ఏపీకి మరో వందేభారత్ రానుంది. త్వరలో విజయవాడ బెంగళూరు నగరాల మధ్య వందేభారత్ పరుగులు తీయనుంది. ప్రయాణ సమయం తొమ్మిది గంటలు. ప్రయాణీకులకు మూడు గంటలు ఆదా కానుంది. విజయవాడ తిరుపతి మీదుగా బెంగళూరుకు త్వరలో వందేభారత్ ప్రారంభించేందుకు రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతి వెళ్లే ప్రయాణీకులకు కూడా ఈ వందేభారత్ సౌకర్యవంతంగా ఉంటుంది. మొదట 8 బోగీలతో ప్రారంభిస్తారు. ఉదయం 5 గంటల 15 నిమిషాలకు విజయవాడలో బయలు దేరే ఈ రైలు, 5 గంటల 39 నిమిషాలకు తెనాలి, 6 గంటల 28 నిమిషాలకు ఒంగోలు, 7 గంటల 43 నిమిషాలకు నెల్లూరు, 9 గంటల 45 నిమిషాలకు తిరుపతి, 10.27కు చిత్తూరు, 11.13 కాట్పాడి, 13.38 కృష్ణరాజపురం, మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు బెంగళూరు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో బెంగళూరులో 2 గంటల 45 నిమిషాలకు బయలుదేరి, కృష్ణరాజపురం14.58, కాట్పాడి 17.23, చిత్తూరు 17.49, తిరుపతి 18.55, నెల్లూరు 20.18, ఒంగోలు 21.29, తెనాలి 22.42 నిమిషాలకు, విజయవాడకు రాత్రి 11 గంటల 45 నిమిషాలకు చేరుకోనుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణీకులకు వారానికి మూడు రోజులు మచిలీపట్నం యశ్వంత్‌పూర్ కొండవీడు ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉంది.