Sunday, June 22, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

యూపీలో పిలిభిత్‌లో 3వేల మంది సిఖ్ఖుల అక్రమ మతమార్పిడులు, దర్యాప్తు షురూ

Phaneendra by Phaneendra
May 23, 2025, 08:19 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉత్తరప్రదేశ్‌లో దిగ్భ్రాంతికర దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. భారత్ నేపాల్ సరిహద్దుల దగ్గర పిలిభిత్ జిల్లాలో సిఖ్ఖులు మెజారిటీగా ఉండే గ్రామాల్లో అక్రమంగా సామూహిక మతమార్పిడులు చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

గత కొన్నేళ్ళలో 3వేల కంటె ఎక్కువమంది సిఖ్ఖులను మతం మార్చారని అఖిల భారత సిఖ్ఖు పంజాబీ సంక్షేమ సంఘం వెల్లడించింది. పిలిభిత్ జిల్లా హజారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బైలాహా, తాతార్‌గంజ్, బామన్‌పురా, భాగీరథ్, సింఘారా తదితర గ్రామాల్లో పెద్ద సంఖ్యలో సిఖ్ఖులను మతం మార్చారు.  

ఆ ప్రాంతాల్లో సుమారు 30వేల మంది సిఖ్ఖులు జీవిస్తున్నారు. వారిలో ఎక్కువమంది వ్యవసాయదారులు, మిగిలిన వాళ్ళు చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే వారు. నేపాల్ సరిహద్దుల్లోని ఆ ప్రాంతాల్లో 2020 నుంచీ మత మార్పిడి కార్యక్రమాలు ఊపందుకున్నాయని స్థానిక ప్రజలు, సిఖ్ఖు సంస్థలూ గుర్తించాయి.  

నేపాల్ నుంచి వచ్చిన ప్రొటెస్టెంట్ పాస్టర్లు ఈ మార్పిడి కార్యక్రమాలు ప్రారంభించారు. వారు మొదట స్థానికులు కొందరిని పాస్టర్లను చేసారు. ఆ పాస్టర్లు నిరుపేదలూ, చదువు లేనివారూ అయిన స్థానిక సిఖ్ఖులకు డబ్బులు ఆశపెట్టి, వ్యాధులు తగ్గిస్తామని కబుర్లు చెప్పి మతం మార్చారు.

అఖిల భారత సిఖ్ఖు పంజాబీ సంక్షేమ కౌన్సిల్ అధ్యక్షుడు హర్‌పాల్ సింగ్ ఈ తీవ్ర సమస్య గురించి వివరించారు. స్థానిక గురుద్వారా ‘శ్రీ సింగ్ సభ’లో మీడియాతో మాట్లాడుతూ పిలిభిత్‌లోని సిఖ్ఖు గ్రామాల్లో 3వేల మందికి పైగా సిఖ్ఖులను మతం మార్చారని వెల్లడించారు. అలా మతం మారిన 160 కుటుంబాల జాబితాను జిల్లా అధికారులకు సమర్పించారు.  

కొన్ని కుటుంబాలు తమ ఇళ్ళ మీద సిలువ గుర్తులు చిత్రించుకున్నాయి. జిల్లా అధికారుల జోక్యం వల్ల చాలామంది తమ ఇళ్ళ మీద అలాంటి చిహ్నాలను తొలగించారు, కానీ క్రైస్తవాన్నే అనుసరిస్తున్నారు.

ఈ విషయం మే 13న ఒక సిఖ్ఖు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. బైలాహా గ్రామానికి చెందిన మన్‌జీత్‌ కౌర్ హజారా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్తను ఇప్పటికే క్రైస్తవంలోకి మతం మార్చేసారని, ఇప్పుడు తననూ తన పిల్లలనూ మతం మారాలంటూ ఒత్తిడి చేస్తున్నారనీ ఆమె ఆవేదన చెందుతోంది. మతం మారడానికి ఒప్పుకోకపోవడంతో ఆమె పొలాలను ధ్వంసం చేసారు, ఆమె పిల్లలపై భౌతికంగా దాడులు చేసారని ఆమె ఫిర్యాదు చేసింది.

