జమ్ము కశ్మీర్‌లో సైనికులకు, ఉగ్రవాదుల మధ్య కాల్పుల మోత మోగుతోంది. కిష్త్వర్ జిల్లా సింగ్‌పొరా ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. నలుగురు ఉగ్రవాదులను సైన్యం చుట్టుముట్టింది. ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
ఆపరేషన్ సింధూర్ తరవాత పాక్ భారీగా ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు తీవ్ర ప్రయత్నం చేసిందని సైన్యం ధ్రువీకరించింది. ఉగ్రమూకలను భారత్‌లో చొప్పించేందుకు పాక్ సైన్యం సరిహద్దుల వెంట పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడిందని సైన్యాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. అయితే పాక్ ప్రయత్నాలను సైన్యం తిప్పికొట్టింది.
పాక్ పన్నాగాలను తిప్పికొట్టినట్లు బీఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎస్ ఎస్ మండ్ జాతీయ మీడియాకు తెలిపారు. మన సైన్యం తీవ్ర స్థాయిలో విరుచుకుపడి భారీ నష్టం కలుగజేసినట్లు చెప్పారు. పాక్ ఉగ్రవాదుల కోసం కాచుకుని కూర్చొని సరిహద్దు వద్దకు చేరుకోగానే భారీగా కాల్పులు జరిపినట్లు మండ్ వెల్లడిచారు. 50 మంది ఉగ్రమూకలు సరిహద్దు దాటే ప్రయత్నాలను స్పష్టంగా గుర్తించినట్లు చెప్పారు. ఉగ్రమూకలను తరిమి కొట్టడంలో మహిళా సైనికులు బలంగా పోరాడినట్లు మండ్ గుర్తుచేశారు.