Sunday, June 22, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

శ్రీరామ దూత, సేవా స్ఫూర్తి ప్రదాత హనుమ

నేడు హనుమజ్జయంతి సందర్భంగా శోభాయాత్ర

Phaneendra by Phaneendra
May 22, 2025, 12:56 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

చిరంజీవులలో ఒకరైన హనుమంతుని జన్మ తిథి వైశాఖ బహుళ దశమి సందర్భంగా ఇవాళ‌ భారతదేశమంతటా జరుపుకుంటున్నారు. భగవానుడైన హనుమంతుడు సాక్షాత్తూ పరమేశ్వరుని అంశ. మన భారతీయ సనాతన సంస్కృతిలో శివకేశవుల భేదం లేదు అనేందుకు శ్రీరాముడు హనుమంతుల అనుబంధమే ఉదాహరణ. శ్రీరామచంద్రమూర్తిని ప్రేమించినంతగా హనుమంతుడు మరొకరిని అభిమానించడు. దానిని బట్టి శివకేశవుల నడుమ భేదం లేనే లేదు అని అర్థం చేసుకోవచ్చు.

హనుమంతుడు నవ వ్యాకరణ పండితుడు, చతుర్వేద పారాయణ దక్షుడు. అత్యంత శక్తివంతుడు, పరాక్రమ శీలి. హనుమంతుడి గొప్పతనం తెలుసుకోవాలి అంటే ఆయన పంచముఖాలను అర్థం చేసుకుంటే తేలికగా ఉంటుంది. ఆ స్వామిలో వానర, సింహ, వరాహ, గరుడ, అశ్వ ముఖాల తత్వాలు సమన్వియమై ఉంటాయి. ఆ ఐదు ముఖాలూ ఆయా దిక్కులను, తత్వాలను, దేవతా శక్తులను సూచిస్తాయి.

1.  వానర ముఖం (తూర్పు దిశ):

ఇది సహజమైన హనుమంత స్వరూపం. మహా బలవంతుడిగా, శత్రు సంహారకుడిగా, ధర్మ పరిరక్షకుడిగా వెలుగొందే ఈ ముఖం ద్వారా ధైర్యం, న్యాయం, అహింసా బలం సూచితమవుతాయి. విభీషణుడికి శరణు ఇచ్చిన హనుమంతుడు, రావణుని వంటి అధర్మవాదులను సంహరించడంలో నిపుణుడు.

2 సింహ ముఖం (దక్షిణ దిశ):

ఈ ముఖం హనుమంతుని ఉగ్ర రూపాన్ని సూచిస్తుంది. సీతమ్మ తల్లి అవస్థను చూశాక, తన క్షేత్రగత శక్తితో లంకా నగరాన్ని శాసించిన తత్వం ఇదే. అక్షకుమారుడు సహా వేలాది రాక్షసులను సంహరించిన శక్తి ఈ రూపానికి ప్రతీక.

3 గరుడ ముఖం (పశ్చిమ దిశ):

విషాన్ని తొలగించే అమృత స్వరూపమైన గరుడ తత్వం ఈ ముఖం. సంజీవని ఔషధిని తీసుకువచ్చి రామ లక్ష్మణులను కాపాడిన సందర్భం దీనికి ప్రాముఖ్యతను ఇస్తుంది. ఇది వాయు, ఆకాశ తత్వాల సమ్మేళనం.

4. వరాహ ముఖం (ఉత్తర దిశ):

భూమిని ఉద్ధరించిన వరాహ స్వామి తత్వం ఈ ముఖంలో ఉంది. సీతమ్మను రాక్షసుల చెరలోంచి విడిపించిన విధానం వరాహ స్వరూపానికీ హనుమంతునికీ ఉన్న సారూప్యతను తెలియజేస్తుంది. భూమికి, ఐశ్వర్యానికీ ప్రతీక అయిన కుబేర తత్వాన్ని కలిగినది ఈ ముఖం.

5 అశ్వ ముఖం (ఊర్ధ్వ దిశ):

ఇది హయగ్రీవ తత్వంతో కూడిన ముఖం. జ్ఞానం, వేదశాస్త్రాలపై అవగాహన ఉన్న హనుమంతుని రూపం. రాముడు మొదటిసారి కలిసినపుడు హనుమంతుని మాట్లాడే తీరు చూసి అతనిలో ఉన్న వేద పాండిత్యాన్ని గుర్తించాడు. ఇది ఆకాశ తత్వాన్ని సూచిస్తుంది.

రామాయణంలో  హనుమంతుని గొప్పతనం అనేక సందర్భాలలో కనిపిస్తుంది.

(1) శింశుపా వృక్షం పైనుండి సీతమ్మతల్లిని చూశాక, చిన్న రూపంలో వచ్చి రాముని పేరు చెప్పి భరోసా కలిగించడం – అనంతరం విశ్వరూపం ద్వారా తన బలాన్ని చాటడం – హనుమంతుని వినయం, వివేకానికి నిలువెత్తు నిదర్శనం.

(2) నమస్కార ముద్రతో ఉండే దేవతామూర్తి. ఇది వినయానికి గుర్తు.

భగవంతుని విగ్రహాలు సాధారణంగా అభయ ముద్రతో ఉంటాయి. కానీ హనుముని విగ్రహం నమస్కార ముద్రలో ఉంటుంది. ఎందుకంటే ఆయన సృష్టిలోని ప్రతి అణువులో రాముని దర్శించి, తనే భక్తుడిగా మనం ఎదుర్కొంటున్న రామచంద్రుని ప్రార్థించేవాడిగా కనిపిస్తాడు.

(3) ఉగ్రాంజనేయుడు – దాసాంజనేయుడు

హనుమంతుడు ధర్మమార్గంలో నడిచేవారికి “అభయాంజనేయుడు”, అధర్మ మార్గంలో నడిచేవారికి “ఉగ్రాంజనేయుడు”. ఈ రెండు స్వరూపాల్లోనూ పరమ దివ్యత్వాన్ని చూపిస్తూ సర్వలోక హితాన్ని కలిగించే పరమేశ్వర తత్వమే అనుభూతి పరంగా భక్తుల్లో ఉట్టిపడుతుంది.

ఆ విధంగా చూసుకుంటే హనుమంతుడి గొప్పతనం మనకు తెలుస్తుంది. అన్ని స్థాయుల్లోనూ అన్ని రూపాల్లోనూ హనుమంతుల వారు మనకు ఆదర్శవంతంగా నిలుస్తారు. జై భజరంగబళీ..!!

Tags: Hanuman JayantiLord HanumanLord RamTOP NEWS
ShareTweetSendShare

Related News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు
general

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?
general

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు
general

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.