పహల్గాం ఉగ్రదాడి తరవాత భారత్, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పాక్ గగనతలంపై భారత విమానాలను నిషేధించారు. భారత గగనతలంపై పాక్ విమానాలకు ప్రవేశం లేదు. పహల్గాం ఉగ్ర దాడి తరవాత పాకిస్థాన్ తీసుకున్న గగనతల నిషేధం రేపటితో ముగియనుంది. దీంతో పాక్ మరో నెల రోజుల పాటు గగనతలం మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం గగనతలం నెల రోజులు మాత్రమే మూసివేయడం సాధ్యం అవుతుంది. అందుకే పాక్ మరోసారి నెల రోజులపాటు గగనతలం మూసి వేస్తూ నిర్ణయం తీసుకుంది.
1999 కార్గిల్ యుద్ధం సమయంలో 2019 పుల్వామా ఉగ్రదాడి తరవాత పాక్, భారత్ గగనతలాలపై నిషేధం విధించుకున్నాయి. తాజాగా మరోసారి నిషేధం విధించారు. పహల్గాం ఉగ్రదాడి తరవాత భారత్ పాకిస్థాన్‌పై కఠిన ఆంక్షలు విధించింది. సింధూ జలాల పంపిణీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.వాణిజ్యం నిలిపివేసింది. పాక్ పౌరులను దేశం వదలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాక్ భారత్‌పై కూడా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.