మన్‌జీత్‌ కౌర్ ఫిర్యాదు మేరకు హజారా పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసారు. ఎనిమిది మంది వ్యక్తులు, పేర్లు తెలియని మరికొందరు వ్యక్తుల మీద అక్రమ మత మార్పిడులకు పాల్పడ్డారని కేసు నమోదు చేసారు. ఆ సంఘటన గురించి జిల్లా పోలీసులతో పాటు పూరన్‌పూర్ సబ్ కలెక్టర్ కూడా దర్యాప్తు జరుపుతున్నారని జిల్లా కలెక్టర్ సంజయ్ సింగ్ చెప్పారు. క్రైస్తవంలోకి మారితే ప్రభుత్వ పథకాలు కూడా వచ్చేలా చేస్తామంటూ కొందరు ప్రలోభపెడుతున్నారని తెలిసిందని, వాటి గురించి కూడా దర్యాప్తు చేస్తామనీ జిల్లా కలెక్టర్ చెప్పారు.

మతం మారాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు అందిందని పిలిభిత్ ఎస్‌పి అభిషేక్ యాదవ్ ధ్రువీకరించారు. ఆ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. భారత్ నేపాల్ సరిహద్దుల్లోని బలీహా, తాతార్‌గంజ్, బామన్‌పూర్, భాగీరథ్ వంటి గ్రామాల్లో 2020 నుంచీ నేపాలీ పాస్టర్ల మతమార్పిడి కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయని అఖిల భారత సిఖ్ఖు పంజాబీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు హర్‌పాల్ సింగ్ జగ్గీ చెప్పుకొచ్చారు.

సిఖ్ఖు మతస్తులు ప్రలోభాలకు లొంగి లేదా ఒత్తిడులు, బెదిరింపులకు భయపడి మతం మారుతుండడానికి కారణం వారి పేదరికం, చదువు లేకపోవడమే అని స్థానిక సిఖ్ఖు నాయకులు చెబుతున్నారు. చిత్రమేంటంటే, మత మార్పిడి  బాధితులకు వాగ్దానం చేసిన లబ్ధులు ఏవీ ఇప్పటివరకూ అందనివారు, ఆరోపితుల మీద చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సంఘటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. అన్ని సరిహద్దు జిల్లాల్లోనూ నిఘా పెంచాలని ఆదేశించారు. ‘ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడుల నిషేధ చట్టా’న్ని సమర్థంగా అమలు చేయాలన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న క్రైస్తవ మిషనరీల మీద కఠిన చర్యలు తీసుకోవాలని సిఖ్ఖు సంస్థలు డిమాండ్ చేసాయి.

పంజాబ్‌లో క్రైస్తవం, మతమార్పిడులు:

పంజాబ్‌లోనూ రకరకాల పద్ధతుల్లో మత మార్పిడులు పెద్దయెత్తున జరుగుతున్నాయి. డబ్బులు ఆశ చూపించడం, అద్భుతాలు చేస్తామని తప్పుడు వాగ్దానాలు చేయడం, కెనడా, అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వీసాలు ఇప్పిస్తామని ప్రలోభపెట్టడం వంటి చర్యలతో మతం మార్చేస్తున్నారు. పంజాబ్ రాష్ట్ర జనస్వరూపాన్ని మార్చేసేందుకు వ్యవస్థీకృతంగా, ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న కుట్ర అది. దాని ఫలితంగా పంజాబ్ క్రమంగా క్రైస్తవ మెజారిటీ రాష్ట్రంగా మారిపోతోంది.

2011 జనాభా లెక్కల ప్రకారం పంజాబ్‌లో క్రైస్తవుల జనాభా 1.3 శాతం మాత్రమే. అయితే క్రైస్తవ మిషనరీ సంస్థలు, కొన్ని మీడియా సంస్థల తాజా నివేదికల ప్రకారం ఇప్పుడు పంజాబ్‌లో క్రైస్తవుల జనాభా 15శాతానికి పెరిగిపోయింది. ఆ సమస్యను సమర్ధంగా ఎదుర్కొని పరిష్కరించడంలో సిఖ్ఖు నాయకులు, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ వంటి సిక్కు మత సంస్థలూ విఫలమయ్యాయి.

