆంక్షలు విధించింది. అందులో భాగంగా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది, సింధూ నది జలాలను నిలిపివేసింది. అప్పటి నుంచి పాక్ పిచ్చి ప్రేలాపనలు చేస్తూనే ఉంది. తాజాగా పాకిస్థాన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సింధూ నది జలాలను నిలిపివేస్తే అందులో వారి రక్తం పారుతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని ఓ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో అహ్మద్ షరీఫ్ చౌధరి ఈ వ్యాఖ్యలు చేశారు.