పంజాబ్‌లో ఇప్పుడు క్రైస్తవులు ఎక్కువగా గురుదాస్‌పూర్, అమృత్‌సర్, జలంధర్, లూధియానా, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లో క్రైస్తవులు గణనీయంగా పెరిగిపోయారు. ఆ జిల్లాలను ఇప్పుడు ‘చర్చ్ బెల్ట్’ అని పిలుస్తున్నారు. ఆ జిల్లాల్లో వేల సంఖ్యలో చర్చిలు, మిషనరీ కేంద్రాలూ నిర్మించారు. గురుదాస్‌పూర్, హోషియార్‌పూర్ జిల్లాల్లో అయితే అన్ని గ్రామాలూ క్రైస్తవంలోకి మారిపోయాయి. పంజాబ్‌లోని అన్ని గ్రామాల్లోనూ కనీసం రెండు కుటుంబాలను క్రైస్తవంలోకి మతం మార్చేసారు. పంజాబ్ రాష్ట్రంలో 65వేలకు పైగా క్రైస్తవ మిషనరీలు క్రియాశీలంగా ఉన్నారు. ఒక్క జలంధర్ నగరంలోనే 1500కు పైగా చర్చిలు ఉన్నాయి.

రాజూ రంగీలా, బాజీందర్ సింగ్, అంకుర్ నరులా వంటి పాస్టర్లు హిందూ, సిఖ్ఖు మతాలలోని దళితులను క్రైస్తవంలోకి మతం మార్చేసారు. తమను తాము పాస్టర్లుగా, అపోస్తలులుగా ప్రకటించుకున్న వారు ‘చంగీ సభ’ల పేరుతో కూటములు నిర్వహిస్తుండడం ఆందోళనకరమైన పరిణామం.

ఈ మోసకారి పాస్టర్లు తప్పుడు విధానాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. అద్భుతాలు చేస్తున్నట్లు నటించడం నటింపజేయడం, రోగాలు తగ్గించగలమంటూ హామీలివ్వడం, చనిపోయిన వారిని బతికిస్తామని చెప్పడం, ఆర్థిక సమస్యలు పరిష్కరిస్తామనడం వంటి మోసపూరిత విధానాలతో అమాయకులైన దళితులు, వాల్మీకి హిందువులు, మజహబీ సిఖ్ఖులను తప్పుదోవ పట్టించి మతం మార్చేస్తున్నారు. ఈ పాస్టర్లు, చర్చి నేతలూ సిఖ్ఖు కీర్తనలను పోలిన బాణీలలో ఏసుక్రీస్తు మీద పాటలు స్వరపరుస్తున్నారు. వాటిద్వారా హిందువులను మభ్యపెడుతున్నారు. విదేశాలకు వెళ్ళాలనే ఆత్రుతలో ఉండే పంజాబీ యువత ఈ మత మార్పిడి ముఠాలకు సులువుగా దొరికే మొదటి లక్ష్యాలు. క్రైస్తవంలోకి మతం మారితే వీసాలు సులువుగా వస్తాయంటూ ప్రలోభపెడతారు.

హిందువులు, సిఖ్ఖులను మతం మారేలా చేసే మరో ప్రధాన కారణం మజహబీ సిఖ్ఖులు, దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలను సామాజికంగా, రాజకీయంగా నిర్లక్ష్యం చేయడం. నిజానికి సమానత్వం, సమన్యాయం అనే నియమాల మీదనే ఏర్పడినా, సిఖ్ఖు మతంలో కుల వివక్ష కొనసాగుతోంది. అగ్రవర్ణ సిఖ్ఖులు, దళిత సిఖ్ఖుల పట్ల వివక్ష చూపిస్తుండడం కూడా వారిని క్రైస్తవం వైపు ఆకర్షితులను చేస్తోంది. క్రైస్తవంలో వారికి ఆమోదం, గౌరవం లభిస్తాయని చెప్పి మతం మారుస్తున్నా, నిజానికి ఆ మతంలో కూడా అవే అవమానాలూ, వివక్షా కొనసాగుతున్నాయి.

సిఖ్ఖుల మీద ప్రభావం చూపుతున్న మరో అంశం వోకిజం. ప్రస్తుతం పంజాబ్ చాలా వేగంగా వోకిజం వంటి పాశ్చాత్య ధోరణులను అలవరచుకుంటోంది. ఫలితంగా సుసంపన్నమైన దేశీయ సిఖ్ఖు సంస్కృతి, సంప్రదాయిక విలువలు, ఆధ్యాత్మిక వారసత్వం క్రమంగా క్షీణించిపోతున్నాయి.

Tags: Christian MissionariesChristianityIllegal ConversionsPilibhitShiromani Gurudwara Prabandhak CommitteeTOP NEWSUttar Pradesh
ShareTweetSendShare

Related News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు
general

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?
general

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు
general

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.